దేశమును ప్రేమిస్తున్నా!

అమోర్ డి పేట్రియా*ఎక్క వలసిన విమానం ఎక్కడ తప్పిపోతోందోనని … పెట్టేబేడాను బరబరా లాక్కుంటూ..హడావుడిగా జె.ఎఫ్.కె. టెర్మినల్ 4 నుంచి 1 దాక ఉరుకులుపరుగుల నడకతో వెళుతున్నానా…టక్కున స్థంభించిపోయినట్లు నిలబడిపోయాను .సరిగ్గా ఈ శిల్పం ఎదురుపడగానే!నిజం.శిల్పి వినయంగా అన్నట్లుగా..పెదవిదాటలేని మాటలెన్నింటినో మాట్లాడగల శక్తిఉన్న ఆ చేతులు సమిష్ష్టిగా మాట్లాడాయి.మరోసారి.భావోద్వేగాలన్నీ ఆ చేతి వేళ్ళ కొనల్లోంచి జాలువారుతున్నాయి.ఆ ముంజేతుల ముడతల్లో పకరిస్తున్నాయి. ఆ అరచేతులపై పొంగిననరాల్లో ఆలోచనలెన్నో చిక్కుముళ్ళు పడ్డాయి.అవన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొని నా ముందరికాళ్ళకు బంధాలయ్యాయి.అచ్చంగా నాతోనే… Read More దేశమును ప్రేమిస్తున్నా!

వినమ్ర వందనం

అసంఖ్యాకమైన తెలుగు నాటికలను గ్రంథస్థం చేసిన, చేస్తోన్న ఆచార్య కందిమళ్ళ సాంబశివరావు గారు ఫోన్ చేశారు. ఒక చిన్న పల్లెటూరు లో ఐదురోజుల పాటు నాటకపోటీలు జరుగుతాయని, ఆ వేదిక మీదనే ప్రతిపూటా వివిధ సాంస్కృతిక రంగాలను చెందిన లబ్దప్రతిష్టులకు పురస్కృతులను చేస్తామని, ఈ ఏడాది సాహిత్యరంగంలో చంద్రలతకు ఆ గౌరవం ఇవ్వాలని వారి పరిషత్తు బృందం నిర్ణయించినదని తెలియచేశారు.వ్యవసాయ ప్రధాన రచనలలో రైతు జీవితాలను చిత్రించినందుకు గాను, సంక్రాంతి వేళ సత్కరించడం సముచితమని భావిస్తున్నామని ,తప్పకుండా… Read More వినమ్ర వందనం

Cracked Glass Jar and Other Stories

శీతాకాలపు ఆకాశం అంచుల్లోముసిరిన మంచుతెరల్లోతడించిందో ఏమో… చడీచప్పుడు లేకుండావిరిసీవిరియని మొగ్గల మీదవాలింది ఈ వన్నెచిన్నెలఊదా సీతాకోక చిలుక! అదుగో …సవ్వడి లేని ఢంకా మోగిస్తోంది“అహోయ్!ఒక శుభవార్తను తెచ్చానోచ్!” *డా.CLL జయప్రద గారికి అనేక ధన్యవాదాలు.మధురాంతకం నరేంద్ర గారికి నమస్కారాలు.రత్నసాగర్ వారికి వందనాలు. Cracked Glass Jar and othe stories,Chandra Latha Translated from Telugu byDr.CLL Jayaprada Ratna Traslation Series,Ratna Sagar Pvt Ltd ,New Delhi

కౌంటింగ్ రోజెస్

అదే..ఏం చేస్తున్నావని? ఉవ్వెత్తిన ఉప్పెనలో…ముంచెత్తిన కుండపోతలో…తెగిపడ్డ వాగుల వరదల్లో..కరిగిపోయిన కరకట్టలవాలున…నానిన పచ్చిగోడల నడుమ…కురుస్తోన్న పైకప్పుల కిందా ..ఫెళఫెళ విరిగిపడుతోన్నకాండాల ప్రతిధ్వనుల మోతల్లో..నిన్నటిపచ్చని వరికంకుల బురద మోపులు కళ్ళల్లో మెదులుతోంటే…కలుక్కుమంటోన్న గుండెలు బావురుమంటోంటే … అదే..ఏం చేస్తున్నావని? విచ్చిపోయిన రహదార్లు ఎక్కడివారక్కడ గప్ చుప్ గా ఉండమంటుంటే… మరుగేదో మురుగేదో మంచేదో ముంచేదో మరిచిన నీరువీధుల్లోంచి గడపల్లోకి విచ్చలవిడిగా పరుగులెడుతోంటే..దాహార్తికి గుక్కెడు నీరెక్కడా అని వెతుకులాడుతోంటే…విరుచుకుపడబోయే మహమ్మారి నిశ్శబ్ద వికట్టాహాసమేదోప్రమాద సూచికలా వినబడుతోంటే…. చిమ్మచీకట్లలో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా …… Read More కౌంటింగ్ రోజెస్

“మీకుగానీ నేను కావాలా?”

పాతూరి నాగభూషణం గారు మౌనం మాట్లాడుతుందనీ,  నిశ్శబ్దం సంభాషిస్తుందనీ, ఏకాంతం లో సముహం చుట్టుముడుతుందనీ …ఎవరైనా అంటే, అవన్నీ నా బోటివారి ఊహాజనిత రాతలని అనుకోవచ్చును.    అయితే, ఆ భావనలన్నీ ఇక్కడ సమావేశమైన మనందరికీ అంతో ఇంతో..అప్పుడో ఎప్పుడో.. అనుభవంలోకి రాకుండా పోలేదు.   మరీ ముఖ్యంగా, ఒంటరిగా ఏదో ఒక మూలన చేరి,  పుస్తకం చదువుతూ చదువుతూ ,  ఆ మౌనంలో ఆ నిశ్శబ్దంలో  ఆ ఏకాంతంలో.. వినగలిగినవీ, చూడగలిగినవి.. అన్నీ ఇన్నీ కావు.… Read More “మీకుగానీ నేను కావాలా?”

13. తేనె పలుకుల పిట్ట

@ అడవి అంచున * తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుందని మనకో పొడుపుకథ ఉంది కదా. ‘ఉత్తరం’అని టక్కున పొడుపుకథను విప్పి చెబుదురు గానీ, నేను అంటోందేమో, ఉత్తుత్తి ఉత్తరాల పిట్ట గురించి కాదండి…నిజంగా తోక లేని పిట్ట గురించే నండి. ఎన్నెన్ని ఆమడల నుంచి ఎగిరొచ్చాయో గానీ, లాజెల్ ఉడ్ పచ్చ బడుతున్న కొద్దీ, తోకలేని పిట్టలు తరుచు  తారస పడసాగాయి. పచ్చికలో విరుస్తోన్న పసుప్పచని డాండిలియన్ పూలలాగా.ఎక్కడ బడితే అక్కడ!  వసంతకాలం… Read More 13. తేనె పలుకుల పిట్ట

12. నీలంపు గిలక్కాయి

  @ అడవి అంచున 11.6.2023     వసంతం తొలినాళ్ళు. అడవి అంచుకి వెళ్ళిన రెండోరోజో మూడో రోజో…అలా నాపాటికి నేను వెళుతోంటే, పిల్లలను ఆడించే గిలక్కాయి చప్పుడు వినబడింది.  ఆగాను. అటూఇటూ చూశాను. కనుచూపు మేర ఎవరూలేరు.    పిల్లలూ లేరు. వారి కంటనీలాలు కారితే, వారిని బుజ్జగించడానికి గిలక్కాయలాడించే పెద్దలూ లేరు.   అంతా నిశ్శబ్దం. ఇంకా చిగురించని రెడ్ ఓక్ మానుల వరసను దాటుకొని, క్రాబ్ ఆపిల్ చెట్ల వైపు నడుస్తున్న కొద్దీ ,… Read More 12. నీలంపు గిలక్కాయి

11.ఎరుపెక్కి ఓ పిట్ట

@ అడవి అంచున 5-6-2023 * విరజిమ్మిన కుంకుమలో , విరబూసిన మంకెనలో …అనుకొనే వాళ్ళంపాపిటనడుమో..ఆకుల మాటునో కనబడితే.అదే ఆకాశానో అడవి అంచునో కనబడితే ,అది ఖచ్చితంగా ఎర్ర తురాయిపిట్టే.చిక్కుడుపూవు నుంచి రాగిచెంబు వరకు, కంటిజీర నుండి పండుమిరప వరకు , మావిచిగురు నుంచి రత్నమాణిక్యం వరకు, ఎరుపులో ఎన్నెన్ని వన్నెలున్నా …తురాయిపిట్ట ఎరుపు తురాయి పిట్టదే!‘ఎవరు అద్దేరమ్మా ఈ ఎరుపును … తురాయిపిట్ట రెక్క రెక్కకు …!’ అని ఆశ్చర్యం కలుగకపోదు. ఆ రెక్కల ఎరుపు… Read More 11.ఎరుపెక్కి ఓ పిట్ట

10. రంగారు చెట్టున

@ అడవి అంచున 2.6.2023 * “రంగారుచెట్టు మీద బంగారు గోరువంక వినిపించే కథలు విందాము పదరా.. చల్ మోహన రంగా !” అదేమో గానీ, రంగారు చెట్టు మీద సింగారి పిట్టను చూశానండి! అదే, తుర్రు బుర్రున అడవంతా తిరుగుతూ నాతో దోబూచులాడుతుందే, ఆ ఎర్ర తురాయిపిట్టే! పొరుగింటి పెరటిలోకి పొరపాటున అడుగు పెట్టానేమో అని, ముక్కచీవాట్లు తిన్నదాన్ని, ఆ మర్నాడు తిన్నగా వెళ్ళానా అంటే… అదెలా? ‘ఎటన్నా వెళ్ళు గానీ,అటేపు వెళ్ళకు ‘ అని… Read More 10. రంగారు చెట్టున

9.ఎర్ర తురాయి పిట్ట

@ అడవి అంచున 25.5.2023 వసంతానికి కుంకుమలు చల్లుతున్నట్టు, ఎర్రతురాయి పిట్టమారాజు రివ్వు రివ్వున  చెట్ల నడుమ దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నాడు. ఒకసారి ఈ కొమ్మ మీద కనబడినట్టే కనబడి,కనురెప్పవాల్చే లోపునే, ఆమడదూరాన మరొక చెట్టెక్కి కూర్చునేవాడు. ఇప్పుడిక్కడే చూసానే, అనుకొనే లోపలే,మరెక్కడో కుంకుమ ఛాయలు కనబడేవి.ఎవరో తుంటరిపిల్లలు జాజరో బుక్కావో చల్లినట్టుగా. ‘భలే తురాయి పిట్ట! మహా అంటే ఏడెనిమిది అంగుళాలు ఉండదు! ఎలా దోబూచులాడుతుందో! అల్లరిపిల్లల కోతికొమ్మచ్చులాటలా!’ ఆ తురాయిపిట్టను వెంబడిస్తూ …కళ్ళను తలను… Read More 9.ఎర్ర తురాయి పిట్ట