మొలకెత్తిన మొరుసు మట్టి !

ఎన్నాళ్ళగానో  వాయిదా వేస్తూ వచ్చిన ఈ ప్రయాణం, ఇన్నాళ్ళకు కుదిరింది. గడ్డి పరకతో విప్లవం సాధించ వచ్చునని ఒక సజీవ ఉదాహరణ గా నిరూపణగా నిలిచిన బబ్లూ గంగూలి గారిని, మేరీ గంగూలి గారిని కలవాలని అనుకొంటూనే, కాలం గడిచి పోయింది. మేము వెళ్ళే సరికి, బబ్లు గారు… సమీప గ్రామంలో వరి నాట్లు వేయించే పనిలోనూ, మేరీ గారు…వికలాంగుల సంరక్షకుల శిక్షణా శిబిరం నిర్వహణ లోనూ ఉన్నారు.  అంతటి పని వత్తిడిలో ఉన్నా కూడా, మా… Read More మొలకెత్తిన మొరుసు మట్టి !

అయ్యో చంద్రన్నా, 

అయ్యో చంద్రన్నా, ఇంతలో ఎంత మాట వినవలసి వచ్చింది! చెట్టుపై ఒదిగిన చిన్ని ఎర్రపిట్ట ప్రాణం వాయులీనం అయినదనీ! వినీల జగతిలో లీనమైనదనీ!విశ్వాంబరమైనదనీ! ఇది ఏమీ బాలేదు అన్నా, తనలో తాను బందీ అయిన ఈ మాయదారి ప్రపంచపు విడుదలకు మనం ఇంకా తాళంచెవుల వెతుకులాట పూర్తిచేయలేదు! మీరొక పురాభావనగా మారిపోతారా?అలా అర్థాంతరంగా తరలి పోతారా ? చిక్కుబడిన చీకటి దారుల్లో, మీరు విసిరివేసిన నల్లమిరియాల జాడలు ఎలా వెతుక్కోవడం! మాయాలాంతరు కూడా మసిబారిందే! సమకాలీన తెలుగు… Read More అయ్యో చంద్రన్నా, 

అనగనగ అతిశయమే !

అవును గానీ, చెల్లి కృష్ణమ్మ నల్లని నిగారింపులతో బిరబిరా సాగుతుంటే, సోదరి గోదావరమ్మ పాలవెన్నెల్లా పరుగులు పెడుతుందేం? ఎగిసిపడే గంగమ్మ మిడిసిపాటును, ఏ కంట జారిన కన్నీటి చుక్క ఏ కొనగోటను ఒడిసిపట్టి, అణిచిపెట్టిందో ! అది “ఉట్టి” అయితేనేమి.ఉరుము ఉరిమి “మంగలం” మీద పడి,ఆ “వేపుడు చట్టి” పెటిల్మంటేనేమి? “తడి” ఆరని “చిగురు” చీకట్లలో ,వెలుగుతోన్న “దివిటీ” కావచ్చు. పిల్లల ఆటలవేళల పకపక నవ్వులు మోసుకు వచ్చేది, ఆ క్రమం తప్పనివ్వని గంటలు మోగించే “బడిబూరాలు”… Read More అనగనగ అతిశయమే !

నిర్ణయం లా…

యధాలాపంగా చిన్న సినిమాలు తిరగేస్తుంటే, అనుకోకుండా, శివ సోమయాజి గారి చిన్న కథ పలకరించింది.”నిర్ణయం ”    లా. “పసుప్పచ్చని అడవిదారిలో రెండు దార్లు చీలేచోట ” సినిమా విరమించింది. నాకు గుర్తున్నది. కథలో ప్రధాన పాత్ర చూపు ఆసుపత్రి దారి వైపు నిలవడం ముగియడం, ఆ ముగింపు బోలెడంత చర్చకు దారి తీయడం, మంచీచెడు, మానవకోణాలు, ప్రాపంచిక దృక్పథాలు ..అవీ ఇవీ అన్నీ మాట్లాడుకొన్నాం. మళ్ళీ మాట్లాడుకోవచ్చు, ఈ సినిమా చూసాక! నిజానికి, భూగోళానికి ఇవతల… Read More నిర్ణయం లా…

నిశ్చయముగ నిర్భయముగ 1

Originally posted on మడత పేజీ:
మా ఇంటి పుస్తకాల అరలో శ్రీశ్రీ గారు, చలం గారు లేరని నేను గ్రహించేటప్పటికే, నేను  సాహిత్య విద్యార్ధిని. అందులోను ఆంగ్లసాహిత్యం. కొద్దిపాటి రచనలు కూడా అచ్చయ్యాయి  “ఏమిటీ ? మహాప్రస్థానం” చదవకుండా కథలు రాసేస్తున్నారా? అందులోని ప్రతి అక్షరం నాకు కంఠోపాఠం!” అంటూ అత్మీయ సాహితీ మిత్రులొకరు కళ్ళర్రజేసి, ఆశ్చర్యపోయి ,ఆ పై జాలి కురిపించారు. ఆ పై , మెత్తగా హెచ్చరిక చేశారు. దడ పుట్టి బిక్కచచ్చి , వారి…

నిశ్చయముగ నిర్భయముగ

Originally posted on మడత పేజీ:
పాలమూరులో మేము … పనిగట్టుకొని ఎవరో నియమం ఏర్పరిచినట్లుగా, క్రమం తప్పకుండా, ప్రతి ఆదివారం … ఉదయం కుంకుళ్ళతలంటు , మధ్యాహ్నం మంచి మసాలాభోజనం, ఆపై మ్యాట్నీ షో కు ప్రస్థానం. అప్పుడు నాకు పదకొండేళ్ళు.మా చెల్లెలు ,కమల , నాకన్నా ఏడాదిన్నర చిన్నది. సినిమా టిక్కెట్లు…బారానా(ముప్పావలా), రూపాయి ,రూపాయిన్నర.  అమ్మ తలా రూపాయి ,మరో పదిపైసలు బటాణీలో పుట్నాలో కొనుక్కోమని ఇచ్చి పంపేది.  మేము పరమబుద్ధి మంతుల్లా బారానా టిక్కెట్టు కొనుక్కొని…

పడుగు పేక

చాలా ఆలస్యంగానే కావచ్చును కాక, కంచివరం సినిమా ఇప్పుడే చూసా. కంచిపట్టుచీరను తలుచుకున్నప్పుడల్లా, ఈ సినిమాని తలుచుకోకుండా ఎలా ఉండగలను ఇక? పట్టు పావడా కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నా, పరుగులు ఆపని పక పక నవ్వుల పాపాయి గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది ? ఐలారం నేత గాళ్ళు ,చీరాల పేరాల సుతిమెత్తని చీరలలో మా అమ్మ మదతపెట్టి తెచ్చిన తన పుట్టినింటి జ్ఞాపకాలు. గూడవల్లి చావిట్లో మగ్గం చప్పుళ్ళు ,దొడ్లో గంగాళాల్లో నానేసిన రంగురంగుల… Read More పడుగు పేక

ఎంతెంత? తానెంత?

ఎంతెంత? తానెంత? ఈ విశాల ధరిత్రి ముందు మనిషెంత? అయినా, కొలతలు వేస్తాం.  కొరతన పడతాం. కలతలు పడతాం.కలవరపెడతాం. కక్షలు కార్పణ్యాలు, యుద్దాలు,వ్యాజ్యాలు …అంతా ఆ సూది మొన మోపే భూమి కోసమే గా. కరువులు కాటకాలు , వానలు వరదలూ…ఎన్నెన్ని చూసిందో ఈ భూమి తల్లి ! పంటలూ పబ్బాలు…చావులూ పుట్టుకలూ… ఆయమ్మ ఎరుగని వైనాలా వైభోగాలా ? తన వేలాది ఏళ్ళగమనంలో. *** నలువైపులా పరుచుకొన్న నడిగడ్డ నల్లరేగడి ! నివ్వెరపోతూ నిలబడి పోయిన… Read More ఎంతెంత? తానెంత?

“ఏనుగును చూసిన వాడు”

“ఏనుగును చూసిన వాడు” కథ చాలా హృద్యంగా ఉన్నది. http://epaper.navatelangana.com/1155955/Sopathi-Weekly/sunday-Book#dual/12/1 ఇప్పుడే ఆ కథ చదివిన ఆర్ధ్రత , ఇంకా నా కనురెప్పలని వదలనంటొంది. పిల్లలల్లొని సహజ కుతూహలమూ, ప్రకృతి ప్రకోపమూ,అడవి.ప్రమాదపు అంచున మనుగడ. ఇక, ఆఖరి వాక్యాలు ప్రభుత్వ మనస్తత్వాన్ని చాలా సరళంగా ,సహజంగా చెపుతూ, అసలు ఏనుగెవ్వరో చెప్పకనే చెప్పాయి ! అయినా, ప్రమాదాన్ని జరగనివ్వాలా? ప్రమాదాన్ని సూచించాలా?అదీ ,పిల్లల విషయంలో.ఆలోచిద్దాం ! రచయిత Palamanerbalaji Knపలమనేరు బాలాజి గారికి శుభాకాంక్షలు http://epaper.navatelangana.com/1155955/Sopathi-Weekly/sunday-Book#

తెరంతా… చట్టరీత్యా…

“పొగతాగుట చట్టరీత్యానేరం.” “మద్యపానం చట్టరీత్యా నేరం.” బావుంది.భల్ భలే.. చెప్పారు. ఎప్పుడు హీరో గారు ఎగరేసి, బీడీ ముక్కని నోట్లోపెట్టుకొన్నా…ఓ సీసా నో బిరడా తీసినా.. తెర మీద తళుక్కున మెరిసి పోయిన ముక్కలివి. పాత క్రికెట్ సారథి పనికట్టుకొని అరువు గొంతులో… తెలుగులో… అరిచి అరిచి చెప్పి వెళ్ళారు మధ్య మధ్యలో. భలే భలే! మందమతిని.ఒక్క విషయం మాత్రం ఎంతకీ నా మట్టి బుర్రకి తట్టలా ! మరి, హత్య చేయడం చట్టరీత్యా నేరం. మారణాయుధాలు ధరించడం… Read More తెరంతా… చట్టరీత్యా…