ఊరకుండక ఉద్యోగానికి పోతే

ఉదరపోషణార్ధ0 ఉద్యోగం తప్పదు కదా. ఎవరికైనా. ఎంత వారికైనా. అందునా , ఉద్యోగం ఈ యుగ ధర్మం. ఉత్తిత్తునో ఉబలాటపడో ఉబుసుపోకో ఉద్యోగం చేసే రోజులు కావివి. అయినా ,ఉత్సాహం కొద్దీ ఉద్యోగం ! ఉద్యోగాలలో ఏ ఉద్యోగమైనా మేలు .. జీతాలు ఇచ్చే ఉద్యోగం కన్నా. ఎ. టి. యం యంత్రాలు జీతాలు పంచేస్తుంటే కాస్త జోరు తగ్గింది కానీ.. ఇప్పటికీ ..ఎన్నో ఆఫీసుల్లో జీతాలు ఇచ్చే ఉద్యోగం పదిలంగా ఉన్నది. నెలాఖరు దాటిన అర్ధరాత్రి… Read More ఊరకుండక ఉద్యోగానికి పోతే

సెందర వొంక

ఎగువకు ఎట్లొస్చాయి సామీ… కట్ట మీంచి ఎగిరొస్చాయా? * నేర్చినోనివి నీకే ఎర్క .. నీల్లల్ల శాపను నాకేమెర్క ? శాయన్న ఆ నీటిలో చేపకు తెలిసినంతయినా తెలవదు…! కేశవ చంద్రవంకలు కూడా అదృశ్యమై పోయాయా?అరుదై పోయాయా? హిల్సా లాగా.. బైజీ లాగా..సామన్ లాగా.. ! అక్షత ఆ చేప మనసులో ఏముందో తెలిస్తే ఎంత బావుణ్ణు..! * “జలచరాల పై ఒక బహిరంగ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించవలసిన అత్యవసర పరిస్థితి ఎక్కడో లేదు. ఉన్నది ఇక్కడే..!… Read More సెందర వొంక

వెయ్యిన్ని ఎనభై నాలుగు

అనుకొంటాం. గుప్పెడన్ని అక్షరాల్ని చేతబట్టుకొని ఆకాశమంతా చుక్కలు పెట్టి ముగ్గులేసి రంగవల్లులు దిద్దగలమని..! కానీ, అపురూపమైన క్షణాలను అక్షరబద్దం చేయడం అంత సులువు కాదు. కొన్నాళ్ళ నాటి సంగతి. ఒక జాతీయ సాహితీ సదస్సు. అల్లంత దూరాన.. తెలుగు వారు. ఒక పక్కగా… వరసలో ముందుకు సాగుతూ.. అందరితో పాటూ నేను. అప్పటికే పరిచయమైన నవనీతదేబ్ సేన్ గారు చనువుగా నా చేయి పట్టుకొని పక్కకు లాగారు. మరింత చనువుగా .. నా చేతిని మరొకరి చేతిలో… Read More వెయ్యిన్ని ఎనభై నాలుగు

ఆకేసి .. బువ్వేసి.. పప్పేసి..

శ్రావణ మాసం వచ్చిందంటే ఒకటే సందడి. పెళ్ళిళ్ళు పేరాంటాలు. ఇప్పుడు పడమటి పెళ్ళిళ్ళ సుడి గాలి వాటం కాస్త సర్దుకొన్నా.. తెలుగు వారి పెళ్ళి వ్యవహారాల్లో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. మండపం పై వాడే పువ్వు నుంచి భోజనం అయ్యాక ఇచ్చే తాంబూలం వరకు. వీడియో ఫ్రెండ్లీ గాను .. అంగ రంగ వైభోగం గాను సాగుతున్నాయి. ఇక, భోజనాల విషయానికి వస్తే.. చాట్ నుంచి చైనీస్ వరకు కోరిన వంటకం వడ్డన కు… Read More ఆకేసి .. బువ్వేసి.. పప్పేసి..

సొంపు సొబగు

మొదట, ఇవ్వాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన పెద్దలకు ధన్యవాదాలు. ఇక్కడి దాకా నన్ను నడిపించుకు వచ్చిన పిల్లలందరికి జేజేలు . పిల్లల తరుఫున , వారి ప్రతినిధిలా, వారి అక్క లా.. నేను మీ ముందు నిలబడ్డాను. పిల్లల కోసం తమ ఆలో చనను, సృజనను ,తమ జీవితాలనే అంకితం చేసిన పెద్దలు నిలబడిన చోటు ఇది. మీరు నన్నుఇక్కడ నిలబెట్టడంలో, నాకు ఒక సందేశం ఒక గట్టి సూచన అందాయి. ఆ పెద్దల… Read More సొంపు సొబగు

పర్సు కొద్దీ పసిడిజడ

ఇప్పుడు వినడానికి విడ్డూరం గా ఉండదేమో కానీ, రెండు మూడేళ్ళ నాటి మాట. ఒక్కసారిగా తెలుగు నాట ఏ పందిట్లో చూసినా పసిడిజడల మిల మిలలు.నోరెళ్ళబెట్టామంటే నమ్మండి! సరిగ్గా రెండా మూడా లేదా నాలుగా అని నిలదీస్తే ..గబుక్కున చెప్పలేము. బెత్తెడుజడా జానెడుజడా లేదా జానాబెత్తెడు జడా ..అంటే మాత్రం చటుక్కున చెప్పొచ్చు. మీ అమ్మాయి ఈకలా జుట్టు కత్తిరించుకున్నా దిగుల్లేదు. మీ ఆవిడ లేజర్కట్ చేయించుకొన్నా ఫరవా లేదు.పిన్నుల్తో అతికించ వచ్చు.కొక్కేలతో తగిలించ వచ్చు .… Read More పర్సు కొద్దీ పసిడిజడ

ములుకు

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మాటిమాటికీ మార్కెట్ మాయాజాలం అన్న మాట ములుకు లా గుచ్చుకొంటోంది. ఆ మార్కెట్ లేక పోతే , మాకు MJ ఎవరో తెలిసేదా?మా దాకా ఆ స్వరం చేరేదా? ఆ విద్యుత్ ప్రవహించేదా? ఇలా చూడండి. నిన్నటికి నిన్న… మా వూళ్ళో… మా వీధిమలుపులో… టౌన్ హాలు లో పిల్లవాడొకడు .. మెలికలు తిరుగుతూ.. మూన్ వాక్ చేస్తూ..నర్తిస్తూ .. బావురుమంటాడా..? ఎక్కడి వాడో ఎవరో .. తెలియని ఒక… Read More ములుకు

Being Famous

ప్రముఖంగా ఉండడం .. అందరికీ ..అన్ని విధాల అచ్చిరాదు. అదిగో చూడండి.. పాప్ మహరాజు మన కళ్ళ ముందే …ఎలా కదిలి పోతూ ఉన్నాడో…! అతని గొంతు వినిపించని రాగాలేవో ఏవేవో.. మన చుట్టూ.మన లోలోను. చటుక్కున గుర్తొచ్చాడు..క్రిస్టఫర్ మార్లో..దాక్టర్ ఫాస్టస్ గొంతులో గుస గుసలాడుతూ.”success made me wanton!”అంటూ. ఎంత చిత్రం…! తెలుసు. మళ్ళీ మళ్ళీ అదే విషాదం. పునహ్ పునహ్. ఊహించని తీరాలలోకి ప్రయాణం. ఊపిరి తిప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి కావడం. కీర్తి .కాంక్ష.కనకం. అంతే… Read More Being Famous