పర్సు కొద్దీ పసిడిజడ

ఇప్పుడు వినడానికి విడ్డూరం గా ఉండదేమో కానీ, రెండు మూడేళ్ళ నాటి మాట.
ఒక్కసారిగా తెలుగు నాట ఏ పందిట్లో చూసినా పసిడిజడల మిల మిలలు.నోరెళ్ళబెట్టామంటే నమ్మండి! సరిగ్గా రెండా మూడా లేదా నాలుగా అని నిలదీస్తే ..గబుక్కున చెప్పలేము.
బెత్తెడుజడా జానెడుజడా లేదా జానాబెత్తెడు జడా ..అంటే మాత్రం చటుక్కున చెప్పొచ్చు.
మీ అమ్మాయి ఈకలా జుట్టు కత్తిరించుకున్నా దిగుల్లేదు. మీ ఆవిడ లేజర్కట్ చేయించుకొన్నా ఫరవా లేదు.పిన్నుల్తో అతికించ వచ్చు.కొక్కేలతో తగిలించ వచ్చు .
గులాబీనో ముడిచి.. కనకాంబరాలో ..మల్లెలో ..ఓ మెలిక వేయచ్చు.
ఒట్టి బంగారం…రాళ్ళూరవ్వలూ….కెంపులు పచ్చలు..ముత్యాలుపగడాలు ..పర్సు కొద్దీ పసిడిజడ.
అవును మరి. అది అలాంటి ఇలాంటి ఆభరణం కాదు కదా.. తలకెక్కినది..!
“ఇదెక్కడి చోద్యమమ్మా.. మా కాలాన చిన్నం బంగారం ఎరుగుదుమూ..అయినా మేమిట్టాంటి ఇడ్డూరాలు ఇన్నామా కన్నామా..పిదపకాలం పిదప కాలమనీ ” పున్నమ్మా అదుగో బుగ్గలు నొక్కుకొంటోంది.
“ముడవనింకే ఆయమ్మకే ముంతంత కొప్పున్నట్లు ..ఓ యబ్బ .. ఆ వొచ్చలమ్మది వొగులు మారి వొయ్యారం..!” ..రాగవ్వ మూతి తిప్పుతోంది.
ఒక పక్క పొయ్యికెక్కించను ఉప్పు పప్పు కొనలేక విల విలాడుతుంటే మరీ ఇంత విలాసమా..!
ష్..!!!
గట్టిగా అనకండి !! విని పోగలరు…!
భూములా తేలిపోయే .. సాఫ్ట్ వేరా హార్డయి పోయే...అమెరికానా ఆర్ధిక మాంద్యాన ఈదులాడుతుండే …వద్దంటే వళ్ళో వచ్చి పడుతున్న డబ్బుదస్కం జడన ముడేయక ఎట్లా చెప్పండీ?

పసిడి కొండెక్కితే జడ తలకెక్కదా ?
ఆ మాత్రం అర్ధం చేసుకోవాలి మీరు..!


తాజాకలం:పున్నమ్మ, రాగవ్వ లెవరో పాఠకులు గ్రహింతురు గాక..!
తాజాతాజాకలం: దారేది..”దారిద్య రేఖకు దిగువన”

All rights reserved @writer. Title,labels,postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “పర్సు కొద్దీ పసిడిజడ

  1. O pamu jada.. satyabhama Jada..pattu jada..rasapattu jada.. 🙂 anTu oldtimer ramanagaru RadhaGopaLLamlO O Maanchi paTa raasaru. Adi vinna pratiSaari, chinnatanamlO functions lO pulaJadalu, papiDibillalu gurtukuvastaayi. Jadanu duvvaTaniki teerika lEkO leka wealth/Fashionku prateekO kaani chaantadu lanti jadalanu gorra tokalanu Chestunnaru. Ika yE cineKavainaa ..Aliveni animutyama.. anaalanTE maromaaru aalOchichukOvaalsinDE sumaa!!

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s