ఆకేసి .. బువ్వేసి.. పప్పేసి..

శ్రావణ మాసం వచ్చిందంటే ఒకటే సందడి. పెళ్ళిళ్ళు పేరాంటాలు.

ఇప్పుడు పడమటి పెళ్ళిళ్ళ సుడి గాలి వాటం కాస్త సర్దుకొన్నా.. తెలుగు వారి పెళ్ళి వ్యవహారాల్లో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు.

మండపం పై వాడే పువ్వు నుంచి భోజనం అయ్యాక ఇచ్చే తాంబూలం వరకు. వీడియో ఫ్రెండ్లీ గాను .. అంగ రంగ వైభోగం గాను సాగుతున్నాయి.

ఇక, భోజనాల విషయానికి వస్తే.. చాట్ నుంచి చైనీస్ వరకు కోరిన వంటకం వడ్డన కు సదా సిధ్ధం.

కొద్ది కాలం క్రితం వరకూ మా పల్లెలో, శ్రావణం మరోలా ఉండేది.

చాలా మటుకు ,పెళ్ళిళ్ళు ,అరణాలు అన్నీ వేసవిలోనే.

శ్రావణమాసంలో పనుల్లో మునిగి తేలుతూ ఉండే వారు.ఇంటా బయటా.

శ్రావణ మాసం సారెలు తీసుకొని కొత్తకోడళ్ళు , బిడ్డను ఎత్తుకొని బొమ్మ సారెతో బాలింతలుఅత్తారింటికి వచ్చే వారు.

పిండి వంటలు . తద్దులు వాయినాలు . ఊరంతా సారెలు పంచడం సరదాగా ఉండేది.

వానలో తడిచి అడుగుకో మణుగు లేచే నల్లరేగడి బురద మట్టిని కాళ్ళీడుస్తూ.. మట్టినే ఇంటినీ వంటినీ ఏకం చేస్తూ ..చివాట్లు మొట్టికాయలు తింటూ.. ..ఊరంతా చుడుతూ.. ఇంటింటికీ తిరిగి పేరంటాళ్ళతో పెత్తనాలు వెలగబెట్టే వాళ్ళం.

పిల్లలం.

గుప్పెడు గోరింటాకో ..చేరెడు పప్పులో .. చేగోడీలో పకోడీలో ..నజరానాలు దక్కించుకొంటూ.

వాన పడితే బడి లేదు. జమ్మి చెట్టు ఉయ్యాలలు లేవు. బొంకూరు వాగు పొంగినా, తెగినా ఇక మాకు ప్రపంచం తో సంబంధం లేదు. ఊరంతా తిరగడమే పని. ఇక సారెలు పంపకాలు, అంపకాలు బోలెడంత హడావుడి.

ఎక్కడికి వెళ్ళినా ఒకరిని ఒకరు పరాచికాలాడే వారు.. “మీ ఇంట్లో పప్పన్నం ఎప్పుడు ..? “అంటూ.

మళ్ళీ నాటికి మీ ఇంట్లో పప్పన్నం ! ” అంటూ తీర్మానిస్తూ ఉండేవారు.

పప్పన్నం అంటేనే వివాహ భోజనంబు” కి పర్యాయ పదం గా వెలిగి పోతుండేది..!

ముద్దపప్పు, ఆవకాయ,నెయ్యి , వేడి వేడి అన్నం...అబ్బ..! నోరూరదూ.. .తలుచుకొంటేనే...!

పాలతాలికులైనా పరమాన్నమైనా .. గరిటెడు ముద్దపప్పు , నెయ్యి కలిపితే.. రుచే వేరు.

ఇక , పప్పు చారు , వడియాల సంగతి చెప్పక్కర లేదు..!

వానతో తడిచిన మట్టి గోడలు.. బొగ్గుల కుంపటి పై ఉడుకుతున్న కంది పప్పు కమ్మని వాసన.. ఎంత వెచ్చని జ్ఞాపకమో.!

ఆకేసిపప్పేసి నెయ్యేసి….” పిల్లలకు ఒట్టొట్టి గోరుముద్దలు తినిపించి చక్కిలి గింతలు పెడుతుంటాం.

వాడొట్టి ముద్దపప్పు.. !” అమాయకులను ఆట పట్టించేస్తాం.

ఇదుగోనీ పప్పులు నా దగ్గర ఉడకవ్…! “ ఆగంతకుల్నీ ఆగత్యాలనీ ఒక్క మాటతో అడ్డపుల్ల వేస్తుంటాం. ఆవకాయ తెలుగువారిదీ అన్నం దక్షిణాది వారిదీ అని అనుకున్నా.. పప్పు మాత్రం అఖిలభారతం. ..!

ఇక నంద్యాల వారి రెండు రూపాయలకు రొట్టేపప్పు ..ఎంత మంచి ప్రయత్నమో.

రుచికి రుచి ..పోషకాలకు పోషకాలు అంది చే కంది పప్పు ధర కొండెక్కి కూర్చుంది..!

దారుణం గా తగ్గిన సాగు విస్తీర్ణం, దిగుబడి శాతం ఒక వైపు .. పంటప్రణాళికల విషయంలో మనకెప్పుడూ చుక్కెదురే. ఇదిలా ఉండగా, అన్ని రకాల ఆహార పంటల సాగు అంతకంతకూ తగ్గిపోతున్నదని ..మనం గ్రహించాలి..!

రొట్టేపప్పు సామాన్యుడి కనీస అవసరం.

మరి పప్పన్నం అంటూ పలుమార్లూ అన్నప్పుడు అప్పట్లో అర్ధం కాలేదు కాని, మన ముందు తరాల వారు ఆర్ధిక సంక్షోభాలనూ ,ప్రపంచ యుద్ధాలను, నల్లబజారులను .. నలిగిన వారని ఇప్పటికైనా జ్జ్ఞాపకం చేసుకోవద్దూ ?

కిలో కందిపప్పు ధర అక్షరాలా సెంచురీ కి చేరువలో ఉన్నదన్న విషయంమనం తీవ్రంగా పరిగణించ వద్దూ ?

రోజుల్లో వారికిపప్పన్నంఎంత అపురూపమైనదో ఎందుకు అపురూపమైనదో.. మనం ఇప్పటికైనా అర్ధం చేసుకోక పోతే .. మన ముందు తరాల వారికి .. చేరేడు పప్పులు చేత పెట్టగలమా?

మన బుజ్జిపాప చిట్టి చేతి వేళ్ళను మురెపంగా ముడుస్తూ .. అరచేతిలో… ఆకేసి బువ్వేసి పప్పేసి .. అంటూ ముద్దారగా గోరుముద్దలు తినిపించ గలమా?

సెలవు.

తాజా కలం : దారిద్య రేఖకు దిగువన (దారేది)

(గణాంక వివరాలకు చూడండి: కంది” పోతాం, ఈనాడు దినపత్రిక ,17-7-9)

All rights reserved @writer. Title,labels,postings and related copyright reserved.


ప్రకటనలు

12 thoughts on “ఆకేసి .. బువ్వేసి.. పప్పేసి..

 1. me pappu buvva athi madhuramga vunadi… kadupu nindinadhi… nalika inka a ruchini koruthundi, noru inka uruthunadi… eepude korika thelipanu ma avidaki… produnne pappu buvva vandamani…

  kani – karudu kattina neti samajapu rakkasi notiki e pappu buvva (avedana) ruchi thelusthundha… kevalam paper vallaku manchi artical ga thappa… rajakiya naya(lla)kula ku – samsya chupi prajala sanubhuthi pempunaku thappa… neti yuvathaku – idhi oka ruchinchani patha chinthakaya pachadi la pitchi chadastham anukovadaniki thappa… pamarulu, medhavulu, rythannalu, rasagnula hrudayalu – pappu buvva ruchini aswadhinchina (dravinchina), “manamu cheyunadhi yemunadhi” anukodaniki thappa…

  mudda pappu buvva madhuram marugavaradhu, bhavi tharalaku oka “anaganaga” kadhala migalaradhu… ani,- andharu thama vanthu badyatha nerigi, nadumu bhiginchi karthavyam grahinchalani… samajika sruha, samajam patla badyatha kaligina rachaithaga… e neerasapu, somari samajanni utheja pariche… me e prayathnam yentho abinandhaniyam.

  vommina satish

  మెచ్చుకోండి

 2. namaskaaram chandralatha gaaru. Mee “Regadi vittulu” vaadipotunna telugu navalaku kotta chiguru icchindi. tama srujana software rangamlO prasphutangaa chupistunna teluguvaaru saahitilOkamlO daani aanavalu vetukkunE paristithi. Routine navalalatO visigina telugu pathakulaki mee navala O sandhaya sameeram. maa family mottam mee navalanu baaga ishtapaddamu. ika nunchi mee bloglO meeto directgaa muchchatinche avakasam ichchinanduku chaala santosham. ikanunchi nenu mee blonu regular gaa follow avutanu.. thanks

  మెచ్చుకోండి

 3. సత్యాన్వేషి గారు,
  నమస్కారం.
  ఇలా మిమ్మల్ని నేరుగా పలకరించడం నాకూ ఎంతో సంతోషంగా ఉన్నది. మీ అభిమానానికి ధన్యవాదాలు.
  ఇప్పుడిప్పుడే ఇ- జ్ఞానం అబ్బుతున్నది.నేర్వవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి కదా?
  మీ సూచనలకోసం .అభిప్రాయాల కోసం .చూస్తూ ఉంటాను.
  మీకు మీ కుటుంబ సభ్యులకు ..శుభాకాంక్షలు. చంద్రలత

  మెచ్చుకోండి

 4. చంద్రలత గారూ, స్వాగతం.

  ఇంతకు ముందు మీ బ్లాగు చూసాను కానీ అప్పుడు వ్యాఖ్యలకి అనుమతి లేదు, ఇప్పుడు కలిపించినట్లున్నారు, సంతోషం.

  మీ రేగడి విత్తులు నవల నాకు చాలా నచ్చింది. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా మీ ఆ నవలని చాలా ఆస్వాదించాను. ఆ నవల గురించిన ఓ చక్కని పరిచయాన్ని మీరు http://pustakam.net/?p=818 లో చూడవచ్చు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s