డా. విజయ్ గుప్తా గారి మాట

హిల్సా, బైజీ, సామన్, డాల్ఫిన్,పులస, చీరమీను,జలుగు…చేప ఏదైనా …అది ఒక జీవి. గంగా,నర్మద,కొలరాడో,యాంగ్చీ, గోదావరి,కృష్ణా… నది ఏదైనా …అది ఒక జలనిధి. ఆహ్వానాన్ని మన్నించి… చేపలెగరావచ్చు…!!! పుస్తకం ఆవిష్కరణకు వచ్చి … తమ తమ అభిప్రాయాలను అందరితో పంచుకొన్న వారందరికీ ధన్యవాదాలు. పంచుకోవాలనుకొంటున్న వారికి ఆహ్వానం. ఇది ,పూర్వ Addl.Director General ,World Fisheries వారి మాట. వీలుOటే విని చూడండి. మరికొందరి స్వరాలు… త్వరలో. సెలవు. * డా. గుప్తా గారి ముఖ్యమైన మాటలు. –… Read More డా. విజయ్ గుప్తా గారి మాట

గడపలలో కెల్ల…

పుష్కరకాలం నాటి మాట. కాలిఫోర్నియా వెళ్ళబోతూ .. మా ఆథిధేయిని మర్యాదగా అడిగాను, “మీ ఇంటికి వస్తున్నాను.. మీకేమి తేనూ..” అని. ఆవిడ మురిపంగా నవ్వి ముచ్చటగా అడిగారు,” మునక్కాయ విత్తనాలు!” మళ్ళీ తనే అన్నారు,” మీరు విత్తనాలవారు ఆ మాత్రం తేలేరూ…” ‘అదెంత పనీ ‘ అని అనుకొని అదే మాట వారికి వాక్రుచ్చి , సరే నంటూ వాగ్దానం చేసేసాను. అన్ని దానాలలోకీ సులువుగా చేయగలిగేది వాగ్దానమే కదా మరి ! అయినా నిజం… Read More గడపలలో కెల్ల…

వారెవా..!!!

అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారున్నారు ! ఆ రాజు గారికి … ఆగండాగండాగండి. రాజు గారంటే గుర్తొచ్చింది. మా పాలమూరు తిరుమల్దేవుని గుట్ట బళ్ళో ఒకటో తరగతిలో ఒక రాజు ఉండే వాడు. మా రాజుకి గిల్లి కజ్జాలు పెట్టడమంటే మహా సరదా. ఒక రోజు ఇద్దరు అమ్మయిలు బుధ్ధిగా పలక మీద అ ఆ లు దిద్దుకొంటుంటే ..వారి వెనకగా చేరి.. వారి జడకొనల రిబ్బన్లను ముడేసాడు. దిద్దింది చాలని పలకను సంచిలో పెట్టి..కుంటాటకు… Read More వారెవా..!!!

ఆ గుప్పిటలో

జీవితం తెరిచిన పుస్తకం అంటూ ఉంటారు. నవల మూసిన గుప్పిట అనిపిస్తుంది అప్పుడప్పుడు. విప్పనంత వరకు ఆ గుప్పిటలో ఓ అద్బుతప్రపంచం ఇమిడి పోయి ఉందేమో.. అనిపిస్తుంది. విప్పిచూస్తే ..? ఏముంటుంది ? ఒక భ్రమాత్మక నిజం . నిజం అనిపించే భ్రమ. ఒక సారి ఇలా ఆలోచించండి. “అతడు – ఆమె” ..ఎదురుబొదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకొంటే..ఏమవుతుంది ? బహుశా రంగనాయకమ్మగారిదో సీతాదేవిగారిదో నవల అవుతుంది. “సీతారామారావు “తన అసమర్ధతను మాత్రమే గొంతు నులిమి… Read More ఆ గుప్పిటలో

చాలు చాలు

మన సినిమాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉన్నది! ముఖ్యంగా, స్థలకాల నియమాలు నిర్ధారణల వంటి నాలుగు ముక్కలు తలలోకి ఇరికించుకొని .. అటు వాటి నడుం దుడ్డు కర్రలతో విరగ్గొట్టలేని ..ఇటు వాటిని వదిలించుకోలేని .. నా వంటి అడపాదడపా రచయితలు! అసలు కథంటే ఎలా సాగాలి? అలా అలా గాలిలో తేలిపోయే గుర్రం విన్యాసంలా. కదా? మైఖేల్ ఆంజిలో చిత్రాన్ని మరిపించే . .. చూపుడువేలి తాకిడికి రగిలే మెరుపుతీగలూ .. ఆకాశంలోంచి పువ్వుల్లా రాలిపడే… Read More చాలు చాలు