చాలు చాలు

మన సినిమాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉన్నది!

ముఖ్యంగా, స్థలకాల నియమాలు నిర్ధారణల వంటి నాలుగు ముక్కలు తలలోకి ఇరికించుకొని .. అటు వాటి నడుం దుడ్డు కర్రలతో విరగ్గొట్టలేని ..ఇటు వాటిని వదిలించుకోలేని .. నా వంటి అడపాదడపా రచయితలు!

అసలు కథంటే ఎలా సాగాలి?

అలా అలా గాలిలో తేలిపోయే గుర్రం విన్యాసంలా.

కదా?

మైఖేల్ ఆంజిలో చిత్రాన్ని మరిపించే . .. చూపుడువేలి తాకిడికి రగిలే మెరుపుతీగలూ .. ఆకాశంలోంచి పువ్వుల్లా రాలిపడే ప్రేమికులుఉదయ్ ఘడ్ లో భైరవ కోనలూ ..మంచు రంగు ఎడారులూ ,ఎడారుల్లో రథాల పరుగులూ.. కట్ చేస్తే .. రెండు వేల తొమ్మిది భాగ్యనగరం మార్కు ప్రేమలు .. హెలికాప్టర్లో లిఫ్ట్ చేస్తే ..రాజరికపు జోరూఅబ్బబ్బ.

కళ్ళకింపు మనుషులు , ఖరీదైన బట్టలు సెట్టులు. హాయిగా ఆటలూ పాటలూ , తళతళలాడే కత్తులు .. …చాలు.చాలు.

మన వారి శౌర్య ప్రతాపాలను చూసి మురిసి పోయే సహృదయ ఇన్వేడర్లూ .. భలే భలే !

ఇక్కడ మోటర్ సైకిల్ నడిపితే .. తరువాతి గమ్యం ఏముంటుందీ... బ్యాంకాకే.

ఆగండాగండి.

మన చీకాకులం జాలరి బాబు ఉదయ్ ఘడ్ లోని భైరవకోనకి జీపేసుకు దూసుకు రాగల్డు!

ఏమైనా , మనం ఒక చారిత్రిక సత్యం ఒప్పుకోక తప్పదు. మన తెలుగు వాళ్ళం ఏనాడో గ్లోబలై పోయాం..!

మన సినిమా కథలు మాత్రం తక్కువ తిన్నాయా ?

అవును సుమీ!

***

రెండు వేల తొమ్మిది నుంచి వెయ్యిన్ని చిల్లర తీసేస్తే నాలుగు వందలు ఎలా వస్తాయి లాంటి లెక్కలు అడక్కండి.

ఇది సినిమా !

***

<<<>>

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

8 thoughts on “చాలు చాలు

  1. >> రెండు వేల తొమ్మిది నుంచి వెయ్యిన్ని చిల్లర తీసేస్తే నాలుగు వందలు ఎలా వస్తాయి లాంటి లెక్కలు అడక్కండి. ఇది సినిమా!

    సినిమా వాళ్ళకి కలపడమే తప్ప తీసివేయడం రాదు. దీనికి నాలుగు కలిపితే, దానికి ఇంకో రెండు వారాలు ఆట కలిపితే మొత్తం వచ్చేది ఆరు కోట్లు. ఆరుకి ఇంకో జిల్లా, అమెరికా ఆటలు కలిపితే ఇరవై కోట్లు. ఆ తర్వాత తీయబోయే సినిమా కలిపితే నలభై కోట్లు. ఇలా కలుపుకుంటూ పోవడమే. ఎప్పుడో ఓ సారి అదంతా కలిపి సున్నా (ఇక్కడకూడా కలపడవే చూసారా?)అయిపోతుంది. సున్నా ఐపోయేక ఏ పల్లిటూర్నించి వచ్చేరో అక్కడకే పోయి తుర్ పప్పా అనుకుంటూ గేదెలు కాసుకోడమే పని. ఈ లోపున ఓ పెద్దమనిషి దీని మీద రీసెర్చ్ చేసి ఓ పీహెచ్డీ ఓ ఎమ్మెస్సూ తీసుకుంటారు. హీరోలకీ ఎప్పుడూ డబ్బులు లెక్కపెట్టుకోడమే కదా పనీ?

    మీ అసాధ్యం కూలా ఆ మాత్రం తెలీదుటండీ? వెనకటికి ఎవడో పంచపాండవులు ఎంతమందిరా అంటే 'మంచం కోళ్ళలా ముగ్గురూ అని, అయ్యో కాదు ఇద్దరా అనుకుని కాయితం మీద ఒకటి వెయ్యబోయి, సున్నా వేసి చెరిపేసాట్ట.' అదీ సినిమా వాళ్ళ నాలెడ్జి. మీరు నేనూ ఇలా అనుకుంటున్నాం కానీ ఈ బ్లాగుల్లో ఓ పెద్ద మనిషి 'తెలుగు సినిమాలకి సరస్వతీ కటాక్షం' అనీ ఒక పెద్ద పోస్టు రాసేడు. బెద్ద బెద్ద డిగ్రీలు పట్టుకుని ఇండస్ట్రీని ఉద్దరించేస్తున్నారు(ట). ఆహా, ఏమి అదృష్టం మనది.

    పోతనామాత్యుని కాటుక కంటి నీరు.. గుర్తుకొస్తోంది ఎందుకో….

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s