ఆ గుప్పిటలో

జీవితం తెరిచిన పుస్తకం అంటూ ఉంటారు.

నవల మూసిన గుప్పిట అనిపిస్తుంది అప్పుడప్పుడు.

విప్పనంత వరకు ఆ గుప్పిటలో ఓ అద్బుతప్రపంచం ఇమిడి పోయి ఉందేమో.. అనిపిస్తుంది.

విప్పిచూస్తే ..?

ఏముంటుంది ?

ఒక భ్రమాత్మక నిజం . నిజం అనిపించే భ్రమ.

ఒక సారి ఇలా ఆలోచించండి.

“అతడు – ఆమె” ..ఎదురుబొదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకొంటే..ఏమవుతుంది ?

బహుశా రంగనాయకమ్మగారిదో సీతాదేవిగారిదో నవల అవుతుంది.

“సీతారామారావు “తన అసమర్ధతను మాత్రమే గొంతు నులిమి వేసి ..”గొప్ప చైతన్యం ” పొంది .పరివర్తన పొందాడనీ ..ఇంటికి తిరిగి వెళ్ళి భార్యాబిడ్డలతో హాయిగా జీవించాడనీ ..రాస్తే..?

పోనీ , “రాజేశ్వరి “భర్త చైతన్యవంతుడై.. ఆమె తరుపున మీరా తరుపునా వకాల్తా పుచ్చుకొన్నాడనీ మార్చేస్తే..?

లేదూ … ఎన్నాళ్ళీ కీలుబొమ్మలాటా ? పుల్లయ్య చేత నలుగురి ముందు నిజం చెప్పించేద్దాం.

ఊహు..!

ఇవేవీ వీలు కావు.

ఎలా వీలవుతాయనుకొనటం ?

నవల ఒక భ్రమాత్మక నిజం.నిరంతరం సత్యాలను సృష్టిస్తూ పోతుంది.

ఈ సత్యాలన్నీ హేతుబద్ద సత్యాలు కానక్కరలేదు.అసత్యాలు.అపసత్యాలు,అర్ధసత్యాలు ఏమైనా కావచ్చు.

ఆ నవలా సత్యాలన్నీ ఆ నవలకే పరిమితం కావు. మన స్వంతమై పోతాయి. మన ప్రపంచంలోకి సత్యాలుగా విస్తరిస్తాయి.ఆ సత్యాలను ఎంతగా స్వంతం చేసుకొంటామంటే.. మరొకలాగా ఊహించడానికి కూడా ఏ మాత్రం ఇష్టపడం. ససేమిరా వప్పుకోం.

నిజం అంటే సాపేక్షమన్న మౌలికసత్యాన్ని కూడా మనం మరిచిపోతాం. అలా మరిచి పోవడం లోనే మనకు సంతోషం ఉన్నది.ఎందుకంటే..

మనం పాఠకులం !

మన భావోద్వేగాల పెట్టుబడి ని పెడుతున్నాం. తరం తరువాత తరం. ఉమ్మడి పెట్టుబడి .సామాజిక పెట్టుబడి.

నవలా సత్యాలను ఒక రచయిత సృజనాత్మక ప్రతిభగా ..రచయిత సృజియించిన భ్రమాత్మక ప్రపంచపు పరిధిలోని వనీ జ్ఞాపకం చేసుకోం.

పై నుంచి , మన నిజ జీవితం లో ఒక భాగం చేసుకొంటూ పోతాం.

మనం చూస్తూనే ఉన్నాం ..ఇలాంటి మిధ్యా సత్యాలు..సాహితీ సత్యాలు జీవిత సత్యాలుగా పరిణమించడాన్ని ..అవే అక్షర సత్యాలుగా చలామణి కావడాన్ని.

కనుక ,

సాహితీ సత్యాన్వేషణ ఆషామాషి వ్యవహారం కాదు.

కానే కాదు.

సెలవు

***

తెలుగు నవల పూర్వా పరాలునుంచి.

డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ , దశమ వార్షికోత్సవాలు,20-21/9/2

***

<<<>>

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

3 thoughts on “ఆ గుప్పిటలో

  1. చాలా చెప్పేసారే! కొంచెం ఆలోచించి మళ్ళీ చదవాలి. అన్నట్టు మీ “చేపలెగరా వచ్చు” కోసం హైదరాబాద్ (చిక్కడపల్లి) ప్రజాశక్తి, దిశల్లో అడిగి నిరాశపడ్డాను. మరెక్కడ దొరుకుతాయి?

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s