గడపలలో కెల్ల…

పుష్కరకాలం నాటి మాట.

కాలిఫోర్నియా వెళ్ళబోతూ .. మా ఆథిధేయిని మర్యాదగా అడిగాను,

మీ ఇంటికి వస్తున్నాను.. మీకేమి తేనూ..” అని.

ఆవిడ మురిపంగా నవ్వి ముచ్చటగా అడిగారు,” మునక్కాయ విత్తనాలు!”

మళ్ళీ తనే అన్నారు,” మీరు విత్తనాలవారు మాత్రం తేలేరూ…”

అదెంత పనీ ‘ అని అనుకొని అదే మాట వారికి వాక్రుచ్చి , సరే నంటూ వాగ్దానం చేసేసాను. అన్ని దానాలలోకీ సులువుగా చేయగలిగేది వాగ్దానమే కదా మరి !

అయినా నిజం చెప్పొద్దూ .. ఆమె వింత కోరిక కు కొంత హాశ్చర్య పోయి .. తరువాత విత్తనాలవేటలో పడ్డా. అప్పుడు తెలిసింది.మునక్కాయల్లోని ముప్పైఆరు రకాలు.సంతోషపడి చేతికందినవన్నీ పోగేసాను.

తరువాత తెలిసింది. ఒక్క పొల్లు గింజను కూడా అనుమతి లేనిదే అమెరికా గడప దాటదని.దాటనివ్వరనీ.

వ్యవసాయ వ్యవహారాలన్నీ కస్టంస్ కన్నా ముందే క్లీన్ చిట్ తీసుకోవాలనీ.. అక్కడ ఏదైనా తేడా వస్తే .. తిరిగి రవాణా చేసేస్తారనీ.. అదనీ ఇదనీ.

మాత్రం తేలేరూ” అంటూ మా ఆథిదేయి మెత్తగా విసిరిన సవాలు.. తేగలను అంటూ గట్టిగా నేనిచ్చిన సమాధానం మధ్యన బోలెడు సలహాలు వచ్చి పడ్డాయి.

నల్ల కాగితంలో చుట్టి హ్యాండ్ బ్యాగేజ్ లో పెట్టుకోమనీ..హ్యాండ్ బ్యాగ్ లో ససేమిరా వద్దు చెక్ ఇన్ చేసేయమనీ .. చెకిన్ చేస్తే సవాలక్ష సమస్యలు ..లగేజీ నంతా చిన్నా భిన్నం చేయగలరనీ .. అదనీ ఇదనీ.

ఇవన్నీ ఎందుకు రాజమార్గం ఉండగా అని.. నేను నాలుగు గింజలు పొట్లం కట్టుకొని .ఎగుమతి చేసే వారి వద్దకు వెళ్ళి నాతో తీసుకు వెళ్ళడానికి అనుకూలంగా తయారుచేసుకొనితీసుకెళ్ళా .

అడగక ముందే తీసి … అక్కడి వ్యవసాయభద్రతాధికారుల వారి పరీక్షకు పెట్టా.మూడు గంటలూ ముప్పైఆరు ప్రశ్నల తరువాత .. నా మునక్కాయ విత్తులు నా చేతికి వచ్చాయి.అందుకొన్న ఆథిదేయి ఎంత సంతోషపడ్డారో చెప్పలేను.

అబ్బ ..వారి దేశం పట్లా దేశప్రజల పట్లా వారి జీవ భద్రత పట్లా వారికి ఎంత శ్రద్ధ అనీ!

దేశభద్రత ను ఎంత పటిష్టం కాపాడుకొంటున్నారో జీవభద్రతనూ అంతే పటిష్టంగా కాపాడుకొంటున్నారు.ఈ పన్నెండేళ్ళలో వారి భద్రతా ఏర్పాట్లు మరెంత కట్టుదిట్టం చేసుకొన్నారో!

బాగానే ఉన్నది.

ఒక్క మునగ గింజ కూడా వారి అనుమతి లేనిదే వారి గడప దాటదు.. దాటనివ్వరు.దాటడానికి వీలులేదు. కానీ,స్వైన్ ఫ్లూ ల్లాంటి ప్రాణంతక వైరస్లు వారి గడపలు చడీ చప్పుడు కాకుండా ఎలా దాటున్నాయన్న ప్రశ్న మనం వేయకూడదు !

ఏడేడు సముద్రాలు దాటి మన గడప దాటి ఎలా లోనికి వస్తున్నాయన్నది ..మనం ఎలా రానిస్తున్నామన్నదీ.. అసలే అడగ కూడదు!!

ష్ .. గప్ చుప్..!!!

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

3 thoughts on “గడపలలో కెల్ల…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s