ఇది మొదలు కాదు.తుది కాదు.

ఇది మనకు తెలిసిన కథ. తెలిసిన కథే కదా ..మళ్ళీ ఏం తెలుసు కోవాలని పాఠకుడు చదవాలో … ఏం తెలియజేయాలని రచయిత భావించారో .. స్వయంగా చదివితే గాని తెలియదు. అంచెలంచెలుగా మన అంతరాంతరాల లోకి ఇంకిన ఇంకింప జేసిన ఈ నైచ్యం – చర్చకు రావడం ఇది మొదలు కాదు. తుది కాదు. కాలం బాటలో నలిగిన పగిలిన రగిలిన ఈ మానవ ధర్మపు చీకటి కోణాన్ని … ఓ రూపు మాపు మంచిసెబ్బర… Read More ఇది మొదలు కాదు.తుది కాదు.

“ పిల్లవాండ్లకు చాలు ”

దశరా పండగొస్తుందంటే చాలు. మా కిష్టప్పపంతులు ,ఆయన వెనకే మా పిల్లల రామదండూ తయారు. సన్నటి కర్రొనొక దానిని బాగా వంచేసి పురికొసతో ఆ చివర ఈ చివర ముడేస్తే చాలు విల్లు తయారు. ఇక బాణాలకు ఏం కొదువ? అన్ని పుల్లలూ చివర్లు చెక్కి సిద్ధం చేసేసుకోవడమే. తలా ఒక విల్లంబు చేతికి చిక్కినన్ని బాణాలు పట్టుకొని .. ఏ పైపంచో కండువానో వల్లె వేసుకొని జోలె కట్టుకొని ఊరంతా తిరుగుతూ… ఒక్కో గడపా ఎక్కీ… Read More “ పిల్లవాండ్లకు చాలు ”

అయ్యల్లారా..అమ్మల్లారా..!

అయ్యల్లారా.. అమ్మల్లారా.. మీరీ గాథను విన్నారా? వినండి వినండి. సారీ..చదవండి.చదవండి. “మా నాన్న ఎవరో తెలవాలి! మా నాన్నను చంపిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవాలి! వారి కుటుంబాన్ని నాశనం చేయాలి!నా మనసు పగతో రగిలి పోతొంది!” ఇదేదో సీమ బ్రాండు సినిమా స్క్రిప్ట్ లోని క్లిప్పింగ్ కాదండోయ్…! అక్షరం అక్షరంలో కక్షను ..కనులలో కనుబొమలలో క్రౌర్యాన్ని కార్పణ్యాన్ని ..హావభావాల్లో ద్వేషాన్ని వెళ్ళగక్కుతోన్న ఓ అయిదారేళ్ళ పిల్లవాడి నోటి మాటలు. పసితనాన్ని వసివాడుస్తోన్న కసి…కసరు మొగ్గను కసాపిసా చిదిమి… Read More అయ్యల్లారా..అమ్మల్లారా..!

గోధుమతాతయ్యకు గోరంత

“మొక్కలు మనుషులతో మాట్లాడుతాయి. ఆ మాటలు వినగలిగిన వారు ఆ మొక్కలతో మమేకమైన వారు మాత్రమే.” ఈ మాటలు అనిన వారు అక్షరాలా హరిత విప్లవ పితామహుడు ..నార్మన్ డి. బోర్లాగ్. మొక్కలతో మరింత సన్నిహితం గా …మరిన్ని ఊసులు… పంచుకోవడానికి కాబోలు నిన్ననే మన లోకం నుంచి పయనమై పోయారు. ప్రకృతిలో మమేకమై పోయారు. ఓ పండుటాకులా. భౌతికంగా, ఇక మనకు లేరు. గోధుమతో మొదలైన అన్ని పంటలకూ విస్తరించి… పిడికెడు మెతుకులు పట్టెడు పుట్టెడు… Read More గోధుమతాతయ్యకు గోరంత

మూడు తొమ్మిదుల

ఎన్నైనా చెప్పండి . తొమ్మిదో ఎక్కం తొమ్మిదో ఎక్కమే. ఒక్క కంఠాన బట్టీ పట్టేసామా ..ఇక అంతే. వేసంకాలం పడిశంలా ఆట్టే వదలదు ! ఎక్కువ తక్కువ కానీయనీయకుండా… రెణ్ణాళ్ళు గా తొమ్మిదిని తెగ కలవరించేస్తున్నారు..గడ గడ గుక్క తిప్పుకోకుండా చెప్పిన మాటే తిరగలిలో పొసిన మినుముల్లా చెప్పిన మాటే చెపుతూ ..గున గున గునుస్తున్న ఎఫ్ ఎం ఆర్జేలకు ధీటుగా… మేమొక అడుగు ముందుంటామంటూ.. తెగ సంబరాన్ని గుమ్మరించేసాయి. నవధాన్యాలు, నవగ్రహాలు, నవమాసాలు,నవరసాలు, నవ అవీ… Read More మూడు తొమ్మిదుల

ఎక్కడి పిల్లలు అక్కడే… గప్ చుప్ … !

“ హమ్మయ్య…! బళ్ళు తెరిచేశారు.. మా నందూ గాడిని బడికి పంపి హాయిగా ఊపిరి పీల్చుకొంటున్నా…!” సిరి సోమవారం ఉదయాన్నే చిట్టిసందేశం పంపింది. ఎండాకాలం సెలవలు అంటారే కానీ, ఎండలు తగ్గనే లేదు..బడులు తెరిచేశారు. వానలకోసం బడులు ఆగుతాయా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి..! సిరి అంతలా బేజారెత్తిందంటే ఎత్తదూ మరి ! వాళ్ళబ్బాయి ,నందూ, ఈ రెణ్ణెళ్ళూ టివి… తప్పితే ప్లే స్టేషన్ ..లేదూ వీడియో కళ్ళు పత్తి కాయలయిపోయాయని సిరి ఫిర్యాదు.. “… Read More ఎక్కడి పిల్లలు అక్కడే… గప్ చుప్ … !