“ పిల్లవాండ్లకు చాలు ”

దశరా పండగొస్తుందంటే చాలు.

మా కిష్టప్పపంతులు ,ఆయన వెనకే మా పిల్లల రామదండూ తయారు.

సన్నటి కర్రొనొక దానిని బాగా వంచేసి పురికొసతో చివర చివర ముడేస్తే చాలు విల్లు తయారు. ఇక బాణాలకు ఏం కొదువ? అన్ని పుల్లలూ చివర్లు చెక్కి సిద్ధం చేసేసుకోవడమే.

తలా ఒక విల్లంబు చేతికి చిక్కినన్ని బాణాలు పట్టుకొని .. పైపంచో కండువానో వల్లె వేసుకొని జోలె కట్టుకొని ఊరంతా తిరుగుతూఒక్కో గడపా ఎక్కీ దిగుతుంటే చూడాలి పిల్లల సరదా.

గొంతు చించుకొనిఅయ్య వారికి చాలు అయిదు వరహాలుపిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలుఅంటూ పాడుతుంటేనే నోరూరి పోయిది కాదూ ?

పైనుంచి, ప్రతి ఇంట్లోనూ పిండివంటలు.

వండుతూ.. వారుస్తూ.. వాసెనలు కడుతూ. కమ్మటి వాసనలు

పిల్లలు కనబడగానే .. తలో అరిసె ముక్కో తపాలాచెక్కో ..కారప్పూసో బెల్లప్పూసో .. అలా గుప్పిట్లో..పోసేవారు. ఒక మొట్టికాయ వేసి మరీ.

అలాగని తాయీలాలన్నీ ఉత్తిత్తునే ఇచ్చే వారు కాదండీ.. మా చేత ముప్పై నాలుగు పద్యాలు అపజెప్పించుకొని.. శ్లోకాలు ఎక్కాలు ముక్కు బట్టి పిండుకొని.. చెవి నులిమి ..వీపు విమానం మోత మోగించి .. మరీ ఇచ్చే వారు.

పాపంమా పంతులు.

తనే ఏదో పేద్ద పరీక్ష రాస్తున్నట్లు!!!

బిక్క చచ్చి పోయే వారు.

మేము ఏం ఘనకార్యం వెలగ బెడతామేమో ననీ.. ఒక బెత్తాం చేతిలో పట్టుక తిరగక తప్పేది కాదు ..వారికి!

అయితే ,కళ్ళురిమినా పళ్ళు పటపటలాడించినా , పూట అదిరేవారు ఎవరు? బెదిరే వారెవరు ?

అంతవరకు బాగానే ఉండేది కాని, ఒక మారు మా కాలువ గట్టు నరసయ్య గారి కొత్తల్లుడు అన్నారు కదాఇంకా పాత చింత కాయ పచ్చడి పద్యాలెంటయ్యా పంతులూ ” అని.

ఊరికి అల్లుడయ్యే ఉక్రోషం ఆపుకొని మా పంతులు సమాధానం చెప్పేలోపునే.. మా సరళ, అదేనండీ ఏడాదే కర్నూలు కాన్వెంటులో చేరిందే తను, గడ గడా బి సి డి లువన్ టూ బకుల్ మై షూ లుఅప్ప జెప్పేసింది..!

హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకున్నామా తరువాత చూడాలి మా తిప్పలు.

ఆంగ్ల వాచకం మా బడిలోకి వచ్చి బైఠాయించింది. సరళ మాకు పంతులమ్మ అయి కూర్చుంది.

గోడ కుర్చీలే వేయించిందా ముక్కు చెంపలే వేయించిందా.. అది వేరే విషయం.

పండగ నాలుగు నాళ్ళ ముచ్చటే లెమ్మని మేమూ ఊరుకొన్నామనుకోండి..! ముందుంది ముసళ్ళ పండగ..సరళ సంగతి ఇక చూడాలి! అల్లుడు గారితో పాటూ..!

మా పంతులు ఇంటికి చేరే లొగానే.. బుడబుడ బుక్క మోగింది.

అంతే.. ఎక్కడ పిల్లలు అక్కడ మాయం..! బుడ బుక్కల వాని వెనక తోకల్లా వూరి మీదకు రెండో మారు. ..!!!

అది సరే కాని, ఇది చదివాక మీలో ఎవరికన్నా హాలోవిన్నూట్రిక్ ఆర్ ట్రీట్గుర్తుకు వచ్చే ఉంటుంది .కదా? పిల్లలు కదా నాలుగు చాక్లెట్లు చేతిలో పెడితే సంబరంగా పోతారు అనుకుంటారేమో..!

మాకు మల్లే ఎవరిదైనా రామ దండు వాకిట్లోకి వచ్చి పప్పు బెల్లాలు పెట్టమంటే .. కసిరి పడేసేరు..!

పిల్లలు కదా వారికేం తెలుసు ?

పప్పుబెల్లాలు ప్రియమైపోయయనీ ..పండగ పూట కూడా ఆచి తూచి వాడుకోవాలనీ..!

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s