అట్ల బోయి

” అట్ల బోయి అడవిల మానైనా కానైతి.. మానైన కానైతి మంచెలేతురూ.. పండైనా కానైతి పక్షులారగించు.. ఆకైనా కానైతీ మేకలారగించు..” అత్తింటీఅరళ్ళో… కొత్తకోడలి కోపమో …ఆ అమాయకురాలు .. మానైనా పండైనా ఆఖరికి ఆకైనా చాలు ..ఈ బతుకుకన్నా అనుకుంది కాబోలు. ఆ కోడలు గారికి ఈ కాలం అడవికబుర్లు తెలీదు కదా మరి! అడవంటే … వెన్నెలవాకో ..పూల తేటో..సెలయేటి పాటో.. అడవంటే.. మునివాటికో మన్యం జీవికో..అభిజ్ఞాన శాకుంతలమో.. అడవంటే .. గురుకులమో వానప్రస్తమో ..… Read More అట్ల బోయి

ప్రకటనలు

ఆ రెండూ

కొంకణా సేన్ కొత్త సినిమా అంటే చూద్దామని బయలుదేరా. సినిమాలో కొంకణ కలకత్తా నుంచి ముంబాయి కి వచ్చి తన అస్తిత్వాన్నికి రూపురేఖలు దిద్దుకునే ప్రయత్నంలో సిద్ ను కలుస్తుంది. సిద్ ఒక విజయవంతమైన వ్యాపారి ఏకైక సంతానం. గారాబపు రక్షణ రేఖ అతనిని ఒక పసివాడిగా గానే ఉంచుతుంది.పై నుంచి ,మొండితనమూ. వీరువురి పరిచయం … స్నేహం.. ప్రేమ ..సినిమా.వేక్ అప్ సిద్ ! అన్నీ బావున్నాయి. మనలోంచి నడిచి వెళ్ళినట్లుగా ..ప్రతి పాత్రా..పలకరిస్తుంది. మనలో… Read More ఆ రెండూ

ప్రకటనలు

నవల అంటే

*** ” నావ”ల ..నవల *** మనకు తెలిసిన నవల 14 వ శతాబ్దపు ఇటలీ దేశ “నావెల్లా “లో మూలాలు ఉన్నట్లుగా సాహితీచరిత్రకారులు చెపుతున్నటికీ , భక్తిన్ మరింత వెనక్కి వెళ్ళి నవల మూలాలు జానపదం లో ప్రారంభమై వ్యవసాయ సమాజాలలో స్పష్టపడ్డాయని భావించారు. వ్యవసాయం తో కుదుట పడ్డ మానవ సమాజం నవలకు ఒక నేపధ్యమై ,14 వ శతాబ్దం నాటికి అక్షరబద్దం అయ్యింది. Boccassio రచించిన Decameron (c.1349-51,Italy) ఆనాటి యురోపు సాహితీకారులపై… Read More నవల అంటే

ప్రకటనలు

వగల మారి వంకాయ

వగల మారి వంకాయ సెగ లేకుండా ఉడికిందంటారు. అదేమో కాని, సెగలు పొగలూ కక్కుతూన్నా… ఏమీ ఎరుగని నంగనాచిలా.. మన పళ్ళెంలోకి వచ్చి పడబోతోంది … నవనవలాడుతూ జంకాయ.! అహా ..! మన కంచంలోకి తెచ్చి పడేసారు. అనేవాళ్ళు అంటుంటారు చేసేవాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ, మనకు మాత్రం తెలియవా? బిల్లియన్ బేబీ పుట్టినప్పుడు.. జనభారంతో తల దించుకోకుండా…. తలెగరేసి పండగలు చేసుకొన్నాం . మీరింకా మరిచిపోలేదనుకొంటాను. ఇప్పుడు …మరో పండగ! వంకాయకు పుట్టిల్లయిన మన దేశంలోనే ..… Read More వగల మారి వంకాయ

ప్రకటనలు

బట్టలోయ్ బట్టలు..!

బట్టలోయ్ బట్టలు.! తట్టలు తట్టలు…బుట్టలు బుట్టలు…గుట్టలు గుట్టలు. బట్టలండీ బట్టలు…! మంచిది. వరద… బురద… ఊరినీ వాడనూ .ఇంటినీ వంటినీ…ముంచెత్తాక,కట్టుకోవడానికి కప్పుకోవడానికి ఓ బట్టల జతో ఒక బట్టల మూటో…ఇవ్వాలనుకోవడం ఎంత సహృదయత…మరెంతటి మానవస్పందన… ఎంత మంచి తనం…! అసలు బతికి బట్టకట్టారంటే ఇక గండంగడిచినట్లే . అందుకేగా మంచికీ చెడుకు ఇంటికి పిలిచి ఒక పూట భోజనమైనాపెట్టి ,ఒక నిద్ర చేయించి మరీ కొత్త బట్టలు పూలు పండ్లతో ఆకువక్కలతోఒడినింపుతుంటాం. ఎంత లేమిలోఉన్నా కనీసం ఒక… Read More బట్టలోయ్ బట్టలు..!

ప్రకటనలు

ఆపన్నులను కలిశాక

జరిగిన ఉత్పాతంలో చేయూత ను అందించాలని ముందుకు వస్తోన్న వారు మా ప్రయాణం లో చాలామంది తారస పడ్డారు.వారికి వచ్చిన నష్టం కష్టం ఏ ఒక్కరో ఆర్చేదీ తీర్చేదీ కాకపోవచ్చు .కానీ .. కొంత తాత్కాలిక ఉపశమనాన్నైనా ఇవ్వగలుగుతోంది.మనిషికి మనిషేగా తోడు. మేము కలిసే వరకూ ఆ వూరికి ఏ ఒక్క బాహ్య సంబంధాలూ లేవు. అధికార పర్యటనలూ లేవు. సమీప గ్రామాల ప్రజలే ..ఉన్నంతలో ఆదుకొంటున్నారు. దారులు కొంత సర్దుకోగానే .. వారికి నీరు,ఆహారం చేరుతున్నాయి.… Read More ఆపన్నులను కలిశాక

ప్రకటనలు

తక్షణసాయం : ఒక మనవి

ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు. కొరివిపాడు మునిగిపోతున్నదనీ..అక్కడివారిని మా వూరికి చేర్చుతున్నామని …వార్తలంది. మానవపాడు మండలం నీటి దిగ్బంధంలో చిక్కి. మునకేస్తున్న పొలాల మీదుగా..తెగి పడుతోన్న వాగులను దాటి .. నడిగడ్డ నాలుగు చెరుగులా …మిన్నుపాడు,మద్దూరు,కలుకుంట్ల,బొంకూరు,చంద్రశేకర్ నగర్ తదితర గ్రామాల ప్రజలు ఒక్కో ఊరు వదిలి ..మా వూరు,శ్రీనగర్, చేరిపోయారు. నిన్నమద్యాహ్నానికి సుమారు 150 మంది సాయంత్రానికి సుమారు350 మంది.. వచ్చిన వారు వస్తున్నారు.ఉన్నంతలో అన్నమో పప్పో…తలా కాస్తా పంచుకొని.. రాత్రంతా ప్రాణ భయాన్ని …. చలినీ..నిద్రనూ… Read More తక్షణసాయం : ఒక మనవి

ప్రకటనలు

పల్లె మునకేసింది

అబ్బే, చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. తుంగభద్ర ఒడ్డున మా వూళ్ళన్నీ నీళ్ళ సంద్రమైపోయాయి. పొలాలన్నీ గట్టులు తెగిన చెరువులయ్యాయి. పంటావంటా తంటాల బడ్డాయి.ఇళ్ళూ బళ్ళూ గుళ్ళూగోపురాలు మునకేసాయి. మనుషులందరూ …అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ..పిల్లామేకా తట్టబుట్టలతో సహా ..గట్టున పడే ప్రయత్నం చేస్తున్నారు. అరరే.. అక్కడొక పిల్లవాడు చంకనెక్కిన మేకను జార విడుచుకొన్నాడే.. దాని వెనకే వెడతాడేమిటి? కాలు జారేను..బాబూ..భద్రం..! ఇదుగోండి..ఇతనేమిటీ ..ఎంత చెప్పినా ఆ ఎద్దు పగ్గం వదలడే..దానితో పాటూ కొట్టుకు పోదామనే..! అయ్యయ్యో ..తల్లీ..… Read More పల్లె మునకేసింది

ప్రకటనలు