అట్ల బోయి

” అట్ల బోయి అడవిల మానైనా కానైతి..

మానైన కానైతి మంచెలేతురూ..
పండైనా కానైతి పక్షులారగించు..
ఆకైనా కానైతీ మేకలారగించు..”
అత్తింటీఅరళ్ళో… కొత్తకోడలి కోపమో …ఆ అమాయకురాలు ..
మానైనా పండైనా ఆఖరికి ఆకైనా చాలు ..ఈ బతుకుకన్నా అనుకుంది కాబోలు.
ఆ కోడలు గారికి ఈ కాలం అడవికబుర్లు తెలీదు కదా మరి!

అడవంటే …
వెన్నెలవాకో ..పూల తేటో..సెలయేటి పాటో..
అడవంటే..
మునివాటికో మన్యం జీవికో..అభిజ్ఞాన శాకుంతలమో..
అడవంటే ..

గురుకులమో వానప్రస్తమో ..
అడవంటే ..
వ్యాహ్యాళో వేటో ..మృగయావినోదమో..
అడవంటే …
కత్తి యుద్ధమో ..రథాల పరుగులో..
అడవంటే…
తిరుగుబాటో..పోరుబాటో..
అడవంటే…
జాతీయ సంపదో.. తరతరాల తరగనినిధో..
ష్..!
మాట్లాడకండి.
తెలిసినా చెప్పకండి.
మనోభావాలు దెబ్బతినగలవు.
ఆత్మ అశాంతికి లోను కావచ్చు !!!
ఇదైనా కావచ్చు.
మరేదైనా.
నిజమే,ఏది ఎమైనా అడవంటే..
స్మారకమో ..సమాదో ..

అవుతుందా?

కాదు .కాబోదు.

ఒక పంట పోతే .. మూడు నెలలకో ఆరునెలలకో మరో పంట.
ఒక తోట పోతే .. పదేళ్ళకో పదిహేనేళ్ళకో మరో తోట.
ఒక అడవి పోతే ..???

అందునా ..ఒకటా రెండా ..వేలాది ఎకరాల అడవిని సర్వహక్కులతో పర హస్తగతం చేసేముందు..ధారాదత్తం చేసేముందు..ఒక్క మాట.
అక్కడి.. చెట్టునూ పుట్టనూ.. గుట్టనూ మిట్టనూ..ఏరునూ దొరువునూ..పక్షులనూ జంతువులనూ..వృక్షసమూహాన్ని.. వనమూలికలనూ ..వన్యప్రాణులనూ ..మన్యంజీవులనూ ..సమస్త సజీవసంపదనూ..నిధినిక్షేపాలనూ..ఖనిజసంపదలనూ.. నేలను నీటినీ అన్నెందుకు…అసలు ప్రకృతినే .. ..స్వీయార్పణం చేస్తున్నట్లే కదా?సంతర్పణం చేసినట్లే కదా?

కారణం ఏదైనా.
ఇచ్చిపుచ్చుకోవడాలు ఎవరి మధ్య జరిగినా.

అయ్యల్లారా..అమ్మలారా..అన్నల్లారా..అక్కల్లారా..
ఎవరిదీ అడవి?

ఈ ప్రశ్న ..అడవంత పురాతనమైనదైనా..
మరోసారి మనందరం ఎవరికి వారం ప్రశ్నించుకోవాల్సిన సంధర్భం..
మన ముందర.
ఎవరికీ అడవి ?
ప్రకటనలు

9 thoughts on “అట్ల బోయి

 1. ఇంత ఉంచుకొని పైగా, అంతకు మించి ఏమీలేదంటారేంటండి ! ఐతే మీరొక మాంచి రచయిత్రి అన్నమాట. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందగా ఉంది. నిజం చెప్పెయ్యాలంటే …….మీ పుస్తాకాలేవీ నేను చదవలేదు. కానీ ' రేగడి విత్తులు ' అనే పుస్తకం గురించి ఎక్కడో విన్ననో , చదివానో గుర్తులేదు( బహుసా ఈనాడు ఆదివారం అనుబంధలో నేమో) చంద్ర లత ఈ పేరుకూడా ఏదో కవర్ పేజీమీద చూసినగుర్తు. ఏవైనా చాలా సంతోషం. రాసే క్రమంలో నాకేవైనా సలహాలు కావలిస్తే మొహమాటం లేకుండా అడిగెస్తాను. ఏవంటారు.

  మెచ్చుకోండి

 2. లలిత గారూ…
  మిమ్మల్ని కలవడమూ నాకూ ఆనందంగానే ఉన్నది.
  నేను చేసినవి కొద్దిపాటి రచనలే.
  తప్పకుండా మీరు అడగదలుచుకొన్నవి అడగవచ్చు. నాకు తెలిసిన మేరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
  ధన్యవాదాలతో..
  చంద్ర లత

  మెచ్చుకోండి

 3. “ఒక తోట పోతే .. పదేళ్ళకో పదిహేనేళ్ళకో మరో తోట.
  ఒక అడవి పోతే ..???”
  ఒక అడవి పోతే….. మానవాళి బ్రతుకు పరిమితులలో కొన్నాళ్ళో, కొన్నేళ్ళో పోతాయి..
  ఒక అడవి పోతే…. భూమాత పచ్చటి కొంగు అంచు ను చించిన పాపం మన తప్పుల జాబితా లో కొస్తుంది.

  “అయ్యల్లారా..అమ్మలారా..అన్నల్లారా..అక్కల్లారా..
  ఎవరిదీ అడవి?” — మనదా? నిజం గా మనదేనా? ఏమో..

  మెచ్చుకోండి

 4. Chandralatha garu
  I read your “atlaboyi”in your blog.I feel that I am fortunate to send my comment on this.I am moved for your concern about the society and responsibility towards the future generation.Everybody is blessed with an opportunity to discharge their duty and obligation to the society in their own way being a human being,but very few could do that.I feel it is my privilege if I could be of any help in your endeavour of social service
  paparao burugupalli

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s