అన్నానే అనుకోండి

అన్నంత పనీ చేసేరండీ! ఇంకెవరూ? మన జ్యోతి గారే. వంకాయ జంకాయ అయిపోతుందని ఒక పక్క దిగులు. అలా జరిగితే ఎలా అని మరో పక్క విచారము. ఈ రెంటి మధ్యనా….ఒక మధురమైన విప్లవం “1 కాయ వసంతోత్సవం” అవునండీ..విప్లవాలు రుచికరంగా ఉంటాయి ! నోరూరిస్తాయి ! ఉప్పూకారాలు పట్టించి మసాలాలు దట్టించి .. కూర,పులుసు,పచ్చడి,వేపుడు,కారం..ఇంకా ఎన్నెన్ని విధాలుగా పిడికిలి బిగించవచ్చో ..మన జ్యోతిగారి చేయివాటం చూసి చెప్పేయచ్చు. నిజమే.. మన ఇంట్లో,మన వూళ్ళో,మనకు అవకాశమున్న చోటల్లా..… Read More అన్నానే అనుకోండి

బడిలో ఏముందీ???

ఈ కాలంలో మరీను, మూడేళ్ళు నిండీ నిండక మునుపే పిల్లలను బళ్ళో వేయలేదని అమ్మనాన్నలు దిగులు పడి పోతుంటారు. కేజీల చదువులు వచ్చాక ..ఈ మార్పంతా. అంతకు మునుపు నాలుగేళ్ళకో అయిదేళ్ళకో బడికి పంపే వారు. ఇక, వీధి బడుల సంగతి చెప్పక్కర లేదు. పంతులుగారు మంచీచెడు చూసి ఎప్పుడు మొదలుపెట్టమంటే ..అప్పుడే .. తాంబాలంలో బియ్యం పోసి.. చదువుకు శ్రీకారం చుట్టే వారు.ఓం నమశ్శివాయ అంటూ..! కాసిన్ని బొరుగులు , పుట్నాల పప్పులు,బెల్లం ముక్కలు కలిపి… Read More బడిలో ఏముందీ???

మాటలు వేయేల?

ఐక్యరాజ్య సమితి ,”బాలల హక్కులతీర్మానము” ప్రకటించి నవంబరు,20 ,2009 నాటికి యాభయ్యేళ్ళు.మరియు ఐక్యరాజ్య సమితి “బాలలహక్కుల సదస్సు” తో చట్టబద్దంగాఅనుసంధానమైన ఇరవయ్యవవార్షికోత్సవం. ఈ ప్రత్యేక సంధర్భంగా, అనేక మానవవాద సంఘాలు, బాలలమరియు స్త్రీల హక్కుల ఉద్యమసంస్థలు,హేతువాదులు,నాస్తికులు,లౌకికవాదులు,శాస్త్రీయవాదులు,మనసికవైద్యనిపుణులు,పిల్లల వైద్యులు,విద్యావేత్తలు మరియుమేధావులూ అంతర్జాతీయమానవవాద హేతువాద సంఘాలసమాఖ్య (International Humanist and Ethical Union, IHEU ,మతం పేరుతో ..మతంముసుగులో బాలలపై జరిగేఅత్యాచారాలను అరికట్టేఅంశాలలో…ఐక్యరాజ్య సమితి,న్యూయార్క్ ,జెనీవా మరియువియన్నా, యొక్క ప్రత్యేక సలహాదారు) సారధ్యంలో … – జాతీయ బాలల హక్కుల… Read More మాటలు వేయేల?

మామూలుగా మనం

మామూలుగా మనం ఏం చేస్తాం? పండక్కో పబ్బానికో మనింటికి వచ్చిన అతిధులకు తిరిగి వెళ్ళేప్పుడు మన శక్తి కొద్దీ పండో ..ఫలమో..ఆకువక్కో ..పసుపోకుంకుమో ఇచ్చిపంపుతాం. పెళ్ళీపేరంటాలయితే ఇకచెప్పక్కరలేదు. పెళ్ళికి పిలుపులతో పాటూ అతిధులకు కానుకలతాంబూలం అందించే అలవాటు కొందరిది.వెండికుంకుమ భరిణల దగ్గరనుంచి…చీరసారెల వరకు…పువ్వుల నుంచి మిఠాయిలవరకు..ఏదో ఒక కానుకతో అతిధులకువీడ్కోలు పలకడం మన ఆనవాయితి.వట్టి చేతులతో అతిధులనుసాగనంపడం మనకు అలవాటు లేదు. అనుకుంటాం కానీ, కాలం తో మన ఆనావాయితీలు…అలవాట్లూ మాయంఅయిపోవు. మరో రూపంలోకి మారిపోతాయి. అంతే..!… Read More మామూలుగా మనం

పిల్లలు…పుస్తకాలు * 3

? టివి చూడటం కన్నా బుక్ రీడింగ్ ఏ విధంగా మేలు చేస్తుంది? 1. టివి పెనుభూతం కాదు. ఇది ఒక సాంకేతిక పరమైన ప్రగతి చిహ్నం..అలాగే ఇంటర్నెట్. మన ముందు తరాలకన్నా అనేక రెట్లు మనం సమాచారపరం గా ముందున్నాం. అయితే, మన ప్రగతి ఫలం మన ఆరోగ్యం కొసమే కాని అజీర్తి కోసం కాకుడదు.మన శక్తిని మన ప్రగతికి వినియోగించుకోవాలే కానీ మనలను నిర్వీర్యురులను చేసేందుకు కాదు. 2.టివి, పుస్తకపఠనం .. వీటిలొ.. పుస్తకపఠనం… Read More పిల్లలు…పుస్తకాలు * 3

పిల్లలు… పుస్తకాలు * 2

? పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ పెంచాలంటే పేరెంట్స్ ఏమి చేయాలి? * 1. ముందుగా పెద్దల దృష్టి లో పునరాలోచన రావాలి. కథలు చదవడం ..ఒక సాంస్కృతిక అవసరమో లేదా …సమాచార సేకరణ గా పరిమితం కారాదు. కథ మానవ మనుగడ లో భాగం. ఒక మానవ అవసరం. సృజనాత్మక అవసరం. సృజనాత్మకత లేనిదే స్వంత ఆలోచనలేదు.స్వంతంత్ర ఆలోచన లేనిదే మనిషే లేడు ! “ఉద్యోగసాధనకై చదువులు” అన్న దృష్టి తో చూసే అమ్మానాన్నలకు ఒక విషయం… Read More పిల్లలు… పుస్తకాలు * 2

పిల్లలు… పుస్తకాలు * 1

? పుస్తకపఠనానికి ఇప్పటి పిల్లలకు టైం ఉండటం లేదని ఒప్పుకుంటారా? ** ఒక పుస్తకం చదవాడానికి టైం అన్నది “అపుడైనా ఇప్పుడైనా ..ఎప్పుడైనా “ఉంటుంది“. ఇప్పుడు లేనిది టైం మేనేజ్మెంట్ ..కావలసినది టైం ప్రయారిటి. కాల విభజన ..అన్నది నిజానికి చాలా సాపేక్ష పదం . పుస్తక పఠనం.. ఒక సృజనాత్మక అనుభవం. ఒక పుస్తకం చదివాక మనలో ఒక అనుభవం మిగులుతుంది.. అది కొత్త ఆలోచన కావచ్చు..కొత్త అనుభూతి కావచ్చు….. సంతోషం..కోపం..ఆనందం..ఆక్రోశం…ఆవేదన.. ఆలోచన .. ఉత్తేజం… Read More పిల్లలు… పుస్తకాలు * 1

దోవ చూపే బోయడు

పట్టాభి ఏకబిగిన మాట్లాడడం ప్రారంభించాడు. అక్షత ఊ కొట్టడం కూడా మరిచి మౌనంగా పట్టాభి మాటలు వింటోంది. అతనలా మాట్లాడం ఇదే మొదటి సారి మరి! “నేనప్పుడు చాలా చిన్న వాణ్ణి.అవ్వగారిల్లు ఏటికి ఆ తట్టు.రాకపోకలకు ఏరు దాటాలి. ఒకసారి అమ్మ పుట్టింటినుంచి అత్తింటికి బయలుదేరింది. మేనాలో. పల్లకిని మోసే బోయీలు కాక పల్లకీ ముందు ఒక బోయి పరిగెత్తేవాడు. దారి చూపుతూ.దారి చేస్తూ. అది మంచి ఎండల కాలం. పొద్దు పొడిచిన వెంటనే బయలు దేరినా… Read More దోవ చూపే బోయడు