పిల్లలు… పుస్తకాలు * 1

? పుస్తకపఠనానికి ఇప్పటి పిల్లలకు టైం ఉండటం లేదని ఒప్పుకుంటారా?

** ఒక పుస్తకం చదవాడానికి టైం అన్నదిఅపుడైనా ఇప్పుడైనా ..ఎప్పుడైనాఉంటుంది“. ఇప్పుడు లేనిది టైం మేనేజ్మెంట్ ..కావలసినది టైం ప్రయారిటి. కాల విభజన ..అన్నది నిజానికి చాలా సాపేక్ష పదం . పుస్తక పఠనం.. ఒక సృజనాత్మక అనుభవం. ఒక పుస్తకం చదివాక మనలో ఒక అనుభవం మిగులుతుంది.. అది కొత్త ఆలోచన కావచ్చు..కొత్త అనుభూతి కావచ్చు….. సంతోషం..కోపం..ఆనందం..ఆక్రోశంఆవేదన.. ఆలోచన .. ఉత్తేజం ..నిస్తేజం … .ఇలా ఏదైనా కావచ్చు. మనం పుస్తకపఠనానికి దూరం కావడం అంటె ఒక సృజనాత్మక అనుభవానికి దూరం కావడమే.

? టైం లేదా

** ఇందాక అన్నట్లుగానే..టైం లేకుండా పోదు.ఎవరికి వారు ఇచ్చే ప్రాధాన్యతలను బట్టే కాని ఈ సమయం సర్వదా సర్వత్రా..ఉంటుంది.ఎంత సమయాన్నిపుస్తకపఠనానికి కేటాయించగలమన్నదే ఎవరికివారం తరచి చూసుకోవాలసిన విషయం.

? లేక పేరెంట్స్, టీచర్స్ attitude towards reading books other

than text books.. effect చేస్తోందా?

** ఇది ..ఇవ్వాళ సర్వత్రా చర్చించ బడుతున్న అంశం.

Children book readers ఉన్నారుపిల్లలకు చదవాలన్న ఆసక్తి పెద్దలకు చదివించాలన్న నిబద్దత కనబడుతున్నాయి. కానీ ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి.

1. వీరు English book readers.

2.English లోను fiction కన్నా information books కి parents ప్రాధాన్యత ఇస్తున్నారు.

3. Fiction లోను ..వారి చిన్నతనం లో చదివిన పుస్తకాలు ..అంటే రామయణ భారతాల్లాంటి classics…భేతాళ కథలు పంచతంత్రాలు..ఇలాంటివి

4.పిల్లలు స్వయంగా పుస్తకాలు ఎంపిక చేసుకోరు.. అమ్మానాన్నలు కాని ఉపాధ్యాయులు కాని నియంత్రిస్తారు.. సహజంగానే ..పిల్లలకు ఏదైననేర్పించాలన్నదేవారి ధ్యేయం.

5. తెలుగు విషయం వచ్చే సరికి ..ఇందాక చెప్పినట్లు గా.. పెద్దల ధోరణి ఒక్కటేఒకసాంస్కృతిక అవసరార్ధంఅన్న భావన.

6. ఏమి పుస్తకాలు చదివించినా అవన్నీ kindergarten గడప దాటి primary school ముగియడంతో .. కథాకాలక్షేపం చటుక్కున ఆగిపోతుంది. ఆ పైనంతా target career చదువులేవిదేశీ రవణా అయ్యేంత వరకు.

7. ఇలా దూరంతరాలు చేరిన వారే తిరిగి వచ్చి తమ పిల్లలకు కథలను అందిచాలని చేస్తోన్న ప్రయత్నం మనం గమనించాలి.. చాలా వరకు ..ఇది ఒక సాంస్కృతిక అన్వేషణలో అవసరార్ధం కలిగిన భావన .

8.ఇంతా చేసి.. కథలు పిల్లలకు అందించే అమ్మానాన్నలు అల్పసంఖ్యాక వర్గం. దాదాపు ..99%అమ్మానాన్నలు ఉపాధ్యాయుల..అమూల్య అభిప్రాయం ..కథలూ కాకర కాయలూ.. Time waste ! సత్యాన్ని మనం సవినయం గా అంగీకరించాలి !

ధన్యవాదాలు : పద్మశ్రీ యలమంచిలి గారు 8-11-2008న “వసుంధర,ఈనాడు” కొరకు చేసిన ఇంటర్వ్యూ లోనుంచి కొంత. ప్రశ్నలు వారివి సమాధానాలు నావి.

ప్రకటనలు

5 thoughts on “పిల్లలు… పుస్తకాలు * 1

 1. ఆసక్తి కరం.
  ఈ ప్రశ్నలూ, సమాధానాలూ నగర వాసులైన ఎగువ మధ్యతరగతి ప్రజలకి మాత్రమే పరిమితమైనవి కావా?
  తెలుగునాట బడికెళ్ళే పిల్లల మొత్తం సంఖ్యలో వీళ్ళ సంఖ్య ఎంత శాతం ఉంటుంది అంటారు?
  చిన్న పట్టణాల్లో, పల్లెల్లో బడికెళ్ళే పిల్లల్లో పుస్తక పఠనాసక్తి లేకపోవడానికి కారణం టైం మేనేజిమెంటు కాదు, అసలు అలాంటి పుస్తకాలు ఉంటాయని కూడా వారికి తెలియక పోవడం.
  నాకు వ్యక్తిగతంగా కుట్టిన విషయం, మీరు ఇక్కడ వాడిన ఆంగ్ల పదాలకి తెలుగు ప్రత్యామ్నాయం దొరక్కనా?

  మెచ్చుకోండి

 2. మొదటగా, ఇది ఒక సంభాషణలో భాగం.ఒక సందర్భానికి సంబందించినదని సవినయ మనవి.ఇది కొంత మాత్రమే ననీ మరికొంత మీరు త్వరలో చదవ గలరనీ .
  ఇక,చాలా కథలు మనం చదవం.చెప్పుకొంటాం.
  పుస్తకాలు ఉన్నాయనీ తెలిసీ వాటికి ఆమడ దూరంలో నే ఉంటోన్న అన్ని తరగతుల పెద్దల గురించే మనం మాట్లాడుకొందాం.అక్షరాస్యతకు కథాకాలక్షేపానికి లంకె పెడుతున్నారు మీరు.
  చాలా మటుకు తెలుగు వాళ్ళం మాట్లాడు కొనేటప్పుడు ఆశువుగా దొర్లే ఆంగ్ల పదాలు మా మాటల్లోనూ దొర్లాయి. వాటిని తెలుగులోకి తర్జుమా చేయడం ఎంత సేపు గానీ..మన మాటతీరూ ఎలా ఉందో చూసుకోవద్దటండీ ..అప్పుడప్పుడూ.ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. మీరు చెప్పిన అంశాలు అన్నీ వాస్తవమైనవే. ఒక ఉదాహరణ చెబుతాను.

  “ఈ పుస్తకాలు చదివితే ఏమొస్తుంది? ఏదైనా పెర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదివితే మంచిది. అయినా పుస్తకం చదివే సమయంలో రెండు సినిమాలు చూడటం బెటర్. తెలుగు పుస్తకాలు చదవటం వృధా. అదే ఇంగ్లీషు పుస్తకాలు చదివితే కనీసం ఇంగ్లీషు అయినా బాగా వస్తుంది.”

  ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి నేను చుట్టూ చూసిన వాళ్ళలో. కానీ పైన చెప్పినవి ఏవీ ఇవ్వని అనుభూతి, విముక్తి, ఆలోచన ఒక తెలుగు పుస్తకం(కధలు/నవలలు) ఇస్తాయని నా వరకు నాకు తెలుసు.

  మీ సంభాషణలోని తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. పిల్లలతో చదివించే పుస్తకాలు వాళ్ళకు అందుబాటులోకి రావాలి.
  పాఠ్య పుస్తకాలతో పిల్లలను భయపెట్టి కథలను కూడా చదవకుండా చేస్తున్నామనిపిస్తోంది.
  ఇంగ్లీష్ మాద్యమం పరిపాలిస్తున్న నేపధ్యంలో, తెలుగుని భాషగా చెప్పే విధానంలో సమూలమైన మార్పులు రావాలి.
  మంచి రచయితలకు, సమకాలీన రచయితలకు, పిల్లలు ఎదుగుతున్న (కౌమార ప్రాయంలో ) పిల్లలను పరిచయం చేయాలి

  మెచ్చుకోండి

 5. వెంకటరమణ గారు..
  ఎస్ ఆర్ గారు..
  నమస్కారం.
  పిల్లల పాఠాల్లోని భాషాపాఠాలను చదవడమే సమయం వృధా అన్న భావన ప్రబలంగా ఉన్నప్పుడు.. పిల్లలు పాఠ్యపుస్తకాలలోని పద్యాలు గద్యాలు అనవసరం అనుకుంటే ఇక ఇతర పుస్తకాలు చదవడం అన్న విషయం ఒక పెద్ద ప్రశ్నార్ధకం అన్నది మనకు తెలియదూ..?
  మూడు భాషలను పిల్లలకు పరిచయం చేస్తున్నప్పుడు ఏ భాషామాధుర్యాన్ని వారికి పరిచయం చేయ గలుగుతున్నాయి మన తరగతులు?
  మనం ఆలోచించాలి కదండీ.
  నిజానికి,మూడు భాషలు నేర్పిస్తున్నాం అంటాం కానీ..కనీసం పరిచయమైన చేయగలుగుతున్నమా అన్నది మరో ప్రశ్న.
  మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s