పిల్లలు… పుస్తకాలు * 2

? పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ పెంచాలంటే పేరెంట్స్ ఏమి చేయాలి?

* 1. ముందుగా పెద్దల దృష్టి లో పునరాలోచన రావాలి.

కథలు చదవడం ..ఒక సాంస్కృతిక అవసరమో లేదాసమాచార సేకరణ గా పరిమితం కారాదు.

కథ మానవ మనుగడ లో భాగం. ఒక మానవ అవసరం. సృజనాత్మక అవసరం. సృజనాత్మకత లేనిదే స్వంత ఆలోచనలేదు.స్వంతంత్ర ఆలోచన లేనిదే మనిషే లేడు !

ఉద్యోగసాధనకై చదువులు” అన్న దృష్టి తో చూసే అమ్మానాన్నలకు ఒక విషయం అర్ధం కావాలిఇవాళ లెక్కకుమిక్కిలిగా యూనివర్సిటీల నుంచిబయటకు వస్తున్న విద్యార్తుల లో చిట్టచివరికిఉద్యోగస్థాయి పరిమితులనునిర్ణయించేది వారిలోనిస్వతంత్ర ఆలోచనా శక్తికాని..చాంతాడు డిగ్రీలు కావు.

రంగంలోనైనా..ఇంకా స్పష్టం గా చెప్పాలంటే. . ఉద్యోగనిచ్చెన పైన ..చివరకు ప్రాధాన్యత లభించేది.. సృజన శీలికే.అమ్మానాన్నలు తమ బిడ్డలపై పెంచుకొంటున్నది..చాల పరిమితమైన ఉద్యోగస్థాయినే.

ప్రగతిశీల సమాజానికి కావలిసింది…. అన్ని రంగాల్లోనూ.. స్వతంత్రంగా ..సృజనాత్మకం గా ఆలోచించగలమానవులు“.తల వంచుకొని అప్ప చెప్పిన పని చేయ గల వారు మాత్రమే..సరిపోరు..! పనినే సృజియించ గలవారై ఎదగాలి! సృజనాత్మక ఆలోచనాప్రపంచానికి పుస్తకపఠనం తొలి అడుగే కదా ?

2. పిల్లలకన్నా ముందుగా, మనం చదవాలి. పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవాలి. పుస్తకాల విలువ తెలియపరచాలి.పుస్తకాలపట్ల గౌరవం కలిగించాలి.మమకారం పెంచుకొనేలా చేయాలి.స్నేహం పెంపొందించుకోవాలి.

* తరుచూ పిల్లలతో పాటూ.. పుస్తకలోకంలోకి ప్రయాణం చేయాలి.పుస్తకాల కేంద్రాలకు, గ్రంథాలయాకు వీలైనపుడల్లావెళ్ళివస్తుండాలి.

*ముఖ్యం గా, పిల్లలకు పుస్తకాలు కావాలో వాళ్ళనే ఎంపిక చేసుకోనివ్వాలి.వారి పుస్తకాల పట్ల వారికి ఒక బాధ్యతఏర్పడుతుంది.

*ఫలాన పుస్తకం చదువుతావా చదవవా అని ఒత్తిడి..ససేమిరా ..చేయకూడదు.వారి అభిరుచిని బట్టి వారికి నచ్హ్చినపుస్తకాలను వారే ఎంచుకొంటారు.చదువుతారు.

*ఏదైన పుస్తకం బహుమతిగానో మరోలాగానో ..పిల్లలచేతికి ఇవ్వగానే, ఇక ఆరా మొదలవుతుంది .

ఎంత వరకు చదివావ్? ఏం అర్ధం చేసుకొన్నావ్?ఏం నేర్చుకొన్నావ్? దీన్ని వివరించు.దాన్ని విశ్లేషించు అని.

ఒక్క సారి , యధాలాప ఆరాల జాబితా చూడండి.ఒక ప్రశ్నాపత్రం లా లేదూ..?అవును.పిల్లలకూ అలాగేఅనిపించవచ్చు.పుస్తకాలను ఇష్టంతో చదవాలి అన్నది మనం మరిచిపోకూడదు కదా? ఒక, పరీక్షకు సిద్ధమైనట్లుచదవాలంటే, ఇక పాఠ్యపుస్తకాలకూ వీటికీ తేడా ఏమిటి?

* ”అంత డబ్బు పోసి కొన్నా అలా చదవకుండా పక్కన పెడతావే?” అన్న మాటలు పిల్లలు ఉన్న ఇంట్లో వినబడుతూనేఉంటాయి. మరీ చిన్న పిల్లలయితే చించి పోగులుపెట్టడమో గీతలు గీయడమో రంగులు అద్దేయడమోపడవలుగాలిపటాలు చేసేయడమో …:-)

పుస్తకాలతో చెలిమిని కలిగించే క్రమంలో ..మనమెంత ఎదగ వలసి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా మరి!

***

పుస్తకాలను చింపిపోగులు పెట్టనివ్వండి.

అట్టలేసి అందంగా సర్ది పెట్టే వరకు.

గీతలతో రంగులతో నింపివేయనీయండి.

అందమైన ఆకృతులతో అలంకరించేవరకు.

నేల మీదా.. బల్ల పైనా.. గది నిండా చెల్లాచెదురుగా

పుస్తకాలను విరజిమ్మనీయండి.

అల్లనమెల్లన వాటితో నేస్తం కుదిరే వరకు.

***

ధన్యవాదాలు : పద్మశ్రీ యలమంచిలి గారు 8-11-2008న “వసుంధర,ఈనాడు” కొరకు చేసిన ఇంటర్వ్యూ లోనుంచి ఇంకొంత.


ప్రకటనలు

6 thoughts on “పిల్లలు… పుస్తకాలు * 2

 1. బావుంది ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు. వీటితో పాటు గ్రంథాలయాలకి వెళ్ళే అలవాటు కూడా చెయ్యాలి. అక్కడ తల్లి తండ్రులకి తెలియని బోలెడు పుస్తకాలు పిల్లలకు నచ్చితే చదివే అవకాశం ఉంటుంది. అదే కాకుండా అక్కడ మిగతా వాళ్ళు చదువుతూ ఉండడం వల్ల చదవాలనే ఆసక్తి కూడా కలగచ్చు.

  మెచ్చుకోండి

 2. మంచి సూచనలు. ఆమధ్య ఈటీవీ2 లో తెలుగు పుస్తకాలు కొనే అలవాటు గురించి ఒక వార్తావిశేషం ప్రసారం చేసారు. (మనాళ్ళు బుల్లి పుస్తకాలు బాగా కొంటున్నారంట.) ఇలాంటివి తరచూ వస్తూండాలి.

  “..పిల్లలకన్నా ముందుగా, మనం చదవాలి.” అవును, మనం చదవాలి. చదివినవాటి గురించి ఎక్కువగా మాట్టాడుతూనూ ఉండాలి. ఆయా పుస్తకాల్లో మనకు బాగా నచ్చిన సంగతుల గురించి చెబుతూ ఉంటే, వాళ్ళకూ ఆసక్తి కలుగుతుంది, చదవాలని.

  మెచ్చుకోండి

 3. “కథ మానవ మనుగడ లో భాగం. ఒక మానవ అవసరం. సృజనాత్మక అవసరం. సృజనాత్మకత లేనిదే స్వంత ఆలోచనలేదు.స్వంతంత్ర ఆలోచన లేనిదే మనిషే లేడు !”

  అద్భుతంగా చెప్పారు!! అంతే కాదండి, కథలు Moral Exemplars, జ్ఞానవాహకాలు. కథ మానవులు కనుగొన్న బోధనాపద్ధతుల్లో అత్యుత్తమమైనది!!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s