బడిలో ఏముందీ???

కాలంలో మరీను, మూడేళ్ళు నిండీ నిండక మునుపే పిల్లలను బళ్ళో వేయలేదని అమ్మనాన్నలు దిగులు పడి పోతుంటారు. కేజీల చదువులు వచ్చాక .. మార్పంతా. అంతకు మునుపు నాలుగేళ్ళకో అయిదేళ్ళకో బడికి పంపే వారు.
ఇక, వీధి బడుల సంగతి చెప్పక్కర లేదు. పంతులుగారు మంచీచెడు చూసి ఎప్పుడు మొదలుపెట్టమంటే ..అప్పుడే .. తాంబాలంలో బియ్యం పోసి.. చదువుకు శ్రీకారం చుట్టే వారు.ఓం నమశ్శివాయ అంటూ..! కాసిన్ని బొరుగులు , పుట్నాల పప్పులు,బెల్లం ముక్కలు కలిపి పిల్లలకు తల గుప్పెడు పెట్టి,పంతులు గారికి దక్షిణతాంబూలలు ఇచ్చిపలకాబలపం చేత బట్టిపిల్లలు బడిలో అడుగు పెట్టే వారు.
ఇప్పటి పిల్లలను బడిలో చేర్పించడం దగ్గర నుంచిబడి చదువు పూర్తయ్యేదాకా అమ్మానాన్న హడావుడి అంతా ఇంతా కాదు.play class లో చేర్చను pre-applicaiton దగ్గర నుంచి ..పుస్తకాలు, సంచులు ,నీళ్ళ సీసాలు , లంచు బాక్సులు,పెన్నులు ,పెన్సిళ్ళు రబ్బర్లు ..యూనిఫారంలు..పరీక్షలు ఫలితాలు..ఇక రోజుకు ఇరవై నాలుగు గంటలూబడే మన నిత్యజపం.
ఇక, పెద్దమనిషిని కదిలించినా.. మన విద్యావ్యవస్థను అంటే బడిని బాగుచేయడం ఎలా అన్న ఆలోచనలోనే మునిగి తేలుతుంటారు. బడిని దుమ్ము దులుపుతూనో.. పాఠాలను ప్రక్షాళన చేస్తూనో .. ఉపాధాయులకు ఉత్తమోత్తంగా ఎలా పాఠాలు చెప్పాలో బోధన చేస్తూనో ..అగుపిస్తారు.ఇక, బడిలో చదువు, ఆటాపాటాలను రంగురూపులను మెరుగు పరచడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం.
ఆనాటి నుంచి నాటి వరకు.. మనం మన ఆలోచనలో, ఆచరణలో ,మన జీవితంలో.. బడికోసం ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నామో గమనించారా? ఇక,ఆర్ధికపరంగాను సామాజికంగాను .. మనం వెచ్చించే సమయము, శక్తి,యుక్తి.. ఎంతుంటాయో కదా?
వీధి బడైనా ,పబ్లిక్ స్కూలైనాప్రైవేటయినా ప్రభుత్వానిదైనా.. బళ్ళో చేర్చడానికి అమ్మానాన్నలు ఎందుకంత తాపత్రయపడతారో ..బడి ఫీజులకు ఇతరాల కోసం ఎందుకంత రెక్కలు ముక్కలు చేసుకుంటారో.. బడికి పోనని మారాం చేస్తే వీపు చిట్లగొట్టి మరీ బడిలో ఎందుకు పడేస్తారో..బడిలో చేరని పద్నాలుగేళ్ళ లోపు పిల్లలందరూ బాలకార్మికులే అంటూ ఎందుకు చట్టాలు చేస్తారో.. నిర్భంధంగానైనా పిల్లలు బడిలో చేర్పించాలని రాజ్యాంగాలు ఎందుకు రాసుకొంటారో..యంత్రాంగాలు మంత్రాంగాలు ఎందుకు ఘోషిస్తాయో.. మనకు తెలియదూ?
***
కాసేపు, మన మహాభారతం తిరగేద్దాం.పోనీ,పోతన గారి మహాభాగవతాన్ని పరామర్షిద్దాం. అన్నిటికన్నా ముందున్నదిగా మనకు తెలిసిన ఆదిగ్రంథము రామాయణంలోకి తొంగి చూద్దాం.
కౌరవ పాండవులు యుద్ధం మొదయ్యింది ద్రోణాచార్యుల గారి బడిలో..కర్ణుడి శాపానికి ఏకలవ్యుడి గురుదక్షిణలూ .. బడితో ముడిపడిఉన్నాయి.ఇక, చండామార్కుల వారి బడి సంగతి సరేసరి. ప్రహ్లాదుడి వటి.. చదువుల్లలెల్ల సారం చదివినశిష్యుణ్ణి మనకు ఇచ్చింది.ఇక, విశ్వామిత్రుని బడిలో చదివిన రామ లక్ష్మణుల ముచ్చట్లు మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదా?
***
మన లాంటి వాళ్ళ సంగతి ,కాస్త అటుంచండి. దృతరాష్ట్ర,హిరణ్యకశ్యప,దశరథ ..మహారాజులు మంచి గురువులను ఇంటికి రప్పించగలిగే వారు కాదా? వారి పిల్లల ముద్దూ ముచ్చట్లు చూసుకొంటూ.. ఇంటనే చదువులు చెప్పించలేక పోయే వారా? రాచబిడ్డలను బడిలో వేయడానికి ఎందుకు నిర్ణయం తెసుకొన్నారో మరి!
***
బడిలో నేర్చుకొనేది .. నాలుగు అక్షరం ముక్కలనే కాదు.
మంచినీ చెడునూ.. ! పలువురితో కలిసిమెలిసి మెలగవల్సిన తీరునూ..!
మన మొట్టమొదటి సామాజీకరణ.. సాంస్కృతీకరణజరిగేది బడిలోనే!
అందుకే కదా మనం అంటాం, చదువూ సంస్కారం అనీ.
నాలుగు పుస్తకాలు కంఠతా పడితే అక్షరాలు వస్తాయేమో.. అదే బడిలో పెడితే.. అక్షరాలతో పాటు ఎన్నెన్ని నేరుస్తామో! తమ ఈడు పిల్లలతో ఆడుతూ పాడుతూ.. అల్లరిచేస్తూ...!
మరి..బడి జీవితం లేని బాల్యం..మంచిదని ఎలా చెప్పగలం? కదండీ?

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

4 thoughts on “బడిలో ఏముందీ???

 1. చాలా బాగా చెప్పారు చంద్ర గారు! మన జీవితం లో మూడో వంతు మన చదువుల కోసం, ఇంకో మూడో వంతు పిల్లల చదువుల కోసం ఆరాట పడుతూనే గడచిపోతుంది. మన జీవితాలు బడి చుట్టే తిరుగుతూ ఉంటాయి. నా కెప్పుడు ఈ సుమతి శతక పద్యం గుర్తు వస్తూ ఉంటుంది.
  పుత్రోత్స్తాహం తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు
  జనుల పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్శాహం నాడు కలుగుర సుమతీ

  ఇక్కడ పుత్రిడైన, పుత్రికైనా, తండ్రి ఐనా,తల్లి ఐనా ఒకటే అని నా భావన.
  మీ సాహితి వ్యవసాయం లో పలాలు మాకు పంచుతూ ఉండండి.
  సునీల్ పూబోణి. లెస్టర్, యుకె

  మెచ్చుకోండి

 2. చంద్రలత గారూ, విద్య అవసరం అందరికీ తెలుసు.కానీ ఒక దిశానిర్దేశం లేని ప్రస్తుత చదువులను సంస్కరించాలన్న తపన ఏ ఒక్కరికీ లేకపోవడం బాధాకరం. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సంస్కరిచాలి. చదువులంటే ఇంజనీరింగు, మెడిసిన్లే కాదు. పొట్ట పోషించుకోడానికి దారి చూపని ఈ చదువులు దండగ. ఆవేశపడీ పడీ బాధపడీ పడీ చల్లారిపోయాను నేనైతే. అందుకే మరో రెండేళ్ళలో మేము ప్రారంభించే పాఠశాలను స్ఫూర్తిదాయకంగా తిర్చిదిద్దనున్నాము. మోడల్ విద్యా వ్యవస్థను, బడిని చూపించాలన్న కసితో ఆ ప్రాజెక్టు చేపడుతున్నాము.

  మెచ్చుకోండి

 3. సునీల్ గారికి..
  నమస్కారం. మీ సూచన ను తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

  జీవని గారికి.
  నమస్తె. మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నా.శుభాకాంక్షలు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s