ప్రజాభిప్రాయ సదస్సు వివరాలు 1

ప్రజాభిప్రాయ సదస్సు వివరాలు ఇక్కడ చూడ గలరు. Jairam Ramesh faces protests over Bt brinjal 2 min 06 sec http://www.ndtv.com/news/videos/video_player.php?id=1198011 http://www.ndtv.com/news/videos/video_player.php?id=1197972 ప్రకటనలు

బడి కెళ్లాలి ..భలే..భలే !

“Going to school in India” బడి కెళ్లాలి ..భలే..భలే ! 1-1-10 * బడికి వెళ్ళడం …అందులోనూ … మన దేశంలో ఎంత సరదా అనుభవమో మనకు తెలియదూ? కాస్త ఆలస్యమైతే తప్పి పోయే బస్సు …తప్పనిగోడకుర్చీ. ఎక్కాల్సిన బెంచీ ..తీయాల్సిన గుంజిళ్ళూ..! అబ్బబ్బ ..సమయానికి కనబడని నల్ల రిబ్బను..తెల్లమేజోడు. ఓహో … పర్ ఫెక్ట్ ! యూనిఫార్మ్ ..నున్నగా దువ్వి ..పైకి మడిచి కట్టినపొట్టి జడలు.. బాగా పాలీషు దట్టించి రుద్ది రుద్దిమెరిపించిన నల్లబూట్లూ..! అయ్యయ్యో.. అలా ఎలా మరిచిపోయావ్? ఇవ్వాళశుక్రవారం ..తెల్ల డ్రస్సు.. పదపద గబ గబ మార్చు! అవతల బడికి వేళవుతుంది! హమ్మయ్య ..శనివారం ..ఎన్ని రంగులో .. నచ్చిన బట్టలు…మెరిసే తలలో క్లిప్పులు. సర్లేమ్మా ,ముందు నువ్వు నిద్రలేచి ..బడికి బయలుదేరు. పద తల్లీ..పదమ్మా! * గబ గబ.. చక చక …గల గల..కిల కిల.. బడి కెళ్ళే పిల్లలను పరిచయం చేసే ఒక మంచి పుస్తకం ,”Going to School in India” నిజమే, బడి కెళ్ళడం లో ఎంత సంతోషం ఉన్నదో అంత వైవిధ్యం దాగి ఉన్నది. పర్వతాల్లో కొండల్లో … ఎడారుల్లో మైదానాల్లో …దీవుల్లో ద్వీపకల్పంలో..నదీతీరాల్లో బ్యాక్ వాటర్ లో ..ఇందు గలంఅందులేమనకుండా ..ఎక్కడ చూసినా బడికి వెళ్ళే పిల్లలే. బస్సుల్లో ఆటోల్లో రిక్షాల్లో సైకిళ్ళపై వెళ్ళే పిల్లలు మనకు తెలుసు. ఏనుగెక్కి వెళ్ళే పిల్లలు ,ఎడ్ల బండి పై ఒంటె బండిపై ప్రయాణించే పిల్లలు ,రోప్ వే దాటొచ్చే వారు..సైనికుల వాహనాల్లోలిఫ్ట్ తీసుకొనేవారు ఈ పుస్తకంలో మనకు పరిచయం అవుతారు. పడవల్లో “ఫటాఫట్” లలో…రోప్ స్వింగ్ లలో గాలిలో తీలుతూ వచ్చే వారు.. ..వెదురు వంతెన లుదాటొచ్చేవారు..చేపల పడవల్లో కదిలి వచ్చే వారు.. నవ్వుతూ పలకరిస్తారు. * “ భారద్దేశంలో బడికెళ్ళడం భలే ఉంటుందిలే ’‘ …అంటూ మొదలు పెట్టి.. మన దేశం లోనే బడి ప్రయాణాన్నీ .. బడిబాగోగులనూ… అందంగా కళాత్మకంగా రంగులురంగులుగా ..విశ్లేషించే ఒక ప్రయత్నం పుస్తక రూపంలో మనముందున్నది. పుస్తకం అని ఎందుకంటున్నానంటే , ఇదే పేరుతో ఒక సంస్థ ఉన్నదనీ.. వారు పిల్లలు బడికి వెళ్ళే క్రమాన్ని చిన్న చిన్నచిత్రాలు నిర్మించి అనేక అంతర్జాతీయ ఖ్యాతినీ అవార్దులనూ పొందారనీ!( “యూ ట్యూబ్” లో చూడగలరు) * ఈ సరదా వెనుక ఈ సంతోషం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో విజ్ఞులు ఇప్పటికే గ్రహించి ఉంటారు. బడికి వెళ్ళ లేనివిషాదం.. బడిని కొనసాగించలేని అడ్డంకులు..వీటన్నిటినీ ..మించి ఎలాగైనా బడికి వెళ్ళాలన్న కోరిక …పట్టుదల … ఈపుస్తకం చెప్పకుండా చెప్పే విషయాలు ఎన్నెన్నో. బాలల మౌలిక హక్కుల అమలు పై లేవ నెత్తే అంశాలెన్నో మరెన్నో. మామిడి చెట్టు కింద పార్లమెంటు ,మదరస్సాలుకదిలించిన సైన్స్ ఎగ్జిబిషన్లు,మధ్యాహ్న భోజనాలు,ఆటలు పాటలు,పణియా గిరిజనుల బడులు, ఏకలవ్యపాఠశాలు,రాత్రి బడులు, వీధి పిల్లల బడులు, బేర్ ఫుట్బడులు,బస్సు బడులూ… ఎన్నెన్నో ..మనముందు నిలిచి ..మనను ఆలోచనల్లో పడవేస్తాయి. * సరే నండి.. మీరు మీ పిల్లలను బడికి పంపేహడావుడిలొ ఉన్నారా ? మరి అలాంటప్పుడల్లా ..ఈ పిల్లలు మీ మనసులోమెదలక పోతే అప్పుడడగండి! * “Going to school in… Read More బడి కెళ్లాలి ..భలే..భలే !

ఇంత జరిగాక కూడా,

ఇంత జరిగాక కూడా,బిటి వంకాయను భారతదేశంలోకి అనుమతిస్తే,అది స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరగబోయే అతి పెద్ద విషాదం. డా.పి.ఎం. భార్గవ  పొగాకు వలన క్యాన్సర్ వస్తుందని గ్రహించడానికి దశాబ్దాలు పట్టింది.జన్యుమార్పిడి పంటల దుష్పరిణామాలను గ్రహించడానికి పుష్కర కాలాలు పట్టవచ్చు. డా.షెరిలిని నా దృష్టిలో బిటివంకాయలో ఎక్కువ సమస్యాత్మకమైన అంశం .. ఎంపిక చేసుకొనే స్వేఛ్చ లేకపోవడం. డా.ఆరి సీతారామయ్య ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది.బిటి జన్యుమార్పిడి తరువాతి గురి-వరి! డా.పాణిని   మనం ఇప్పుడు ఆపలేక పోతే, ఎప్పటికీ… Read More ఇంత జరిగాక కూడా,

వచ్చే దారెటు

వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే! వచ్చే దారెటు     పుస్తక ఆవిష్కరణ పుస్తకం :వచ్చే దారెటు రచన: చంద్ర లత ప్రచురణ : ప్రభవ, నెల్లూరు తేదీ: ఈ నెల 29, శుక్రవారం సమయం : సాయంత్రం 6 గంటలకు   స్థలం : సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్.,బాగ్ లింగం పల్లి ,హైదరాబాద్ ఆవిష్కర్త మరియు ముఖ్య వక్త :డా.పి.ఎం .భార్గవ “డా భార్గవ గారు Center for Cellular and Molecular Biology ,CCMB ,Hydrabad వ్యవస్థాపకులు , పూర్వ అధ్యక్షులు .బిటి వంకాయ విషయంపై GESE పై ప్రత్యేక నిపుణ పర్యవేక్షకులుగా సుప్రీంకోర్టు చేత నియమించ బడిన వారు.“  సభాధ్యక్షులు :   డా.కె.శివారెడ్డి ,ప్రఖ్యాత కవి,            కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత. పుస్తక సమీక్ష:    వోల్గా , ప్రముఖ రచయిత్రి.  విషయ సమీక్ష:    తెలకపల్లి రవి,ప్రజాశక్తి,జర్నలిస్ట్ కార్యక్రమ నిర్వహణ :  వాసిరెడ్డి నవీన్,ఎడిటర్, కథాసాహితి * వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే! ఆ వివరాలేమిటో ఆ వివాదాలేమిటో   స్వయంగా వచ్చి తెలుసుకోండి. “ప్రభవ ” మిమ్మల్ని సాదరం గా ఆహ్వానిస్తున్నది.  మీ అభిప్రాయాలను… Read More వచ్చే దారెటు

ప్రజాభిప్రాయసదస్సు వాయిదా

బిటి వంకాయ పై ఈ రోజు జరగవలసిన ప్రజాభిప్రాయసదస్సు వాయిదా పడింది. “postponed to a later date as Mr.Ramesh had been asked by the Prime minister’s office to be presented in New Delhi.”The Hindu.” మీ అందరి సహకారానికి ధన్యవాదాలు.

బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు

బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు ప్రారంభమైన సంగతి మీకు తెలుసు. అందులో భాగం గా ,హైదరబాద్ వస్తోన్న కేంద్ర మంత్రి, జైరాం రమేశ్ , గారిని కలిసి అభిప్రాయలు ,సలహాలు చెప్పదలుకొన్నవారు, ప్రశ్నలు అడగదలుచుకొన్న వారు ..రేపు 22-1-2010 , CRIDA సంతోష్ నగర్ ,హైదరాబాద్ , సమయం ఉదయం 11:30 గంటలు. ఈ సంధర్భం గా, ఒక ఉత్తరం రాసే ప్రయత్నం లో ఉన్నాం. దానిపై ,సంతకం చేయదలచిన వారు, వెంటనే… Read More బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు

వారేమన్నారంటే

సంక్రాంతి శుభాకాంక్షలు. ఆరి సీతారామయ్య గారు కథా రచయిత గా మనకు చిరపరిచితులు. వృత్తిరీత్యా ,వారు జీవ రసాయన శాస్రజ్ఞులు. వంకాయ వివాదం పై వారి అభిప్రాయం ఎన్నో కొత్త సంగతులను తెలియపరిచింది.అవి మీతోనూ పంచుకుందామని. వారి మాటలలోనే చదవండి. *** I am a biochemist with some expertise in molecular biology and geneticengineering. I am not opposed to biotechnology in general nor am Iopposed to it… Read More వారేమన్నారంటే

మీరు ఏమి చేయ గలరు?

మీరు ఏమైనా చేయ గలరు. ఒక జన్యువు ను తోడు చేసుకొని మన జన్యువైవిద్యాన్ని కొల్లగొట్టడానికి ,సమస్త ప్రకృతినీ స్వాధీనం చేసుకోవడానికి ఇంత బాహాటంగా , ఇంత బహిరంగంగా ..బహుళజాతి కంపేనీలు ప్రయత్నిస్తుంటే , మన వాళ్ళే వారికి తోడుగా నిలబడితే,  మనం ఏమి చేయ గలం? ఈ విషయమై, జీవ రసాయన శాస్త్రజ్ఞులు,ఎమొరీ విశ్వవిద్యాలయం,అట్లాంటా మరియు “ఈ మాట ” సంపాదకులు, పాణిని ,గారు ఏమంటున్నారో చూడండి. మీ మీ రంగాలలో మీ పరిధులలో.. ఈ… Read More మీరు ఏమి చేయ గలరు?

ఇతనాల కడవకు ఈబూది బొట్లు

ఇతనాల కడవ కు ఈబూది బొట్లు the pots of seeds  with dots of vibudi ఆవిష్కరణ.8.1.10 అబ్బూరి ఛాయాదేవి గారు, సరోజిని దేవి గారు  పక్కన డా. సునీతారాణి గారు,   అసోసియేట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటి భూమిక సమావేశం .హైదరాబాదు రచన: S.వెంకటరెడ్డి, చంద్రలత * అమూల్యంప్రభవ ప్రచురణ For free copies : 040-27633722prabhava.books@gmail.com

మత్తిగుళ్ళ మహా ప్రసాదం

ఉడిపి హోటల్ లో ఉప్మా అయినా ఉల్లిదోశయినా, అబ్బ ! తలుచుకొంటూనే నోరూరిపోదూ? తినేదాకా ఆగగలమా కమ్మటి వాసనే నిలవనీయ కుండా చేస్తుంటే?  ఇక,బిసిబిళే బాత్ ,వాంగీ బాత్ ల సంగతి సరేసరి ! వాంగీ బాత్ మాట ఎలాగు ఎత్తాను కాబట్టి , మీకు మత్తిగుళ్ళ మహాప్రసాదమూ రుచి చూపించాలి కదా?  వాంగీ బాత్ అంటూ మహాప్రసాదం అంటున్నాని ఆశ్చర్య పోకండి.  వాంగీ అదేనండీ , వంకాయ , సాక్షాత్తు ఆ ఉడిపి కృష్ణుడి కి భక్తులు… Read More మత్తిగుళ్ళ మహా ప్రసాదం