ఏమో ..అదేమో ..మరేనేమో !

ఎన్నైనా చెప్పండి.

వేసం కాలం.
సాయం సమయం.
సముద్రం గాలులు.

మంచి నిద్రలో కమ్మి వేసే కమ్మటి జ్ఞాపకం లా..
నిలువెత్తు వివశత్వంలో ముంచేయ గలదు …
అప్పుడప్పుడే విచ్చుకొంటున్న ఒక చిన్న మల్లెచెండు.

ఎప్పుడైనా ఆదమరుపున  మనసున మెదులుతుందొక మధురమైన పాట.

మనుసున మల్లెల మాలలూగెనే.. ఎంత హాయి ఈ రేయి నిండెనో ..
అంటూ.

ఆ పారవశ్యం ఆ పాటదా ఆ మాటదా..
ఆ తియ్యటి పలుకు ను ఒలికిన స్వరానిదా..ఆ అందమైన స్వరాన్నిన స్వరకర్తదా..? ఆ కమనీయ భావాన్ని కంటిముందు నిలిపిన ఆ అపురూపమైన  జంటదా?
ఏమో?

బహుశా…
ఆ హాయి ..
ఆ వయ్యారి మల్లెలమాలలదేనేమో!

***

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

8 thoughts on “ఏమో ..అదేమో ..మరేనేమో !

  1. ఇలాంటి కొన్ని పాటలు ఎందుకు నచ్చుతాయో తెలియదు. ఆ పాటలు వింటుంటే ఏదో అవ్యక్తగతమైన అనుభూతి మనల్ని పలకరిస్తుంది. ఎందుకలా జరిగిందంటే మనలో చాలా మంది దగ్గర సమాధానలుండవు. మనసును తాకే ప్రతి భావాన్నీ మాటలతో కొలవడం వీలు కాదని నా నమ్మకం.

    మెచ్చుకోండి

  2. మల్లెలున్న పాటలన్నింటిలొ, నాకు, ” చిగురాకులలో చిలకమ్మా ” (దొంగరాముడు సినిమాలో)బాగుంటుంది. కొంచెం ఆలోచనలు, కొంచెం నీతులు, మంచి ట్యూను, వారానికి ఒకసారైనా వింటాను.

    మెచ్చుకోండి

  3. ఇలా నేను మనసు పారేసుకున్న పాట
    “గోరొంక గూటికే చేరావు చిలకా”(సీక్రెట్-చిలకా అన్న చోట నా గర్ల్ ఫ్రెండ్ పేరు గోరొంక అన్న చోట నా పేరు పెట్టి పాడి వినిపిస్తుంటా తనకి(అలా మా నాన్నారు నా చిన్నప్పుడు గోరొంక అన్న చోట ఆయన పేరు చిలకా అన్న చోట కన్నా అని పాడేవారు))

    ఇంక నా మనసు దోచుకున్న పాట
    చిన్న మాటా ఒక చిన్న మాట(దీనికి పెద్ద ష్టోరీలు లేవు లెండి)
    —సంతోష్ సూరంపూడి

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s