ఆ పుస్తకమైనా e-పుస్తకమైనా.

23-4-2010
అబ్బబ్బ పుస్తకం
నిన్ను చూడగానే నోరూరుచుండు
ధర చీటి చూసి ..పర్సు తీయగానే ..
అబ్బబ్బ
*
పై ఖాళీలూ తమరు పూరించ సవినయ మనవి. వాక్యం పై సర్వ హక్కులూ తమరివే.
*
పోనీండి.
ఎవరి పాపాన వారు పోతారు.
కానీ, కొని చదవడం తగ్గిపోయిందని వాపోతారే ..వారిగురించి కాసేపు.
కొని చదివే వారు లేకుండా పోయే వారి గురించి మనం మాట్లాడుకోవడం ఎంచేత?
ఇవ్వాళ అంతర్జాతీయ పుస్తక దినోత్సవం కదా అంచేత !
అని అనుకుంటున్నారా?
కాదండి బాబు.
రాత్రంతా మధ్యే పరీక్షలు రాసొచ్చిన మా అబ్బాయి  ఒకటే ఉలుకులుకి పడుతున్నాడు .
పాపంకలలోకి పుస్తకం వచ్చిందో ఏమో!
హాస్టల్లో ఉంటున్న మా అమ్మాయిని  పొద్దున్నే ఆఫీసులో కలవమని డీన్ హుకుం వేసార్ట , మొన్నామధ్య నేను తప్పక చదవాలి సుమా అంటూ, ఆమె బీన్ బ్యాగులో దాచి పెట్టి వచ్చిన పుస్తకం దొరికి పోయిందో ఏమో!
పొద్దున్నే కాఫీ కప్పు ఇలా ఇస్తుంటే , తిరగేసిన పుస్తకంలోకి అలా తల దూర్చి మొహం చాటేసారు మా పిల్లల నాన్న గారు ! కొత్త పుస్తకం బుర్ర తొలిచేస్తుంటే , నిద్దట్లో ఏవేవి కలవరించానో ఏమో!
సరేనండీ ,ఇలాంటి పుస్తక కష్టాలు తెల్లారి లేస్తే ఎన్నో.అర్ధం చేసుకోరు!
అదలా ఉంచండి.
రోజు స్పెయిన్ లో , ప్రతీ పుస్తకాల దుకాణం లోనూ కొన్న పుస్తకం తో పాటు ఒక గులాబీ ఇస్తారుట.
Cervantes వర్ధంతి కదా , అని,స్పెయిన్ వారు వారి జాతీయ పుస్తక దినోత్సవం ప్రకటించుకొని, రెన్నాళ్ళ పాటు ఏకబిగిన Don Quixote  “readathon” చేసి, Miguel de Cervantes Prize ఇస్తారుట.
బావుంది.
బ్రిటన్లో ,పౌండ్ కొక పుస్తకం తీసుకోండంటూ టోకెన్లు ఇస్తారుట.ఇక, షేక్ స్పియర్ నాటకమహోత్సవాల సంగతి సరేసరి.
భలే భలే.
అన్నట్లు,స్పెయిన్లో అబ్బయిలు అమ్మాయిలకు గులాబీ ఇస్తే, అమ్మాయిలు పుస్తకం తో బదులిస్తారుట.ఏకంగా నాలుగు మిలియన్ల పుస్తకాలు గులాబీలమారకం జరిగాయంటే ,చూడండి మరి.
నిజానికి, రోజున కొన్న పుస్తకం తో పాటు ఒక గులాబీ ని ఇవ్వడం క్యాటలోనియ లో మొదలయ్యిందట. పుస్తకం చడవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పకనే చెప్పడానికట.
నిజమే, మకాండొ దుమ్మూధూళిలో కనుమరుగయ్యే టప్పుడు, మిగిలింది క్యటాలోనియ పుస్తకాల దుకాణదారూడి సలహా మేరకు , దుఖాణం లోని ముఖ్యమైన పుస్తకాలతో సహా దేశాంతరం పట్టిన మార్క్వెజ్, తరువాత ఆయన రచించిన One Hundred Years of Solitude” మాత్రమే కదా?
మకాండొ  ,మార్క్వెజ్  .. ఈ కథా కమానీషు అర్ధం కావాలంటే ,ఆ పుస్తకం చదవాల్సిందే ,మరో మార్గం లేదు!
అదలా ఉంచడి.
అంత మాత్రం చేత , ప్రభవ కు వచ్చి  పుస్తకానికో గులాబీ ఇమ్మనేరు. ఇప్పటికే బితుకు బితుకు మంటున్న పుస్తకాలషాపు కాస్తా చితికి పోగలదు! మా వూళ్ళో గులాబీలు పుస్తకాల కన్న ఖరీదైనవీను!
మీరు ఎప్పుడైనా గమనించారో లెదో గానీ, మన తెలుగు పుస్తకాలు ఏవీపౌండ్ను మించవు. లెక్కన పాఠకులకు అందేవన్నీ వన్ పౌండ్ చీటీలే!
ఇదండీ, పుస్తకాల క్రయవిక్రయాల వ్యవహారం.
దానా దీనా చెప్పొచ్చేంది ఏంటంటే,
రోజు పుస్తకాలరోజు మాత్రమే కాదు.
ఇవ్వాళ  పుస్తక రచయితల,ప్రచురణకర్తల ,విక్రేతల ,విమర్శకుల   ..ప్రత్యేకమైన రోజు గా UNESCO ప్రకటించింది.
వీరందరి మౌలిక హక్కుల ,కాపీ రైట్ డే ,గా కూడా రోజు గుర్తించబడింది.
రచయితే ప్రచురణకర్తా,విక్రేత,పంపిణీదారుడు,ఆపైన, ప్రూఫ్ రీడరూ అయిన చోట , ఈ రోజు మరింత ముఖ్యమైనది కాదూ ?
*
మునుపు గ్రంథాలయాల పాత్రకు  ఈనాటి పుస్తకాలకుకొంత పోలిక ఉన్నది. ఉచితంగా చదవచ్చు.
పనిగట్టుకొని పుస్తకాల దుకాణానికి వెళ్ళక్కరలేకుండానే, ఇంటికి పుస్తకాలు చేర్పించే , దుకాణాలు  బోలెడు తెరిచి ఉన్నాయి.
గ్రంథాలయాలు,దుకాణాలు ఒక్క కొనగోటి మీటు దూరంలో ఉన్నప్పటికీ ,ఎందరం పుస్తకాలను చదువుతున్నామన్నదే ప్రశ్న.
కనుక, కొని చదివారా కొనకుండా చదివారా అన్నది కాదు , అసలు చదువుతున్నారా లేదా అన్నది మన ముందున్న ప్రశ్న .
చదవండి. చదువుతూనే ఉండండి.
  పుస్తకమైనా eపుస్తకమైనా.
అదే మనం మన రచయితలకు అభిమానంతో అందించే  గులాబీ పువ్వు!
 ఇక ,కొని చదివారే అనుకోండి
ఆ పై , చెప్పవలసింది ఏముందీ?
పుస్తకం చదువరులకు శుభాకాంక్షలు.
*

(అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా చేసిన చిట్టి రచన. పుస్తకం.నెట్  వారికి ధన్యవాదాలతో )

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s