గుట్టెనుక 2

ఈ మాటే , తమ కోడలికి భూదేవమ్మ నయానా భయానా నచ్చ చెప్పి చూసింది. గుట్టుగా రట్టు కాకుండా అన్నీ చక్కబెట్టాలనీ చూసింది ఒంటి చేత్తో. ఆ అమ్మణ్ణి తప్పు కూడా ఏముంది?  కొత్త మోజులోనేమి ,మంచి మనసుతోనేమి, మొదటంతా వీడు ఆ పిల్లను నెత్తిన బెట్టుకు గారాబం జేసే. వారమంతా పట్నాన ఏమి వొళ్ళు ఇరుసుకోనేటోడొ గానీ, శని వారం రాత్రికి గుట్టెడు ఆశలతో సంసారానికి తిరిగి వొచ్చేవాడు. ఆఖరి బండిలో. కొంత కాలానికి, కోడలిని… Read More గుట్టెనుక 2

గుట్టెనుక 1

“గుట్టెనుక  దొంగల ముఠా  …గజ్జెలమోనారే  తరిమికొట్ట వొస్తవా చెల్లే …గజ్జెలమోనారే “ ఆదెయ్య తన ఒక్కగానొక్క బక్కటెద్దును ముల్లుగర్రతో అదిలిస్తూ ,అడుగడుక్కో పదం పలుకుతూ ..మెల్లిగా నడుస్తున్నాడు. ఆ వెనకే, అటో అడుగూ ఇటో అడుగూ వేస్తూ గొర్రెల దాటు. “ఓ  తాతా ” ఎవరో పిలిచినట్లయ్యి, వెనక్కి తిరిగి చూశాడు.కనుచూపు ఆనే మేరలొ ఎవరూ లేరు. ఎవరో పిలుస్తున్నారు.ఎవరినో మరి. మునుపటి కాలంలో  “కో  అంటే కోటి మంది ”. ఇప్పుడు గొంతు చించుకొన్నా బదులు… Read More గుట్టెనుక 1

వేలిముద్దరకు వేవేల జేజే

రోజులు క్షణాల్లా .. ఇట్టే దొర్లిపోతాయి. మనకు తెలుసు. క్షణాలు అరక్షణాల్లో ..అరక్షణాలు….ఆహా.. క్షణంలో  వెయ్యోవంతులో …సమయం  బోలెడంత  చమత్కారం చూపవచ్చు. మరోలా అయితే , ఆ క్షణాలే యుగాలయిపోవచ్చు. రెండు వేల తొమ్మిది పది లా మారడం మినహాయించి,  సరిగ్గా ఇదే రోజున , మా అబ్బాయి బడికెళుతూ ఇచ్చిన హోం వర్క్ ను ఇప్పటికీ పూర్తి చేయలేక పోయా.అదేంటో కానీ. కాస్తాగి  వెనక్కి తిరిగి చూస్తే , బిర బిర చర చర …కట్టల్లేని వాగులా… Read More వేలిముద్దరకు వేవేల జేజే

విడివడ్డ పురికొస ముడి

ఎప్పుడూ ఇంతే. ఎదురు చూసినంత సేపు పట్టదు కదా.. ఎండాకాలం సెలవలు అయిపోవడానికి! మొన్నటి దాకా .. సెలవల్లో ఏం  చేయాలన్న సవాలక్ష  సమాలోచనలు. నిన్నటిదాకా.. సెలవలు ఎలా గడపాలన్న పదిన్నర పథకాలు. ఈ పూటో మర్నాడో .. సెలవలు ఇక లేవంటూ మిగిలే ఒకే ఒక్క దిగులు. పిల్లల సంగతి అటుంచండి. టీవీలు, పియస్ త్రీలు, కంప్యూటర్ ఆటలు ,ఆర్కూటులు,ఫేసుబుక్కులు,చాటింగులు..వాళ్ళవేవో వాళ్ళకున్నాయి. పెద్దాళ్లతోనేగా అసలు సంగతి. సెలవలు వస్తాయన్న సూచన రాగానే ..సెలవల్లో ఈ పిల్లలని ఎలా… Read More విడివడ్డ పురికొస ముడి

ఉల్లి పొరలు పొరలుగా

ఒక రచనకు, ఆ రచయిత వ్యక్తిగత జీవితానికి, అనుభవాలకు మధ్య ఉన్న అవినాభవ సంబంధం గురించి , ఆయా తరాల పాఠకులం ఆసక్తిగా తరిచి చూస్తుంటాం.  అనుకుంటాం గానీ, రచయిత ,ముఖ్యంగా ,కాల్పనిక సాహిత్య రచయిత, తన రచనకు వ్యక్తిగత అనుభవానికి మధ్య  గల సంబంధాన్నిస్పష్టంగా వ్యక్తపరచడం కష్టం.ఎందు చేత నంటే, ఒక రచనకు అనేక అనుభవాలు,ఆలోచనలు ,అనుభూతులు ,స్పందనలు ముడి పడి ఉంటాయి. ముఖ్యం గా, నవలల విషయం లో. భక్తిన్ (Mikhail Bakhtin, రష్యన్ తత్వవేత్త) అంటారు… Read More ఉల్లి పొరలు పొరలుగా

ఆకటి వేళల

ఆకలయ్యే వేళకి అక్కడ ఆగామా ,  భీమాలోనే ఆగడం. ఉదయం ఫలహార వేళయితే ,వేడి వేడి ఊతప్పమో ,ఇడ్లీవడో. ఇక, మధ్యాహ్నం అయితే నవకాయ కూరలూ అప్పడం,ఊర మిరపకాయతో వడ్డించిన నిండు కంచంతో పాటు.. చల్లటి పెరుగు లో ముంచి తెచ్చిన తైరువడ ..అక్కడడక్కడా పలుకు పలుకు మంటూ ..బూందీ పూసలు.సాయంకాలం అనుకోండి ,మద్రసు చిట్టి ఇడ్లీ ,వేడి సాంబారు,చిటెకెడు నెయ్యి.చిన్న చిన్న ఇడ్లీలు సాంబారులో మునింగి తేలుతుంటే ..కమ్మని నెయ్యి వాసన కమ్మేస్తుంటే..ఇంటికి చేరినా ఆ… Read More ఆకటి వేళల