వేలిముద్దరకు వేవేల జేజేరోజులు క్షణాల్లా ..
ఇట్టే దొర్లిపోతాయి.
మనకు తెలుసు.
క్షణాలు అరక్షణాల్లో ..అరక్షణాలు….ఆహా..
క్షణంలో  వెయ్యోవంతులోసమయం  బోలెడంత  చమత్కారం చూపవచ్చు.
మరోలా అయితే , క్షణాలే యుగాలయిపోవచ్చు.
రెండు వేల తొమ్మిది పది లా మారడం మినహాయించిసరిగ్గా ఇదే రోజున , మా అబ్బాయి బడికెళుతూ ఇచ్చిన హోం వర్క్ ను ఇప్పటికీ పూర్తి చేయలేక పోయా.అదేంటో కానీ.
కాస్తాగి  వెనక్కి తిరిగి చూస్తే , బిర బిర చర చరకట్టల్లేని వాగులా ..ఆనకట్టల్లేని నదిలా. ..కాలం ఎలా ఉరకలు పెట్టిందో కదా అనిపిస్తోంది.
చదువుదామని పేర్చి పెట్టిన పుస్తకాలు ,అలాగే ఉన్నాయి.
విందామనుకొన్న పాట విననే లేదు. చూద్దామనుకొన్న సినిమా చూడనే లేదు.
వండుదామనుకొన్న కూర వండనే లేదు.తిందామనుకొన్న వంటకం తిననే లేదు.
మారుద్దామనుకొన్న కిటికీ తెరలు మార్వనే లేదు.వేద్దామనుకొన్న విత్తనాలు వేయనే లేదు.
కలుద్దామనుకొన్న వారిని కలవనే లేదు దానా దీనా, చేద్దామనుకొన్న పనులు చేయనే లేదు.
కనురెప్ప పాటులో కాలం కరిగి పోయింది.
చడీచప్పుడు చేయ కుండా.
గబగబ చకచక.
రెండేళ్ళ నాటి మాట.
కన్నెగంటి రామారావు గారి అధ్యక్షతన  సురేష్ కొలిచాల గారు కొత్తపాళీ గారు, వికిపీడియ రవి గారు, కాలాస్త్రి గారు,సిబి రావు గారు..
విడివిడిగా కలివిడిగా వివరించి చెప్పినా ,విడమర్చి చెప్పినా ..చెవినిల్లు కట్టుకొని చెప్పినా ..
గణాంకాలు ,గ్రాఫులు ,బొమ్మలూ ,పిపిటి ప్రెజెంటేషన్ల తో మిరమిట్లు గొలుపుతూ చెప్పినా..
మరుగవ్వబోతోన్న మన భాషను దేదీప్యమానం చేయడానికి  భాషవాడుక ను డిజిటైజ్   చేయడం ఒక మహత్తర మార్గం అంటూ బల్ల గుద్ది చెప్పినా
ఎంత ఎక్కువగా అంతర్జాలంలో తెలుగువాడకం పెరిగితే అంత మేలనీ .. దరిమిలా అక్షరలక్షలు కూడా పలక వచ్చనీ
ఆ పై తెలుగు భాషవాడుకకు ఢోకా రాబోదనీ   అర్ధతాత్పర్యాలు  విశ్లేషించి  చెప్పినా ..
భాష అంతర్ధానం అవుతుందని  తాపత్రయేపడే వాళ్ళంతా అంతర్జాలం మాధ్యమంగా తెలుగును అంతర్జాతీయ భాషగా ఎదిగేలా స్థిరపడేలా కృషిచేయాలనీ భావోద్రేక ఉపన్యాసాలు చెప్పినానలుగురూ నాలిగందాలా నయానా భయానా ఇలా అలా నచ్చజెప్పినా..
ఎక్కడో చిన్నపాటి   ములుకు అంతర్జాల రచనావ్యాసంగాన్ని ఆరంభించాడానికి పట్టిఉంచింది.
అక్కడికీ ఉండబట్టలేక ,వివరణలన్నీ ఆసాంతం విన్నాక, సందేహాలన్నీ గుమ్మరించేసా. దరిమిలా , వారందరూ మాటకా మాట సావాధానంగా సమాధానపరిచారు.
 ముఖ్యంగా అంతర్జాలపత్రికామిత్రులు.పునరుక్తి నుంచి కాపీరైట్ వరకూ.డైరీ నుంచి ఎడిటెద్ కాపీ వరకూ.
అయినా, ఆరంభించరు కదా నీచ మానవులు !
 అప్పుడే కంప్యూటర్ లోకంలోకి కాలు పెట్టిన తొమ్మిదోతరగతి పిల్లాడు తొందరపెడితే కానీ పేజీ మడత పడ లేదు !
నిజమండీ .. కాకిపిల్ల కాకికి ముద్దేమో కానీ.. ఈనాటి పిల్లలు అమ్మానాన్నలతో అనుకొన్న పని చేయించ గల గడుసుపిండాలు. ఔననలేకా కాదనలేకా.. వాదించలేకా గెలవలేకా ..వారి బాట పట్టాల్సిందే కదా!
ఏది ఏమైనా,
అంతమంది నిష్ణాతులు దార్శనికుల వివరణల నేపధ్యానికి… పిల్లవాడి వాదన ముఖపత్రమైంది .అంతే కదా మరి రూపేణా  నాకు సైతం చిటికెడు జ్ఞానం అబ్బిందండోయ్!
తోచింది తోచినట్లు రాయడం, అచ్చేయడం.. మీరు తీరిక చేసుకొని చదవడం ,మొహమాటం లేకుండా అభిప్రాయాలు రాయడం ,తెలియని విషయాలు తెలపడం,   ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకొనే అవకాశాన్ని మీరు కల్పించినట్లే.
ఇక, వచ్చేదారెటు పుస్తకానికి వెనుక ఉన్నది మీ స్పూర్తి ప్రోత్సాహమే.
అందుకు మీకు నా ధన్యవాదాలు. రచనతో సరిపెట్టుకోకుండా , కొద్దిపాటి ప్రయత్నం చేయగలిగా మంటే  ,అది మీ అండాదండల వలననే.
వందలాది సంతకాలు సేకరించగగినా ,ప్రజాభిప్రాయసదస్సులో ప్రసంగించగలిగినా ,అది మీ సహకరం  తోనే సాధ్యమైంది.
అబ్బా ..ఇది రాయదగ్గదేనా .. సరిగ్గానే ఆలోచిస్తున్నానా .. అంటూ ఆగినప్పుడల్లా.. ఇదుగోండి ఇంతటి దైర్యాన్ని నూరిపోసి ముందుకు నడిపింది  మీరే.అర్ధరాత్రైనా అపరాత్రైనా.
చిట్టిరచనల బాగోగుల గురించి ఇప్పుడు నేను సైతం..ఘంటాపథంగా చెప్పగలను.. మరోమారు కన్నెగంటి వారో కొలిచాల వారొ కొత్తపాళీ గారో ..మాట్లాడే అవకాశం ఇస్తే.
ఇక,వేలిముద్రపాటుతో రచించేయడం, క్షణాల్లో అచ్చేయడం ,నిమిషాల్లో అభిప్రాయాలు తెలవడంఅంతా బాగున్నట్లే అనిపిస్తుంది కాసేపు.కొనగోటిమీతులో ప్రపంచం ఇమిడినట్లు.
ఎటొచ్చి,
ఒక రచన చేసి,తరిచి చూసి,ఒక పత్రికకు పంపి , నెలకో నెలన్నరకో ఏడాదికో ఎడాదిన్నరకో ..అచ్చయినప్పుడు ..కొత్తగా చూసుకొని ..వింతపడి..బొమ్మ భలే ఉందే !అచ్చులో నా అక్ష్రాలు ఎంతా బావున్నాయో ! అనుకొంటూ మురిసిపోయి ..
ఫలాన పత్రికలో ఫలానా సంచికలో అచ్చయిందహో ..అంటూ తెగ సంబరపడేంత ఓపిక ఒక్కరవ్వ తగ్గిందేమో నని ..ఒక చిన్న అనుమానం.
ఎందుకంటారా?
ఇట్లా రాయడం అట్లా అచ్చేసుకోవడం అలవాటయ్యాక ..వారాలే యుగాలుగా తోచడంలో వింతేముంది ?మీరే చెప్పండి!
అచ్చు లోకంలో మునుముందు ఏమేమి వింతలు జరగనున్నాయో ఎవరం చూడొచ్చాం లెద్దూ!ఇప్పటికి ఒక్ అకొబ్బరికాయ కొట్టేసి షుభం పలుకుదాం!
మళ్ళీ మా అబ్బాయి , ఇచ్చిన హోంవర్క్ చేయకుండా ఏమిటా టైం వేష్ట్ ..అంటూ గుడ్లురమ గలడు. వాడసలే చంఢామార్కుడు!
 నేనేమో బుద్దిమంతురాలిని! ఇచ్చిన పని చక్కగా చేయద్దూ మరి?
 మా వడొచ్చి వొంకా వొంకా పెట్టకుండా, కాంపోజిషన్లు రాయించకుండా ..
 మీరు కూడా చొరవ తీసుకొని  తలా ఒక చేయి వేస్తే ..
మడతపేజీ ని తీరుతెన్నులు తప్పకుండా తీర్చిదిద్దగలనని సవినయ మనవి.
***
ఆకటి వేళల ”  ఆకేసి పప్పేసి బువ్వేసినా..వగలమారి వంకాయ వేపుడేసినా..పిప్పరమెంట్ల తో సరిపుచ్హ్చినావారెవా అంటూ ప్రోత్సహించిన మీకు నా అభిమానాలు.
అన్నీ అక్కడే ఆరంభమయ్యాయిశ ..అంటూ ఆశ్చర్యపడినా, కటా కటాఅంటూ కష్టపడి నిష్టూరపడినా ..ఉల్లిపొరలు పొరలుగా విప్పిచూసినా .. మేమున్నమంటూ ..అండదండగా నిలిచినా మీకు .. మరొక మారు ధన్యవాదాలు.
***
త్వరలోనే మళ్ళీ.
***12-6-2010*** 
 Dot Painting: Krishna Vamsi,Greeshma Prabhava, 12 yrs.
***


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

4 thoughts on “వేలిముద్దరకు వేవేల జేజే

  1. ఈ సింహావలోకనమెందుకబ్బా?? బ్లాగు మొదలెట్టి ఏడాది అయినందుకా?? నిజమే ఈనాటి పిల్లలు పిడుగులే. మన రాతలు పత్రికలకు పంపినా అవి అచ్చవుతాయో లేదో తెలీదు, ఎన్ని కత్తిరింపులో అంతకంటే తెలీదు. అదృష్టం కొద్ది అచ్చైనా చర్చ జరిగే అవకాశం, పాఠకుల అభిప్రాయం తెలిసే అవకాశం అస్సలు లేదు. అలా అని మన భావాలు, కధలు,కవితలు అందరితో కాకున్నా కొందరితో పంచుకోవాలంటే బ్లాగు బేషైన వేదిక. ఇది మన స్వంత పత్రిక. దీనికి మనమే సంపాదకులం. పాఠకులతో చర్చించి మన తప్పులు సరిచేసుకోచ్చు. తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. మన రాతలు మెరుగు పరుచుకోవచ్చు. ప్రతి ఒక్కరు పాళీతో పుట్టలేదు కదా. రచయితలైపోవడానికి??ఏమంటారు చంద్రలతగారు ???

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s