అటెన్షన్ ప్లీజ్!

యువర్ అటెన్షన్ ప్లీజ్… !ఉదయాన్నే ఈ అటెన్షన్ ..స్టాండటీజ్ అంటూ గొడవేమిటనుకొంటున్నారా ?పొద్దుటే ఈ రైల్వే అనౌన్స్మెంట్  ఏంటబ్బా …అని చిరాకు పడుతున్నారా? కాస్తాగండి. అక్కడ మా సిరి గారి చిన్నమ్మాయి గుక్కపట్టి ఏడుస్తోంది. పిడికిళ్ళు బిగించి .కప్పెగిరేలా . వాళ్ళ అమ్మ  వళ్ళో చేరగానే ఏమీ ఎరగ నట్లు నవ్వులు!  ఆరో నెలపెట్టి ఆరు రోజులన్నా అయిందో లేదో ..అందర్నీ హడలు కొట్టే కళలో ఆరితేరి పోయింది! ఇంట్లో ఉన్న అరడజను మందీ ఎల్లవేళలా అటెన్షన్ లో… Read More అటెన్షన్ ప్లీజ్!

హా ….చ్చ్ ….సారీ సారీ…!

ఇలాంటి ఉత్తరాలు అడపాదడపా వస్తూనే ఉంటాయి. కాకపోతే ,ఈ మారు కోల్ కతా నుంచి. అందునా ,పశ్చిమబంగ బంగ్లా అకాడమీ వారి సుముఖం నుంచి. ఏమీ లేదు. అనేక శుభాకాంక్షలు. ఆ దరిమిలా,ఒక జాతీయ పురస్కారం. ఎవరికేమిటి?  అక్షరాలా నాకే. నా పేరు.ఇంటిపేరు చిరునామా,పిన్ను కోడు,చదువు, పుట్టిన తేదీ ఇతర వివరాలన్నీ ..అచ్చుగుద్ది మరీ పంపారు. ఎలా కాదన గలం ? ఈ కబురేమిటీ ..ఇంత చల్లగా చెపుతున్నానని అనుకోబోయేరు. కాస్తాగాలి మరి. ఇక నేం. కోల్ కతా… Read More హా ….చ్చ్ ….సారీ సారీ…!

తడిచిన మొగ్గల్లా

. తడిచిన పూలుఎంత బద్దకిస్తున్నాయో. విచ్చుకోను  మొరాయిస్తూ ముద్దముద్దగా ఆకుల పొత్తిళ్ళలోకి ముడుచుకొంటూ ముద్దుముద్దుగా అద్దీఅద్దని పుప్పొడిగా  ఆరీఆరనీ ఆ వొయ్యారాన్నీ  చినుకు చినుకుగా  వణికిపోతూ  తడితడిగా  అమ్మకుచ్చిళ్ళ వెచ్చదనాన్ని   తడిమిచూస్తూ   గారాం పోతూ  మారాం చేస్తూ చూడండీ… తడిచిన మొగ్గల్లా.. ఆకుల పొత్తిళ్ళలో ఒదొగొదిగి.. ఆదమరవగలిగిన ఆ హాయి  ఎంత ముగ్దమనోహరమో కదా! *** ఒక పూటకి పనిమానేసి  నిండారా.. ముసుగుపెట్టేస్తే ..!!! మెత్తని పక్కలో ఒత్తిగిల్లి  వెచ్చటి  కలల్లో తేలిపోతే !!! *** బానే… Read More తడిచిన మొగ్గల్లా

గుట్టెనుక 3

<>“పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం. “ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?” మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య. “ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో… Read More గుట్టెనుక 3