కరుకుగా గరుకుగా కాకరలా

“అతను కూడా అందరిలా ఎందుకుండడు? విరాగిలాగున్నాడే ! ఎప్పుడూ తీవ్రమైన ఆలోచనలో ఉండడమెందుకు ?వీడి వయస్సుకీ నడవడి ఒప్పదు,” అని అమ్మ అనుకొనేది. అంతలోనే “ఏ పిల్లతో నైనా ప్రేమలో పడ్డడేమో !” అనుకొనేది. త్వరలోనే అమ్మ గ్రహించింది. ” తన కొడుకు ఫ్యాక్టరీలో ఉండే ఇతర యువకుల్లాంటి వాడు కాడు. కానీ,” అమ్మలో సంశయం,సందేహం,ఆందోళన. ‘అస్పష్టమైన ఆలోచనలతో పెరుగుతున్న సంకోచాలతో చిత్రమైన మౌన జీవితంతో ‘ఒకరోజు రెండులు కాదు రెండేళ్ళు గడిపారు తల్లీకొడుకులు! ఈ క్రమం లో ఒకరినొకరు… Read More కరుకుగా గరుకుగా కాకరలా

అలలు అలలుగా

అమ్మ రచనాకాలంలో ఎవరిని ఉత్తేజ పరిచిందని మనం భావించామో వారు, ఆనాటికి అంతగా అక్షరజ్ఞానం అబ్బని వారు. కానీ, అనతి కాలంలోనే అనేక కళారూపాలలో “అమ్మ” అన్నివైపులా ఆవరించి పోయింది. అందరి హృదయాలను స్పృశించ  గలిగింది. బెర్నాల్డ్ బ్రెట్చ్  అమ్మ నాటక రూపాంతరం ,ఈ నాటికీ గొప్ప ప్రజాదరణను పొందుతూ ,సామాన్యులకు ప్రేరణగా నిలుస్తుంది .ఆనాటి నుంచి  ఆ మధ్యన  జరిగిన వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమాల వరకూ .ప్రపంచంలో ఏదో ఒక చోట అమ్మ స్వరం వినిపిస్తూనే ఉంది . అలలు అలలుగా. అమ్మలో అంతటి… Read More అలలు అలలుగా

అమ్మ కో నూలు పోగు !

“సరిగ్గా సమయానికి వచ్చిన నవల !” అంటూ లెనిన్ ప్రశంసలు అందుకొన్న “అమ్మ“-  సరిగ్గా ఉద్యమ సమయానికి సాయుధంగా అంది వచ్చిన విషయం అందరికీ తెలుసు. “నేను దీనిని అమెరికా లో ఉండగా ,హడావుడిగా తగినంత సమాచారం అందుబాటులో లేనపుడు రాశాను– అంటూ శిల్ప నిర్మాణపు అమరికల గురించి గోర్కీ   వివరించబోతుంటే – లెనిన్ సాలోచనగా తలూపి అన్నాడు,” హడావుడిగా రాసి నువ్వు మంచి పని చేశావు.ఇప్పుడు ఇది చాలా అవసరమైన పుస్తకం!” అలా ,ప్రపంచం ముందు అమ్మ… Read More అమ్మ కో నూలు పోగు !

ఇది చూశారు కదా?

దీనిని చూడండి. వీలైతే కాస్త వివరం గా చూడండి. ఇప్పటికే చూసి ఉంటే , మరో సారి చూడండి.Thanks to Greenpeace India.                 *** . Bt Brinjal could be back. The Biotechnology Regulatory Authority of India (BRAI) bill has been approved by the Cabinet and will be tabled in the Parliament soon.The BRAI bill… Read More ఇది చూశారు కదా?

"బోలో స్వతంత్ర భారత్ కీ…

జై“ అనీ అనగానే,  “జై !”అనే వాళ్ళం పిల్లలమంతా. ఒక్క గొంతుతో. ప్రభాత్ ఫేరీలు చుడుతూ. ఊరంతా. “లెఫ్ట్ రైట్… లెఫ్ట్ రైట్ … లెఫ్ట్ టర్న్ ..రైట్ టర్న్ … పీచే ముడ్.. దాయే ముడ్ ..బాయే ముడ్ ..  సావధాన్ … ఆగే చల్ ..” అని అంటూ పిటి సార్  ఆగి ఆగి వేసే…విజిళ్ళ మధ్యన. ఆగుతూ.సాగుతూ. అసలే శ్రావణం. పడుతుందో లేదో తెలియని వాన. తెల్లవారుఝాము నాలుగున్నరకంతా..బడికి చేరక పోయామా..ఇక అంతే. రాని… Read More "బోలో స్వతంత్ర భారత్ కీ…

పిల్లల కలాలు

క్రమం తప్పక ప్రతి ఏడాదీ కొత్తగూడెం క్లబ్ నిర్వహణలో జరిగే బాలోత్సవ్…ఒక పిల్లల పండగ.అందులో కథ చెప్పడం,రాయడం, విశ్లేషించడం ఒక ముఖ్యమైన భాగం.గతఏడాది జరిగిన కథారచన కు ముందు, పిల్లలతో .. వోల్గా, వాసిరెడ్డి నవీన్, శిరంషెట్టి కాంతారావు,అక్కినేని కుటుంబరావు,భగవాన్, చంద్రలత, ముళ్ళపూడి సుబ్బారావు  తదితరులు మట్లాడారు.కథారచనలోని మెళుకువల గురించి.విషయనేపధ్యాల గురించి. భాష గురించి. అనేకానేకం.సుమారు వందకు పైగా కథకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొన్ని రచనలను ఇకపై వరసగా మీరు చదవ వచ్చును. ఇవి పిల్లల రచనలు. మీ… Read More పిల్లల కలాలు

ఎదురు దెబ్బలు

http://www.eenadu.net/vasundhara.asp?qry=bala ఇవ్వాళ్టి వసుంధరలో అచ్చయినది అచ్చవగా మిగిలినది ఇక్కడ చదవ గలరు. ప్రశ్నలు వారివి. స్పందనలు నావి. Aug 4 (1 day ago) pillallo monditanam tagginchadantiki vallalni kottadam sarina panena? పిల్లలు మొండి వాళ్ళుగా పిలవబడుతున్నారంటేనే , అప్పటికే  వారి సున్నితత్వానికి ఎదురుదెబ్బలు బాగానే తగిలాయన్న మాట! అందరు పిల్లలు ఒక్కలాగానే ఉన్నా ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన నేపధ్యాలలో పెరుగుతారు. ఎవరికి వారు తమ పిల్లలకు మంచి గృహ వాతావరణాన్నే అందించాలని ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ , పిల్లల… Read More ఎదురు దెబ్బలు

చదువులలోని సారమెల్లా

ఆ మధ్య రాసిన “ఆవర్జా ” అనే కథలో విధీశ అనే పాత్ర ఇలా అనుకుంటూ ఉంటుంది. ” నేనంటే.. నా ఆలోచనా? కాదు! నేనంటే … నా ప్రతిభా? కానే కాదు!! నేనంటే…??? నా లౌక్యం ..!!! ఇదీ ఈ రోజటి సత్యం !”                                                … Read More చదువులలోని సారమెల్లా

చదువు ఎలా ఉండాలంటే ?

మనం ప్రకృతిలో ఓ భాగం. మనం నేర్చుకొన్న పాఠాలన్నీ ప్రకృతిని అనుకరిస్తూ అనుసరిస్తూ నేర్చుకొన్నవే. ప్రకృతిని పరిశీలిస్తూ పరిషోదిస్తూ – మనం ఎన్నో విషయాలు తెలుసుకొన్నాం. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో విభేధిస్తూ – ఎన్నో మెళుకువలు అలవరుచుకొన్నాం. ప్రకృతితో పోరాడుతూ – గెలుస్తూ ఓడుతూ –ఎంతో నైపుణ్యాన్ని సాధించాం. మనం జంతువులం. మన బుద్ధి మనల్ని మనుషులుగా తీర్చి దిద్దింది. మానవ విలువలు మనం ఏర్పరుచుకొన్నవి. మానవ సంస్కారం మనం నిర్వచించుకొన్నది. ఆలోచన అనుభూతి మనకు ప్రకృతిసిద్ధంగా… Read More చదువు ఎలా ఉండాలంటే ?

చదువు ఎలా వుండాలి ?

ఒక్క మాటలో చెప్పాలంటే-నన్ను నన్నుగా ఉండనివ్వాలి. నేనెవరిని?ఒక మనిషిని.ఆలోచన అనుభూతి – నా సహజ లక్షణాలు. నేను నేనుగా ఉండడం అంటే –నా సహజత్వం నేను కోల్పోకుండా ఉండడం.నేను ఒక మనిషిలా ఊండడం.                                                 *నేను నేనుగా ఉంటే సరిపోతుందా?నా చుట్టూ ఉన్న నాలాంటి వారిలో నేను ఒకరిగా… Read More చదువు ఎలా వుండాలి ?