చదువు ఎలా ఉండాలంటే ?

మనం ప్రకృతిలో భాగం.
మనం నేర్చుకొన్న పాఠాలన్నీ ప్రకృతిని అనుకరిస్తూ అనుసరిస్తూ నేర్చుకొన్నవే.
ప్రకృతిని పరిశీలిస్తూ పరిషోదిస్తూమనం ఎన్నో విషయాలు తెలుసుకొన్నాం.
ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో విభేధిస్తూఎన్నో మెళుకువలు అలవరుచుకొన్నాం.
ప్రకృతితో పోరాడుతూగెలుస్తూ ఓడుతూఎంతో నైపుణ్యాన్ని సాధించాం.
మనం జంతువులం.
మన బుద్ధి మనల్ని మనుషులుగా తీర్చి దిద్దింది.
మానవ విలువలు మనం ఏర్పరుచుకొన్నవి.
మానవ సంస్కారం మనం నిర్వచించుకొన్నది.
ఆలోచన అనుభూతి మనకు ప్రకృతిసిద్ధంగా లభించినవే.
నేను మనిషిగా ఉండాలంటే
నా సహజసిద్ధ లక్షణాలను ,అపురూప గుణాలను పదిల పరుచుకొనేలా ఉండాలి.మరింత మెరుగు పరుచుకొనేలా ఉండాలి.
*
ప్రకృతి మరో చమత్కారం మనకున్న అద్బుత శక్తి – “జ్ఞాపకం
నిప్పు కాలుతుందని నిరూపించడానికి ప్రతిసారీ మనం చేతులు కాల్చుకోనక్కర లేదు.
మనకు తెలుసు. మనం ఇతరులకు తెలియపరచ గలం.
మనకు తెలిసిన దానిని మనం భద్ర పరుచుకోగలం.పంచుకోగలం.పెంచుకోగలం.
ఒకరి  నుంచి ఒకరికిఒక తరం నుంచి మరొక తరానికిఅందించ గలం.
ఇది మన సహజ స్వభావం. ఇవ్వాళ స్వభావానికి ఒక క్రమబద్ద్దత వచ్చింది. ” బడిరూపమైంది!
చదువుబడిలోనే ఉందనీ ..ఉండలనీ.. అనుకోవడం మొదలుపెట్టాం.
అందుకే..చాలా శ్రద్ధగా బడి చుట్టూ గోడలను కట్టాంచదువు భద్రంగా ఉందని సంతోషపడుతున్నాం.
కానీప్రకృతి గోడలకు బయట ఉందన్న విషయం మరిచి పోయాం.
ప్రకృతి మన తొలి బడి.సహజమైన బడి.
చదువు ఎలా ఉండాలంటే
ప్రకృతిలో అంతర్భాగమై ఉండాలి.
*
బైట ఉండాల్సిన వేమిటో 
లోన ఉండాల్సిన వేమిటో 
అన్నీ నాకు తెలుసు .
ఐతే ,
కిటికీకి 
ఇక్కడేం పని?” …అంటూ అమాయకంగా పెద్ద ప్రశ్న వేస్తారుస్మైల్తమ గోడ అనే కవితలో .

చదువు ఎలా ఉండాలంటే
గోడలతో నిండి పోయి కాదు ,ఒక చిన్న కిటికీలా ఉంటే..
చాలదా?
(26-1-07,వికాసవనం, విజయవాడ,ప్రసంగ పాఠం  నుంచి ఇంకొంత  )

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s