సిరా సేజ్జెం

పొలమంతా సిరా చల్లి, అక్షరాలు నాటేసి, కథన సేద్యం చేస్తే … అక్కడ మొలకెత్తేది ఆనందమా?ఆవేదనా? ఆందోళనా? ఆక్రందనా? ఖచ్చితంగా అవి అన్నీ కలగలసిన.. మొలకలపల్లి గారి ” సేజ్జెగాడు” కథాసంకలనం అయి ఉంటుంది ! అవునండి.  తెలుగునాట ప్రత్తిరైతులు పురుగుమందును కడుపులో దాచుకొని మన ఓటమిని తమదిగా దిగమింగిన విషాద నేపధ్యంలో , మొలకలపల్లి గారు నవలీకరించిన ఆ”ఆక్రందన” మనలను ఇంకా వెన్నాడుతూనే ఉండగా,  ఇదుగో ఇప్పుడు పదిహేడు కథల రూపంలో రైతుల జీవితశకలాలను “సేజ్జెగాడు”వెంట తీసుకొచ్చింది.… Read More సిరా సేజ్జెం

ఒక చిత్రం

మడత పేజీ పుస్తకావిష్కరణ.  డా. ఆనంద స్వరూప్ గారు, వీవెన్ గారు, డా. మంజులత గారు,  ” మా గోదావరి ” కొండవీటి సత్యవతి గారు, అబ్బూరి చాయా దేవిగారు, చంద్ర లత * All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అందరికీ ఆహ్వానం.

ఒక కప్పు కాఫీ. కాసిన్ని కబుర్లు . ఒక పుస్తకావిష్కరణ మనమందరం . ఇంతింత . మరికొంత. సమాలోచన డా. గద్దె  ఆనంద్ స్వరూప్ గారు , గణిత శాస్త్రజ్ఞులు ,బ్లాగురచయిత, బ్లాగ్మిత్రులు, మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా డా. ఆవుల మంజు లత ,  పూర్వ ఉపాధ్యక్షులు ,తెలుగు విశ్వవిద్యాలయం  శ్రీమతి  కొండవీటి సత్యవతి గారు,  “మా గోదావరి”,బ్లాగు రచయిత,సంపాదకులు ,భూమిక.  శ్రీ వీవెన్ గారు,              లేఖిని రూపశిల్పి, కూడలి… Read More అందరికీ ఆహ్వానం.

చివారఖరకు

ఒక్క విషయం తేల్చి చెప్పేయాలి మీరు! ఇక్కడ చూస్తోన్న ఈ పూసిన పువ్వేంటో , టక్కున చెప్పగలరా? బాగా చూడండి. దగ్గరగా. ఇప్పుడు చూడండి! తెలియట్లేదా?పోనీ, తెలుసుకొని చెప్పగలరా?ఊహు!నిత్యమల్లి కాదు.కాగడా మల్లి కానే కాదు.పట్నం బంతి కాదు.పగడపు బంతి కాదు.మాలతి కాదు.మందార కాదు.ఏమిటీ పిల్లప్రశ్నలు అని కళ్ళెర్రజేసేరు! పంతుళ్ల పండుగ రోజున ఈ పదారు ప్రశ్నలేమిటని అనుకోబోయేరు! ఈ పువ్వు పేరు తెలుసనుకోండి .మంచిది. నాకు మాత్రం చాన్నాళ్ళ తరువాత ,వెతకగా వెతకగా దొరికింది.దొరికాక మొదట విత్తులు సేకరించా .… Read More చివారఖరకు

పొత్తపు ఒడి

1  తొచీ తోచనమ్మ పుస్తకాలవ్యవహారంలో తల దూర్చిందటారేమో – మీరిదంతా  చదివాక! ఒక అల్లిబిల్లి ఆలోచన ప్రభవగా రూపుదిద్దుకొని అప్పుడే మూడో ఏడు! * మొదటిసారి నెల్లూరు వచ్చినప్పుడు – నాలుగు అట్టపెట్టెల్నిండా నాక్కావల్సిన పుస్తకాలన్నీ తెచ్చుకొన్నా.నాలుగునాళ్ళలో చదవడం పూర్తయింది. లెక్కలు, సాహిత్యం,చరిత్ర చదువుకొనే రోజులవి.లెక్కలు మిక్కిలి.పోతే ,సాహిత్యం.అందునా ఆంగ్ల సాహిత్యం.చదువుదామంటే , కావలసిన పుస్తకాలు కొత్తచోట ఎక్కడ దొరుకుతాయో తెలియదు. క్యాంటర్బరీ టేల్స్ నుంచి కమలాదాస్ దాకా చదవాలయ్యే. ఊళ్ళో ఉన్న గ్రంథాలయాలు ,పుస్తకాల దుకాణం ఒక… Read More పొత్తపు ఒడి