తలా ఓ పుస్తకం !

పిల్లలు వచ్చారు.పుస్తకాలు చదివారు.పరిచయం చేశారు! నవంబరు నెల .నెల్లూరు వానాకాలం.జడి వానలో తడుస్తూ వణుకుతూ ..పిల్లలు ..పుస్తకాలు…కబుర్లు.ఆ విశేషాలు ఇక్కడ చూడండి. http://prabhavabooks.blogspot.com/ *** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అక్షరాలా… అపరంజి !

అదేంటో గానీ,చెడు వినొద్దు కనొద్దు అనొద్దు …అని అచ్చం మన గాంధీతాత అనుంగు మనవరాళ్ళూమనవళ్ళలా  …అనుకుంటామా.. చెడు చూడకా తప్పదు.వినకా తప్పదు. ఇక అనడం అంటారా, అది మన పెదవి దాటే పలుకు  కనుక …ఎంతోకొంత మన అధీనంలోనే ఉంటుంది …కనుక ఫరవాలేదు. కానీ, చూడవలసిన  దృశ్యమూ ..వినవలసిన విషయమూ ..పరాధీనమే కదా ! నిన్న గాక మొన్న “అలనాటి నెల్లూరు”పుస్తకావిష్కరణ సభను ముక్తాయిస్తూ జ్ఞాపకం చేసుకొన్నాను.. పూర్ణమ్మను. “నలుగురు కలిసి నవ్వేవేళల నన్నోపరి తలవండీ” అని… Read More అక్షరాలా… అపరంజి !

గవ్వ మీది రంగులు

3 ప్రతిఫలం ఆశించని ఈ సాహితీ బంధువు బదులుగా కోరేది ఆగకుండా రాయడాన్నే. రాస్తూ ఉండడాన్నే. అయితే,ఎలా పడితే అలా రాయడాన్ని కాదు. మొదట రాసిన దానికన్నా మరింత మెరుగుగా రాయడాన్ని .మరింత ఉన్నతంగా  రాయడాన్ని. “ఆవేశంతో రాసుకు పోవడం ఇతర సాహితీ రూపాలలో కొంత మేరకు చెల్లుతుందేమో కానీ ,నవలా రచనలో చెల్లదు.మానవ విలువల ఆంతర్యాన్ని ఆవిష్కరించడానికీ ,నవరసాలను సముచితంగా చిత్రించడానికీ ,జీవితాన్ని ప్రతిఫలించడానికి ,విస్తృత అవకాశం ఉన్న నవల ఉత్తమ సాహితీ రూపం .నవలారచనకు ఎంతో… Read More గవ్వ మీది రంగులు

ఒక్క కారణమే

2  జగమెరిగిన సాహితీపెద్ద చేరాకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒక కవిగా కళ్ళు తెరిచి ,భాషాధ్యయనం చేస్తూ   ,పరిశోధిస్తూ ప్రతిపాదిస్తూ -అటు సాహితీ విమర్షకునిగా ఇటు భాషాశాస్త్రజ్ఞునిగా ప్రసిద్దికెక్కారు. శ్రీ చేకూరి రామారావుగారు.    ప్రామాణికమైన చేరా రాతలు ఎన్నో కొత్త కలాలకు అండగా నిలిచాయి. కొత్త కొత్త వాదనలు ,ధోరణులు , సిద్ధంతాలు మూర్తిమత్వం పొందడానికి మూలమయ్యాయి. ప్రాచీన, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాన్ని  సాహితీవేత్తలను వారి ప్రత్యేక స్థానాలలో నిలబెట్టాయి. ఇది సాహితీ సత్యం. చేరాది మానవ… Read More ఒక్క కారణమే

పువ్వుల కొరడా

పదాలు పువ్వుల లాంటివి. పదాలు కొరడాల లాంటివి. పదాలు పువ్వుల కొరడాల లాంటివి. వాక్యాలలోకి ఒదుగుతూ .. భావోద్వేగాలను పొదుగుతూ.. పలకరిస్తూ..పరామర్షిస్తూ.. పరీక్షిస్తూ..పరిచయం చేస్తూ.. విమర్షిస్తూ..విపులీకరిస్తూ.. వెన్ను తడుతూ ..వెన్నంటి నడుస్తూ.. భాసిస్తూ ..భాషిస్తూ.. విరబూసిన ఆత్మీయ పదాలు.. చేరాతలు. భాషతో చెలిమి చేస్తూ ..చెట్టాపట్టాలు వేసి తిరుగుతూ .. గాలివాటున నేలరాలిన పూల సుగంధాలను .. మొగ్గ విప్పుతోన్న కుసుమ సౌరభాలనూ .. విప్పారిన పుష్పసౌందర్యాన్ని … ఆస్వాదించి .. అపురూపంగా సేకరించి,గుదిగుచ్చి,  ఆ సుమహారాన్ని ఆప్యాయంగా… Read More పువ్వుల కొరడా

గిరిజనాత్మకం !

“నేను నాగురించి ఈ రోజు రాయదలుచుకొన్నాను” అంటూ పి.పద్మావతి మొదలు పెడితే, “ఈ అవకాశం మాకు వస్తుందను కోలేదు” అని అంటుంది పార్వతి. ‘చిన్న కుటుంబము చింతల్లేని కుటుంబము. కానీ, మాది చిన్న కుటుంబము పేద కుటుంబము .”  ..ఈ భూమిపై ఆవర్భవించిన మానవ పక్షి యొక్క ఆత్మవ్యధ ..” అంటూ తన జీవిత విషాదమేమిటొ వివరిస్తాడు భూక్యా శివ S/O మదర్ సుగుణ . అమ్మ, నాన్న, ఆకలి, చదువుకోవాలన్న తపన, పట్టుదల ..వీటన్నిటినీ ,అక్షరాల్లో… Read More గిరిజనాత్మకం !

అఖిలాంధ్ర పాఠకులకు

అసలు సిసలు వైరాగ్యం అంటే ఏంటో– నన్నడగండి. చెపుతా. అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే ఏంటో– అదీ నాకు తెలుసండోయ్! ఆ చిదంబర రహస్యం.. నేనేదో  అడ్డొచ్చిన అడవుల బట్టో.. ముక్కు మూసుకొని ఒంటికాలిమీద తపస్సులు చేసో.. కనబడ్డ గ్రంథాలయాల్లోఅంతా దూరేసి.. చేతికందిన పుస్తకాన్నల్లా గిరిగిరా తిప్పేసో.. గురూజీఅమ్మాజీల శిష్యరికం బట్టో .. చెప్పిన బోధలన్నీ శ్రద్ధగా చెవిన బట్టో.. తెలుసుకోలేదండోయ్! పోనీ,  బుద్ధిగా  కూర్చుని  ధీర్ఘంగా చింతన చేద్దామన్నా  ,  మా వీధిలో రావిచెట్టైనా లేదయ్యే… Read More అఖిలాంధ్ర పాఠకులకు

సుహానా సఫర్

పిల్లలు ఏ పని చేసినా ముచ్చటగానే ఉంటుంది .అందునా ,గుప్పెడు అక్షరాలు వారి చేత చిక్కాయనుకోండి…ఎన్ని చమత్కారాలు చేయ గలరో.. చూడండి. ఈ చిన్నారి.. ఏకంగా తన స్వంత బ్లాగునే మొదలు పెట్టేసింది.అచ్చమైన తెలుగమ్మాయి. ఇప్పుడిప్పుడే అక్షరాలు చేతబట్టింది. తెలుగు నాట ఉన్న ఎన్నో బడుల్లాగే,వాళ్ళ బడిలోనూ తెలుగు తక్కువ.తనకూ తెలిసింది తక్కువే.అందుకే, తను రాయగలిగిన విషయాలను తనకు వచ్చిన మాటల్లో చెపుతోంది.. చూడండి. పిల్లల సృజనకు  భావ వ్యక్తీకరణకు వారి భాష అడ్డంకి కాకుడదు కదా… Read More సుహానా సఫర్

ఆశించడమైనది !

ఎక్కే రైలు దిగే రైలు అన్నచందాన  తయారయ్యింది ఈ నడుమ. ఎక్కిన రైలు ఎక్కినట్టే ఉంది. దిగిన రైలు దిగినట్టే. రైలు బండెక్కడమంటే ,అందరు పిల్లల్లాగానే, చుక్ చుక్ రైలు బండెక్కి, ముందున్న వారి చొక్కా కొసల్నో లంగా, గౌను చివర్లనో  పట్టుకొని , కూ మంటూ వీధంతా తిరగడమే. అప్పట్లో  పాలమూరు నుంచి మా వూరికి వెళ్ళాలంటే , ఒక పాసెంజరు ఎక్కి వెళ్ళే వాళ్ళం. అది ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు .ఎక్కడ నుంచి వస్తుందో… Read More ఆశించడమైనది !