పత్రిక – పాఠక సంబంధాలు !

ఈ శీర్షిక ఎక్కడో విన్నట్టుగా మీకనిపిస్తే , ఖచ్చితంగా అది శ్రీ రమణ గారి , “గుత్తొంకాయ -మానవసంబంధాలు ” అన్నమాట!కొన్నేళ్ళుగా  ,  ఆపకుండా  ఆ శీర్షికతో కలిగిన పాఠక సంబంధం మహిమ అదీ ! రచయితకి  జై కొట్టి,  ఆ శీర్షికకు భూమిక అయిన “పత్రిక “విషయం లోకి వద్దాం. ఎప్పటిలాగానే , దీపావళి మరియు జన్మదిన ప్రత్యేక సంచిక , పత్రిక ,మన మాసపత్రిక  , ను ఉత్సాహంగా తీసుకొని అలా తిరగేయగానే, అట్ట… Read More పత్రిక – పాఠక సంబంధాలు !

పల్లెమూలాలు

స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వాలతో నిండిన మానవ విలువలను ఆవిష్కరించ గలిగే సమర్థత  సాహిత్యానికి ఉన్నది. సమాజాంలో అంతర్లీనమై సమాజాన్ని ముందుకు నడిపించగల భావ పరిణితి,మేధో చింతన  ,మానసచేతన ,మానవ సంస్కారం ,సామాజిక ఆర్ద్రత  రచయితకు ఉన్నప్పుడు ఆ రచన ఉన్నత విలువలతో మనకు అంది వస్తుంది. ఆయా తరాలలో నవలారచయితల పరిమితులను అర్ధం చేసుకొంటూ , పరిణితిని స్వీకరించే ప్రయత్నం చేద్దాం. అలనాటి అగ్రహార దురాచారాలను దురభ్యాసాలను ఎండకడుతూ కళ్ళు తెరిచిన రాజషేఖర చరిత్రము (1878) తెలుగు నవలకు… Read More పల్లెమూలాలు

రచనాపరిమితి

ఏ రచనకైనా పరిమితులు ఉంటాయి. గ్రామీణజీవిత చిత్రణలో తెలుగు అన్వలకు ఉన్న పరిమితులు అలాంటివే. సమకాలీన పరిస్థితులకు లోబడిన రచయిత వ్యక్తిగతాభిప్రాయాల ప్రభావం రచనపై ఉండకపోదు. అందులోనూ సృజనాత్మక రచనలలోని కళాత్మకవిలువలు రచయిత వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడిఉంటాయి.ఎంత పరిణితి చెందిన వారని భావించిన వారి కైనా ఎంతో కొంత పరిమితి తప్పదన్నది వాస్తవం. అలాగే ,జీవితానికి ఒక నిర్దిష్ట రూపం లేదు.ఏ సిద్ధాంతాలలోనూ క్రోడీకరించలేము. ఏ సూత్రాలలోనూ బంధించలేము. ఏ చట్రాలలోనూ బిగించలేము. కానీ, నవలకు రూపం… Read More రచనాపరిమితి

తెలుగు నవల గుండె చప్పుడు

* గ్రామీణ జీవితం* నూట పాతికేళ్ళ క్రితం సాంఘికప్రబంధంలా కళ్ళు తెరిచిన తెలుగు నవల , పల్లె సీమలో పుట్టి ,పంట చాళ్ళలో పెరిగి ,ఏటి గట్లపై నడిచి ,మడిచెక్క కై పోరాడి , పిడికెడు మట్టిని  గుండెకు అదుముకున్నది. తెలుగు నవలానాయకుడు కాడిపట్టి పొలం దున్నుతూనే ఉన్నాడు. తెలుగు నవలానాయిక నడుం బిగించి నాటు వేస్తూనే ఉన్నది. తెలుగు నవలల పుటలు నారుమడి తడితో నిండిపోతూనే ఉన్నాయి. గ్రామీణ జీవితమే ముఖ్యమైన తెలుగునవలల్లోని కథ, వస్తువు,వాతావరణం. ధవళేశ్వరం… Read More తెలుగు నవల గుండె చప్పుడు

బాల్యం గడప లో పగుళ్ళు

నవంబరు నెల వచ్చిందంటే చాలు . పిల్లలు తయారు. పిల్లల పండుగకు సిద్దమవుతూ. బడిలోనో మరోచోటో పిల్లల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే  ఉద్దేశం తో అనేకానేక కార్యక్రమాలు నిర్వహింబడతాయి. కొన్ని అధికారహోదాతో . మరికొన్ని స్వచ్చందంగా. ఆ బాలల బాబాయి,జవహర్ లాల్ నెహ్రూ కు నివాళిగా. వీటన్నిటికీ మాధ్యమంగా ఇప్పుడు మరొక వేదిక పిల్లలకు అనునిత్యం లభ్యమవుతూ ఉన్నది. అది , మిరుమెట్లు గొలిపే టివి తెర. అందులోను , ఇప్పుడు పండగలన్నీ మనం జరుపుకొనేది టివి తెరలపైననే… Read More బాల్యం గడప లో పగుళ్ళు

ఎక్కడ పిల్లలు గౌరవించబడతారో ..!

మీరు సరిగ్గానే చదివారండి. అది  పిల్లల గారాబం కాదు,  పిల్లల గౌరవమే ! పెద్దలు మన్నించండి !ముందుగా, పిల్లలను గౌరవించండి ! అదేంటి … మనం ఏం నేర్చాం? ఏం నేర్పుతాం? పెద్దల్ని కదా గౌరవించాలి? తప్పకుండా. అలాగే గౌరవిద్దాం. అంత కన్నా ముందుగా ,  పిల్లల్ని గౌరవిద్దాం. పిల్లల్ని ప్రేమించాలి గానీ, గౌరవించడం ఏమిటీ.. మరీ ఈవిడ విడ్డూరంగా మాట్లాడుతోంది… అని ఏ మూలైనా మీలో ఒక సందేహం మెదిలిందా? ఒక్క నిమిషం. మీ టివి… Read More ఎక్కడ పిల్లలు గౌరవించబడతారో ..!

కథాకమానీషు !

పిల్లలకు కథలంటే ఎంతిష్టమో ! ఇక, వారినే కథలు చెప్పమన్నామంటే , ఇట్టే అల్లేసి ,చక చక గబగబ చెప్పేయగలరు. అంత దాకా ఎందుకు? ఇవ్వాళ బళ్ళో ఏం జరిగిందో అడిగి చూడడి. ఎన్ని కథలు చెపుతారో! ఇప్పుడు చెప్పబోయేది పిల్లలు కథలు రాయడం గురించి. అందునా ,పిల్లల పండుగ  సంధర్భంగా పిల్లలందరినీ ఒకచోట చేర్చి, కథలు రాయమన్నామే ..ఆ విశేషాల గురించి! పిల్లలకు హాస్యం ,సాహసం  ,అద్భుతం   ..అంటే ఇష్టం కదా .అందుకే ఆ రోజు ఇచ్చిన మూడు… Read More కథాకమానీషు !

టపటపల టపాకాయ!

టపాకాయలను  వద్దనకుండా ,కాలుష్యరహితంగా దీపావళి పండుగను  ఎలా గడపవచ్చునో మీకు ఏమైనా తెలుసా?కొంత కొత్తగా ఆలోచించి చూడండి!మొన్న ప్రభవలో ,పిల్లలు ఎన్నెన్ని  రకాల ఉపాయాలను చెప్పారో!ఇక, శ్రీహిత్  చెప్పాడు.వాళ్ళమ్మతో బాటు ఈ మధ్య వానలు పడ్డప్పుడు మొక్కలు నాటాడట. నెల్లూరు బుజ్జి న్యూటన్ గారు వీరే !  అప్పుడు చూశాడట, కొన్ని నీళ్ళు పడగానే ,టప టప లాడిన కనకాంబరం విత్తనాలను.అలా టప టప లాడడానికి గల జీవ రహస్యమేమిటో కనుక్కుని, దానిని అన్వయించి ,తాను కొత్తరకం టపాకాయలు తయారు… Read More టపటపల టపాకాయ!