కథాకమానీషు !

పిల్లలకు కథలంటే ఎంతిష్టమో !
ఇక, వారినే కథలు చెప్పమన్నామంటే , ఇట్టే అల్లేసి ,చక చక గబగబ చెప్పేయగలరు. అంత దాకా ఎందుకు? ఇవ్వాళ బళ్ళో ఏం జరిగిందో అడిగి చూడడి. 
ఎన్ని కథలు చెపుతారో!
ఇప్పుడు చెప్పబోయేది పిల్లలు కథలు రాయడం గురించి.
 అందునా ,పిల్లల పండుగ  సంధర్భంగా పిల్లలందరినీ ఒకచోట చేర్చి, కథలు రాయమన్నామే ..ఆ విశేషాల గురించి!
పిల్లలకు హాస్యం ,సాహసం  ,అద్భుతం   ..అంటే ఇష్టం కదా .అందుకే ఆ రోజు ఇచ్చిన మూడు “కథన సంధర్భాలను” ఇలా ఇచ్చింది.
అవేమిటంటే,
1. మన వూరి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద, ఒక ఆదిమ మానవుడు   , ఒక రాక్ స్టార్
ఎదురు పడ్డారు. ఇద్దరూ ,ఒకే లాంటి  దుస్తులు ,అలంకరణ చేసుకొని ఉన్నారు. వారిద్దరి మధ్యన ఎలాంటి  సరదా సంఘటన జరిగి ఉంటుందో ..ఊహించి  రాయడి.
2. మీరొక  అంతరిస్తున్న జీవరాశికి చెందిన ఆఖరి కుటుంబ సభ్యుడు . మీరేం చేసి మీ జాతిని/సమూహాన్ని అంతరించి పోకుండా కాపాడుతారో రాయండి.
3. మీరు అనుకోకుండా తప్పి పోయారు. ఒక ఏకాంత ప్రదేశం చేరుకొన్నారు. అప్పుడు మీ వద్ద కేవలం మూడు వస్తువులు ఉన్నాయి. వాటిని వినియోగించి , మీవారిని మీరు ఎలా కలుసుకొంటారో ..కథలా రాయండి.
మీ ఊహ నిజమేనండి.
పిల్లల్లో ఎక్కువమంది సరదాకథనే రాశారు.
ఇకపై మీరు , వారి కథలన్నీ వరుసగా చదవొచ్చు. ఆ కథలన్నీ , పైన చెప్పిన ఏదో ఒక కథన సందర్భానికి చెందివన్న మాట!
బాల రచయితలకు బోలెడు శుభాకాంక్షలు.
మీ అభిప్రాయాలు ఆ చిన్నికలాలకు మార్గదర్శకం కాగలవు.
కనుక, మీ సూచనలను వారందరి తరుపునా ఆహ్వానిస్తున్నాం.

సృజనాత్మకతకు భాష ఒక మాధ్యమమే కానీ, అడ్డంకి కాదు.కథ కథనానికి అవసరమైన భాషను పదాలను తనే వెతుక్కుంటుంది… కథకుడికి తెలిసిన భాషాప్రపంచంలో!
తెలుగులో కూడా రాయమని ,ఎంతగా ప్రోత్సహించినప్పటికీ పిల్లలంతా ఆంగ్ల భాషలోనే రాశారు. ఒకే ఒక్క రచన తెలుగులో .
పిల్లలకు వారి తెలుగు పట్ల బోలెడంత అపనమ్మకం.
బాగా రాదని. తెలియదని. పదాలు లేవనీ. తప్పులు పోతాయని.


వాళ్ళు మనం ఎలా వీటిని పిల్లలకు అబ్బేలా చేయాలో, మనకు హోం వర్క్ ఇచ్చేశారు. ఆ పనిలో మనం ఉందాం. 


ఈ లోగా , వాళ్ళకు వచ్చిన మాటల్లో ,
వారు రాసినవి రాసినట్టుగా మీ ముందుంచుతున్నాము.
దాదాపుగా  పిల్లలందరికీ ఇది తొలి ప్రయత్నం.
చదవండి మరి!
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s