పత్రిక – పాఠక సంబంధాలు !

ఈ శీర్షిక ఎక్కడో విన్నట్టుగా మీకనిపిస్తే ,

ఖచ్చితంగా అది శ్రీ రమణ గారి ,
“గుత్తొంకాయ -మానవసంబంధాలు ” అన్నమాట!


కొన్నేళ్ళుగా  ,  ఆపకుండా  ఆ శీర్షికతో కలిగిన పాఠక సంబంధం మహిమ అదీ !
రచయితకి  జై కొట్టి,  ఆ శీర్షికకు భూమిక అయిన “పత్రిక “విషయం లోకి వద్దాం.


ఎప్పటిలాగానే , దీపావళి మరియు జన్మదిన ప్రత్యేక సంచిక , పత్రిక ,మన మాసపత్రిక  , ను ఉత్సాహంగా తీసుకొని అలా తిరగేయగానే,
అట్ట మీది అరచేతిలో ప్రమిద  వత్తి రెపరెపలు తాకాయి!
కాదు, ఆరే దీపానికి వెలుగెక్కువని  అందుకే కాబోలు అంటారు!

ఒకటా రెండా , ఇన్ని సంచికలు” ఆర్ధిక భారం మోస్తూ , హార్ధికం గా ” పాఠకులకు చేరాలని పడ్డ తాపత్రయాన్ని మొదటి పేజీలో వివరించారు.ఆని సాధకబాధకాలు ఓర్చి , ఒక మంచి కథల  పత్రికను అందిచాలని చేసిన ఈ ప్రయత్నం చివరకు ఏం మిగిల్చింది?
పత్రికొక్కటున్న పదివేల బలగమ్ము ” అన్నారు కదా , మరి అంగబలం లేక ఆర్ధిక బలం చాలక పడ్డ ఇబ్బందులు వివరిస్తుంటే, చదివి బాధ పడకుండా ఉండగలమా?
“ఆ అంతేలే , ఇలాంటి పత్రికలన్నిటి అనుభవం ఆఖరికి ఇంతేలే !” అని ఓ నిట్టూర్పు వదిలి ఊరుకొందామా?
ఒక్కో మంచి పత్రిక ఉక్కిరిబిక్కిరయ్యి ఊపిరాడక కాలంలో కలిసిపోతుంటే, తెలుగువాళ్ళం మౌన ప్రేక్షకులమై సాగనంపక ఏమైనా చేయగలమా?
సీనియర్ పాత్రికేయులు శ్రీ ఐ వి వెంకటరావు గారి మానసపుత్రిక అయిన మన పత్రిక , శ్రీరమణ గారి సంపాదకత్వంలో ఎన్నెన్ని సాహిత్యవన్నెలు చిందించిందో!
***

తెలుగునాడి పత్రిక ను ఇకపై కొనసాగించలేమంటూ ఆ పత్రిక వ్యస్థాపక సంపాదకులు జంపాల గారు , రాసిన సంపాదకీయం ఇంకా మనసు లో మొదలుతూనే ఉంది. 
ఏ దేశమేగినా మన తెలుగు వాళ్ళం ఒక మంచి పత్రికను నిలబెట్టుకోలేని వాళ్ళమై పోయామే అని దిగులు  వేసింది. ఆ సంధర్భంలో , తెలుగునాడికి రాసిన ఇ .లేఖలోంచి కొన్ని వాక్యాలు. 
మళ్ళీ ఇక్కడ ప్రస్తావించ వలసి వస్తుందని అనుకోలేదు. తప్పలేదు.

***
నిన్ననే తెలుగు నాడి ఆఖరి సంచిక అందుకొన్నాను.
 ఇక పై పదమారా పలకరించే పత్రిక ఉండదని దిగులేసింది.
ప్రతి నెల క్రమం తప్పకుండా మా ఇంటికి వచ్చే ఆత్మీయ అతిథిఇక రాదు.
సంపదకీయం చదివేప్పుడల్లా  స్వయాన మీరే మాట్లాదుతున్నట్లుగా అనిపించేది.
సారి మీరు రాసిన సంపాదకీయం చదవ వలసిన రోజు వస్తుందనుకో లేదు.
మరొక పత్రిక రావాలంటూ మీరు చెసిన సూచన ఎంతో హృద్యంగా తోచింది.
నిజమే .
ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి.
మరొక  చోట.
మరొక సారి.
(16-6-2009)


***
“పత్రిక “వారందరికీ అనేకానేక ధన్యవాదాలు. 

పత్రిక సంపాదకులు “ఇది విరామమే కానీ వీడ్కోలు కాకుండా ఉండేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని “అన్నందుకు మరొక్క మారు జేజేలు.

కొంత విరామం తరువాత, మళ్ళీ  మన “పత్రిక” మనలను పలకరిస్తుందనే ..

ఆశతో ఆకాంక్షతో..
మన పాఠక సంబంధాలను మరొక మారు పునర్నిర్వచించే  ప్రయత్నం చేద్దాం!
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s