అక్కడా ఇక్కడా

నేనెంతో  బుద్దిమంతురాలిని కదా,  టీవీ లో నాన్ స్టాప్ నాన్చుడు   వార్తలు గట్రా చూడను! చూసినా జడుసుకోను! అయినప్పటికీ అడపా దడపా వ్రతభంగం తప్పదుకదా! ఇందాక రెండు వార్తలు ఒక చానెల్ లో. వెంట వెంటనే. మొదటిది  భక్తుల దీక్షా విరమణ . రద్దీ. రహదార్లు కిక్కిరిసిపోవడం .వాహనాల రాకపోకల స్థంభన.వగైరా వగైరా. ఇక రెండోది . నూతన సంవత్సర వేడుకలు. ఆ వ్యాఖ్యాత్రి గారు పరమౌత్సాహంగా “అంబరాన్ని అంటిన సంబరాల్ని” చెప్పి తరింపచేశారు. చిత్రంగా ,… Read More అక్కడా ఇక్కడా

కాలపు కుంచె కొసమెరుపు

 (శ్రీ అంపశయ్య నవీన్ గారి  “కాల రేఖలు” నవల కేంద్ర సాహిత్య ఆకాడెమీ అవార్డు పురస్కృతమైనప్పుడి రాసిన ప్రత్యేక వ్యాసం నుంచి  కొంత,మిసిమి లో ప్రచురితము.5-1-2005) *** కాలపు కుంచె కొసమెరుపు *** తెలుగు వారి జీవన చిత్రం కడుచిత్రమైనది. కాలం వాలున రగులుతూ..నల్గుతూ.వెలుగుతూ.. కరాళమవుతూ..కలవరపడుతూ..కళకళాడుతూ..కమనీయమవుతూ.. ఎంతటి పరిణితిచెందిన సృజనశీలి ప్రతిభకైన అంతుపట్టక ఓ పెనుసవాలై కవ్విస్తుంది. పట్టుబడీ పట్టుబడకుండా. సూక్ష్మమై.. స్థూలమై… సమస్తకలారూప విన్యాసమై ..ఆంతర్యం అంతుబట్టే  లోపలే అంతర్ధానమై పోతుంది. అందునా సామాన్యుని జీవిక! బహుషా తెలుగునాట సమాన్యుని… Read More కాలపు కుంచె కొసమెరుపు

“Oh ! Taramandal ! ”

 “Oh!Taramandal!” It  just  happend.  Our takeoff  to Taramandal! At The Hindu Metroplus Theatre fest conducted at Hyderabad for last four days. Taramandal is adopted from Sathyajith Ray short stroy ,Patol Babu Film Star. Every actor has an ambition  to twinkle at least once in their life time in a galaxy  of talent, dreams, aspirations  and… Read More “Oh ! Taramandal ! ”

వీరి వీరి గుమ్మాడి !

“వీరి వీరి గుమ్మడి పండు..వీని పేరేమి ?” అమ్మ మాకు నేర్పిన ఆట అది.మా తిరమల్దేవుని గుట్ట గేర్లో సందడిగా పిల్లలం ఆడుకొనే కుంటాటకు,చోరాటకు, లింగోచ్చకు  రైలాటకు..ఇది అప్పటి నుండి జత చేరింది.మీరు ఆడే ఉంటారు కదా?పిల్లలందరం బచ్చాలు వేసుకొని దొంగ ఎవరో తేల్చేసి ..అందరం గప్ చుప్ గా దాక్కోని..చూస్తుంటే , అమ్మ దొంగ కళ్ళు మూసి ..ఈ మాట అంటుండగా మాలో ఒకరం వెళ్ళి ముక్కు గిల్లేసి వచ్చేవారం. ఇక కళ్ళు తెరిచిన దొంగ అదెవరో… Read More వీరి వీరి గుమ్మాడి !

పాఠం వింటుంటే..!

పాఠాలు చెప్పేవాళ్ళంతా బుద్ధిగా పాఠం వింటుంటే.. వంచిన తల ఎత్తకుండా..చక చక వర్క్ షీట్లు పూర్తిచేస్తుంటే.. అడిగీ అడగక మునుపే ప్రశ్నలన్నిటికీ ..ఉత్సాహంగా మేం ముందంటే మేం ముందని పోటీలు పడి మరీ.. సమాధానాలు చెపుతుంటే, భలే ఉంటుంది కదా! అంతే కాదండి..ఒకే వ్యవహారం లో ఉన్న వాళ్ళంత మొదటిసారిగా కలవడం, కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవడం.. అనుభవాలు కలబోసుకోవడం… మరింత బావుంటుంది. ఈ రోజటి , సూసన్ రస్సెల్ గారి ట్రినిటి కాలేజ్ లండన్ ( జి ఇ ఎస్… Read More పాఠం వింటుంటే..!

ఆ…! అంటే , తెలుగొస్తుందా?

నోరారా పలకరించాలన్నా.. నోరూరించేలా కబుర్లాడాలన్నా.. నోరెత్తి అరవాలన్నా.. అమ్మ పలుకు పలికితేనే ముద్దు!   ఎటొచ్చి, ఈ నాటి బళ్ళలో ఇరుక్కొని , నానాటికీ చిక్కి పొతున్న మన మాతృభాష మాటెత్తామా …  ఇక అంతే! దుమారం రేగుతుంది! ఆవేశం పోటేత్తుతుంది! అది అటు తిరిగి ఇటు తిరిగి… పిల్లల మీదకు వచ్చి వాలుతుంది!   అలాంటప్పుడే , పిల్లల నోట తెలుగు పలికించాలని ,పిల్లల చేత తెలుగు  గిలికించాలనీ   … తపనతో తాపత్రయంతో ఉపన్యాసాలు ఒలికించేస్తాం!… Read More ఆ…! అంటే , తెలుగొస్తుందా?