పాఠం వింటుంటే..!

పాఠాలు చెప్పేవాళ్ళంతా బుద్ధిగా పాఠం వింటుంటే..

వంచిన తల ఎత్తకుండా..చక చక వర్క్ షీట్లు పూర్తిచేస్తుంటే.. 
అడిగీ అడగక మునుపే ప్రశ్నలన్నిటికీ ..
ఉత్సాహంగా మేం ముందంటే మేం ముందని పోటీలు పడి మరీ.. సమాధానాలు చెపుతుంటే,
భలే ఉంటుంది కదా!


అంతే కాదండి..ఒకే వ్యవహారం లో ఉన్న వాళ్ళంత మొదటిసారిగా కలవడం, కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవడం.. అనుభవాలు కలబోసుకోవడం… మరింత బావుంటుంది.
ఈ రోజటి , సూసన్ రస్సెల్ గారి ట్రినిటి కాలేజ్ లండన్ ( జి ఇ ఎస్ ఈ)  వర్క్ షాపు అచ్చం అలాగే ఉంది. కళకళ లాడుతూ .
అందులోను ,ఇది భాష ను నేర్పించడం అన్న మౌలిక భోధానంశానికి సంబంధించింది కనుక మరింత ఉత్తేజభరితంగా సాగింది.
సూసన్ గారు చాలా భిన్న నేపధ్యాలు కలిగిన వారికి ఒక విదేశీ భాషగా ఇంగ్లీషును నేర్పారు.అటు
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు  చైనాలోను భాషాభోధన చేశారు.  
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు చైనాలోను భాషాభోధన చేశారు.  పాఠశాలల నుండి శరణార్థుల శిబిరాల వరకు వారి పాఠాలు విస్తరించాయి.
లాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి విదేశీభాషగా ఇంగ్లీషు భాషాబోధనలలో PhD అధ్యనం చేశారు.
 ఇక వారి అనుభవాలను తెలుసుకొని, మా సందేహాలను జోడించి ,సందడి  సందడిగా.. రోజంతా… 
అధ్యాపనలో సంతోషసంబరాలు…సాధకబాధకాలు  కలబోసుకొన్నాం !వారి భాషాబోధనమెళుకువల సారాంశం ఒకటే,


ఏదైనా విషయం మీద విద్యార్థులు మాట్లాడుతుంటే ,వారిని మాట్లాడనివ్వండి.వారిని ఆపకండి. వారి తప్పులు ఎత్తి చూపకండి.మాట్లాడం పూర్తి కాకమునుపే సరిదిద్దకండి.

 మొదట,  వారి భావ వ్యక్తీకరణ ఒక సహజ ప్రకటన గా ఉండేట్టుగా ప్రోత్సహించండి. తమ భాషావినియోగంపై విశ్వాసం కలగనీయండి.ఆపై భావవ్యక్తీకరణలో స్పష్టత ,ఆ తరువాత  , దోషరహితం చేసుకోవడం ఎలాగో నేర్పించండి.
తమ భావాన్ని మరింత బాగా ఎలా వ్యక్తపరుచుకోవచ్చునో  వారిని స్వయంగా తెలుసుకోనివ్వండి.
స్వయంగా సరిదిద్దుకోనివ్వండి “
**
వింటున్నారా?

ఇవన్నీ  ఏ భాషాబోధనకైనా ఒక మంచి సూచనేగా?

గమనించగలరు.

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

2 thoughts on “పాఠం వింటుంటే..!

  1. బాగుంది.
    ప్రాథమిక విద్యపైన ఒక సదస్సులో ఒక వక్త అన్నారు – భాషా నేర్చుకోవడనికి పిల్లల మాట్లాడాలి. మన బడులలో తెలుగు క్లాసులోనూ ఇంగ్లీషు క్లాసులోనూ ఉపాధ్యాయుడే లొడలొడా వాగుతూ ఉంటే ఇంక పిల్లలు నేర్చుకునేదేముంది?

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s