కలానికో మేలిముసుగు

(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి ఇంకొంత) జీవితం అంటే జీవనం అంటే కేవలం నలుపు తెలుపు కాదు. ఆ రెండింటి నడుమ వెల్లి విరిసిన అనేక వర్ణాల సమాహారం. ఆ భిన్నత్వాన్నంతా రంగరించి ఒక రచనలో ఆవిష్కరించడం అంత సులువు కాదు. పైగా, చెప్ప దలుచుకొన్నదేమిటో  సూటిగా చెప్పడం వ్యాసంలోను ఉపన్యాసంలోను వీలవుతుంది. కాల్పనిక రచనలో విషయాన్ని తేటతెల్లం చేయడం వీలవదు. చెప్పదలుచుకొన్న విషయం కథగా పాత్రలుగా… Read More కలానికో మేలిముసుగు

ప్రకటనలు

సాహితీ సృజన ..నా ఎరుక

(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి కొంత) ఏ నియమాలకు లోబడని… ఏ నిబంధనలకు ఒంగని..ఏ సమీకరణాలలో ఇమడని ..ఏ సిద్ధాంతాలకు లొంగని..ఏ చట్రంలో కుదించని ఏ తరాజులో తూగని ..మానవుడినీ అతని జీవితాన్ని అతని జీవనాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నంలోనే,సాహిత్యం సృజనాత్మకమవుతుంది.సృజనాత్మకత జన్మతః అబ్బిన కళ.అది ఒక్కోరిలో ఒక్కో రూపంలో బహిర్గతమవుతుంది.మాటలో చేతలో ..వంటలో పంటలో …కొన్నిటిలో అన్నిటిలో… ఎంతో కొంత అంతో ఇంత ప్రకటితమవుతూనే ఉంటుంది. అక్షర… Read More సాహితీ సృజన ..నా ఎరుక

ప్రకటనలు

సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ .

శుభ సంక్రాంతి మీకు  మీ కుటుంబానికి.  * ప్రభవ పిల్లలలకు జేజే – కథారచనలో ప్రథమ బహుమతి పొందిన  ప్రణవ్ కథ  సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ . మీరు మీ కుటుంబం, మీ బంధుమిత్రులు  సంతోషంగా సంక్రాంతి  గడపాలని కోరుతూ …. ప్రణవ్ కు అభినందనలతో.  To Live Forever  http://prabhavabooks.blogspot.com/2011/01/to-live-forever.html అన్నట్లు , ప్రణవ్ రాసిన చిన్ని కవితనూ మీరు లోగడ చదివారు. మరో మారు ఇక్కడ చదవండి.http://prabhavabooks.blogspot.com/2010/11/dont-want-to-miss.html వారానికి ఒక మారు. ప్రతి శుక్రవారం. తప్పితే ఆ మరునాడు ! All rights @ writer.… Read More సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ .

ప్రకటనలు

అలవోకగా వచ్చి

మా తిరుమలదేవుని గుట్ట బడికి ఆడుతూపాడుతూ బయలుదేరినట్లు గుర్తులేదు. మా  మూడు గదుల ఇంట్లో  ఏమీ చదవనని మొండికేసిన మా  పెద్దమేనత్త కుమారుడి దగ్గర్నుంచి , చదువుకోసమని అమ్మని వదిలివచ్చిన పెదనాన్న మనవడి వరకు ఏడెనిమిది మంది పిల్లాపెద్దలు. తెమలని పని మధ్యలో,  పొద్దున్నే బడికి బద్దకించే నా బోంట్లకు ,  అమ్మ చీవాట్లు మొట్టి కా యలు. బడికి తలుచుకోగానే , మల్లమ్మ టీచరు వేయించే ముక్కుచెంపలు ,గోడకుర్చీవేయించే లింగమ్మ టీచరు ,గుర్తొచ్చి ముచ్చెమట్లు పట్టపట్టవూ పొద్దున్నే ! చెక్క స్కేలు తీసుకొని వేళ్ళమీద… Read More అలవోకగా వచ్చి

ప్రకటనలు

నీలకాంతాలు

పేరుకు ఇవి డిసెంబరాలే.   కానీ ,ఇదుగోండి ఇప్పుడు పూస్తున్నాయి !  ఆకుపచ్చని పొత్తిళ్ళ లో దాగి,  ఎలా తొంగిచూస్తున్నాయో చూడండి. చెట్లెక్కి కొమ్మల్లో ఊగుతూ  కోతికొమ్మచ్చులో దాగుడు మూతలో  ఆడుతున్న అల్లరిపిల్లల్లా…! చెరొక వైపు చూస్తూ !   మంచుదుప్పటి వీడి, ఒక్కో మొగ్గా మెల్లిగా  విచ్చుకొంటోంది. నీలం రంగు రెక్కలమీద  పిల్లలెవరో వెలుగు రంగులేసినట్లు తెల్లటి తెలుపు రేఖలు! నీలకాంతాలు అని పేరు పెడితే పోలా.  అన్నట్లు ,బంగాళాబంతులు, చేమంతులూ  ,గరుడవర్ధనాలు కూడా పూస్తున్నాయండోయ్! వారానికి ఒక… Read More నీలకాంతాలు

ప్రకటనలు

శుభాకాంక్షలు.

మీ కొత్త సంవత్సరం సర్వదా సృజనభరితం కావాలని.. మీరందరూ క్షేమంగా పచ్చగా ఉండాలనీ.. మీరు బోలెడన్ని పుస్తకాలు చదవాలనీ.. పుస్తకాలు రాసేవాళ్ళు మరిన్ని పుస్తకాలు రాయాలనీ..మీ ప్రయత్నాలన్నీ ఫలప్రదం కావాలనీ కోరుకొంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు.స్నేహంగా. All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

ప్రకటనలు