ఎంత మేరకని !

ఒక్కో సారి అంతే ! మన జీవితాలకి సంబందించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు- ఎక్కడో జరుగుతుంటాయి. ఎవరో తీసుకుంటుంటారు.ఎప్పుడో తెలుస్తుంటాయి. మనం అలా చూస్తూ ఉండాల్సి వస్తుంది. నిశ్శబ్దంగా. మనం అలా జీవించాల్సి వస్తుంది. నిస్సహాయంగా. చూడండి. అది వ్యక్తిగతమైనదైనా, కుటుంబపరమైనదైనా, రాజకీయమైనదైనా, సాంస్కృతికమైనదైనా . మనం పిల్లలం కావడం చేత  కొన్ని సార్లు, మనం మహిళలం కావడం చేత ఎన్నో సార్లు, మనం సిబ్బంది కావడం చేత మరికొన్ని సార్లు,  స్వతంత్ర దేశ పౌరులం కావడం చేత అనేక… Read More ఎంత మేరకని !

నేను లేనూ- ఇపుడిపుడే రానూ ..

వురేయ్ ఈ ఖద చదివేవాడూ..ఈ ఖద చదివేవాడూ! ఆ గోపిగాడొస్తే నేను లేనూ- ఇపుడిపుడే రానూ -తెలుగు సినిమాకి వెళ్ళిపోయానూ అని చెప్పరా- ఎం?” ***అయిపోయింది*** అయిపోయిందంటూ  మనకి దూరంగా పరుగులు పెట్టేసిన ఆ పెద్దాయనకు  ఏమని చెప్తాం?  బుడుగు ని ఇలా మనకు అప్పజెప్పేసి .. తాను తప్పుకున్న పెద్దాయనకు! ఎప్పటికీ అయిపోని  ఈ బురుగు ఖదలకు, ఆ కథకుడి కలం పోషణకి……జై!  ఆ పసితనపు పచ్చదనం పదికాలాలు పదిలం.పదిలం. ముళ్ళపూడివారికి  జేజేలు పలుకుతూ.. అన్నట్లు, అదేంటో,… Read More నేను లేనూ- ఇపుడిపుడే రానూ ..

ఒక ప్రజా వైద్యుని జీవితంలోకి 1

డా.రాం                           అన్నకు తమ్ముడు లఘువా? అన్న తమ్మునికి గురువా? ఒక చేతి వేళ్ళయ్యా! ఎక్కువ తక్కువ లెందుకు? ( కె వి యార్,1967 ) 21 జనవరి 1915 లో  పుచ్చలపల్లి వారింట కడపటి బిడ్డగా , శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడి గా పుట్టిన  రాం  1935-40 ల నడుమ మద్రాసులో వైద్య విద్య ను అభ్యసించారు. ఆ వెంటనే ప్రజలకోసం వైద్యం ..ప్రారంభించారు. 21-4-67 న ప్రజావైద్యునిగా చెరగని ముద్ర వేసి ,ఒక  అద్బుతమైన ప్రజా వైద్య శాలలో తన ఊపిరిని నింపి వెళ్ళారు.  వృత్తికి, ప్రవృత్తికి నడుమ ,ఆయన జీవితం ఆలోచనలు,కార్యాచరణ, ఆవేశం, ఉద్రేకం, నిరాశ ,మనః క్లేశం …ఎన్నిన్ని కోణాలో.. ఈ స్మారక వ్యాసాల్లో ఎంత వెతికినా ఆ మానవుడు మనకు అంతుచిక్కడు కదా!  అందుకేనేమో వారి వ్యాసాన్ని శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు , “Do I know Ram ?” అంటూ మొదలెట్టి , అదే ప్రశ్న తో ముగించారు ! ఇందులో డా.రాం గార్ని సన్నిహితంగా ఎరిగిన మిత్రులు Prof.K.శేషాద్రి గారు,  జస్టిస్ గంగాదర రావు గారు,జి,కృష్ణ గారు, డా.సంజీవ దేవ్ గారు, డా, CR రాజగోపాలన్ గారు ,ఆచార్య పి.సి.రెడ్డి గారి వంటి అనేక మంది ప్రముఖులు డా.రాం గారిని వ్యక్తిగా  పరిచయం చేస్తారు. వ్యక్తిత్వాన్ని మనకు స్పురింపజేస్తారు. డి.రామచంద్రారెడ్డి గారు విశ్వోదయ తో డా.రాం గారి అనుబంధాన్ని తెలియ జేస్తూనే , వారి పరస్పర మైత్రి ని , వారి నుంచి వీరు పొందిన స్పూర్తిని..హృద్యంగా వివరిస్తారు. ప్రజలు వారి ఆరోగ్యం గురించి  డా .కాకర్ల సుబ్బారావు గారు రాసిన వ్యాసం ఒకటి వైద్యరంగలోని మౌలికాంశాలను స్పృశిస్తుంది. మధురాంతకం రాజారాంగారు కథాసాహిత్యం  లో సామాన్యుడి గురిచి అలవోకగా వివరిస్తే, డా. కొండప్ల్లి శేషగిరి రావు గారు , కాకతీయ కళలో వారి అనుభవాల్ని వివరించారు. ఇవి ,కాకుండా అనేక సాహిత్య, చారిత్రక ,సమకాలీన ప్రగతి పూర్వక అంశాలను రచయితలు స్పృషించి డా. రాం కు నివాళి గా సమర్పించారు. కాకరాల గారు వ్రాసిన “మిత్రత్రయం ” ,కెవియార్ గారి జోహారు పలుకుతూ అక్షరాల్లో గుమ్మరించిన అక్షరమల్లెల పరిమళం మనల్ని చాలా సేపు వదలవు. వకుళాభరణం రామకృష్ణ గారు హెచ్చరించినట్లుగా ,” డా.రాం  ప్రజా వైద్యుడు. ఉద్యమకారుడు.గొప్పవ్యక్తి .మంచి వ్యక్తి .కానీ పొరపాటునా   దేవుడిని చేసేసేరు !” నిజమే, ఈ సంచికలోని ప్రముఖ రచయితలంతా, డా. రాం లొని విభిన్న కోణాలను ,ఆయా పరిమితులతో  సహా పరిచయం చేశారు. విఫలమైన ప్రథమ వివాహం గురించి మాట్లాడినా, “I… Read More ఒక ప్రజా వైద్యుని జీవితంలోకి 1

ఒక ప్రజావైద్యుని జీవితంలోకి

“ఇంద మల్లె పువ్వు    ఇదో గులాబీ పువ్వు ఇవి డాక్టరు కివ్వు      పువ్వాయన నవ్వు ”  అంటూ , “ప్రేమకు వేల జవాబులు మంచికి లక్ష కితాబులు”  ఎంతో ఆప్యాయంగా డా.రాం  గారి పై  గుమ్మరించిన  కె. వి .రమణారెడ్డి గారి మాటలమల్లెలివి. అర్పించిన అంతిమ నివాళి ఇది . డా. రామ్స్  సావనీర్ పుస్తకాల అడుగున ఎక్కడ దాక్కుందో … మొన్నీ మధ్యన మళ్ళీ నన్ను పలకరించింది. ఆర్తిగా .ఆప్యాయంగా.  ఈ పుస్తకం అన్ని జ్ఞాపికల్లాగా ..మరుగైన వ్యక్తి ని అతని మంచిని గోరింతలు కొండంతలు చేసేసి ,నాలుగు బొమ్మలు, పదిమంది పరామర్షలతో..పుస్తకాన్ని ముడిచేసేది కాదు. ఇది , ఒక విశిశ్ట వ్యక్తి జీవితాన్ని, ఆలోచనను, కార్యశీలతను..అన్నింటినీ ఎన్నింటినో ప్రకటించే సంధర్భం. ఈ రోజున నెల్లూరు ప్రాంతంలోనే కాక ,మనందరికి ఆదర్షంగా నిలబడే, రెండు ముఖ్యమైన ఉదాహరణలకు ఆయన మూలకర్త.  సమాజానికి మౌలిక  అవసరాలైన విద్య, వైద్యం.. ఈ రెండు రంగాల్లో ..వారు రెండు  తిరుగు లేని  ఉదాహరణలను మన ముందు ఉంచారు. “A realistic idealist“అంటూ సంజీవదేవ్ గారు సంభోధించినట్లుగా, ఆదర్శాలకు సజీవ రూపకల్పన చేయ కలిగిన వారు, డా. రాం,డా.పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి గారు…. ప్రస్తుత నెల్లూరు రామచంద్రా రెడ్డి ప్రజావైద్య శాల స్థాపకులు. కావలి విశ్వోదయ వ్యవస్థాపకమూలస్థంభాల్లో ఒకరు.కావలి విశ్వోదయ లో, డా.రాం విగ్రహ స్థాపన చేసిన సంధర్భంలో ,తిరగవేసిన జ్ఞాపకాల పేటిక “ డా. రామ్స్   సావనీర్”  ఈ స్మారక సంచిక కు సంపాదకులు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారు. సంపాదకీయం ఇలా ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తుంది. “ఇది రాం పుస్తకం.పుస్తకాల పుటల్లో నిక్షిప్తం కాని కాలేని వ్యక్తిత్వం రాం ది. ఏ రచయితకు అంతు చిక్కదు ఆ శైశవ దరహాస హేల. ఏ శిల్పరుచికీ లొంగదు ఆ త్యాగ నిరతి మధురిమ .” పాత్రికేయులు జి.కృష్ణ గారు అన్నట్లు,” మానవత, నైపుణి, ముక్కోపం ,ధీరత్వం, త్యాగం, ఉద్వేగం, అసంతుష్టి .. ఇన్నింటిని భగవంతుడు ఒకే మనిషి లో ఎందుకు కలిపి పెట్టాడా అనిపించేది .” “పదాలు జడాలు. పదార్ధాలు సజీవాలు. అర్ధాలు మనం వెతుక్కోవాల్సిందే. ఎక్కడ? శూన్యంలో. నిశ్శబ్దంలో . ప్రేమలో. కారుణ్యంలో.” నా బోటి వాళ్ళకు, అప్పిచ్చువాడు , వైద్యుడు  లేని ఊళ్ళో ఉండడం ఎలాగో తెలియక పోవచ్చు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావచ్చు. ప్రథమ చికిత్స నుంచి బేర్ ఫుట్ డాక్టర్ల వరకు, మౌలిక వైద్యం  నుంచి  మానసిక చైతన్యం వరకు, సామాజిక రుగ్మతల చికిత్స నుంచి రాజకీయప్రక్షాళన వరకు…వైద్యుని బాధ్యతను విస్తరింపజేసిన “, నెల్లూరు పరిసరాల్లోని ఊరూరికీ వైద్యాన్ని చేర వేసిన… .ప్రజావైద్యులలో డా.రాం గారిని ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి.   “His life was a triple… Read More ఒక ప్రజావైద్యుని జీవితంలోకి

రేగడి విత్తులకు ముడిసరుకు

నిజమే. మా వంటి  రైతు కుటుంబాలలో పుట్టిన ఆడపిల్లలు , ఎప్పుడో పూజకో పునస్కారానికో తప్ప పొలం గట్టు తొక్కరు. రైతుల ఇంటి ఆడవాళ్ళు పాడికే పరిమితం. పంటలో వారు పాలు పంచుకోవడం అరుదు. దొడ్లో కూరపాదులు పెంచడమో, దడులమీద బీర తీగలు పాకించడమో తప్ప ,  పంటపండించడంలో భాగం లేదు. గడప దాటడమే గగనమైన వారికి ,పొలానికి వెళ్ళడం అన్న ఆలోచనే ఉండదు. మరి నాకు పొలం గురించి హలం గురించి, తెలియదనుకోవడం సహజమే. నేను రాసిన… Read More రేగడి విత్తులకు ముడిసరుకు

అనగా అనగా…ఒక కథ

రవీంద్రుని నూటయాభయ్యవ జయంతి ఉత్సవాల సంధర్భంగా , సంబరాలు జరుపుకుంటున్న మనం , ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకోవల్సిన విషయం ఒకటి , ఆయనలో నిండి ఉన్నది. అది విశ్వకవికి పిల్లలతో ,పిల్లల కాల్పనిక ప్రపంచంతో ముడిపడిన బంధం. శాంతినికేతనం పూదోటల్లో వెల్లివిరిసిన పిల్లల విద్యాప్రయత్నాల విశేషాలు మనకు  తెలిసినవే . ఒకసారి విదేశీపర్యటనలో ఉన్నప్పుడు ,వారి తొమ్మిదేళ్ళ మనవరాలికి ,రవీంద్రులు ఒక ఉత్తరం రాశారు.   అందులో అంటారు కదా,  “ఇక్కడ చాలా మంది నన్ను కలవడానికి వస్తున్నారు.… Read More అనగా అనగా…ఒక కథ

రేగడి విత్తులు వంటి నవల…..

రచయిత పడిన శ్రమ , పెట్టిన శ్రద్ధ, లోనైన వత్తిడి ..రచన బాగోగులను తేల్చవు.రసాత్మకమైన వాక్యమైనా కావ్యమవుతుంది. రచనను రచయితను నిగ్గుతేల్చేది పాఠకుల అభిప్రాయాలే. కొన్ని అభిప్రాయాలు వాత్సల్యాన్ని కురిపిస్తాయి. ప్రశంసల్లో ముంచెత్తుతాయి. నెత్తిన పెట్టుకొంటాయి.అభిమానాన్ని అందిస్తాయి. నిజాయితీగా విమర్షిస్తాయి. నిష్కపటంగా వ్యాఖ్యానిస్తాయి . మరికొన్ని అభిప్రాయాలు కన్నెర్ర చేస్తాయి. నిప్పులు చెరుగుతాయి .నిలువుపాతర వేస్తాయి.నిర్దాక్షిణ్యంగా నేల రాస్తాయి.నిర్లక్ష్యం చేస్తాయి. హేళన  చేస్తాయి. ఔదార్యం చూపుతాయి. ఇలా ఎందుకు రాసావని కొందరు నిలదీస్తే , అలా ఎందుకు… Read More రేగడి విత్తులు వంటి నవల…..

మనసు పొరల లోలోకి

 సమాచారాన్ని సేకరించడానికి ముందుగా వారికి మనపై ఓ నమ్మకాన్ని కలిగించాల్సి వస్తుంది.  “ఈ సమాచారం ఎటువంటి దాపరికం లేకుండా వీరికి చెప్పవచ్చును ” అన్న విశ్వాసాన్ని కలిగించాల్సి వస్తుంది. ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడు నిలబెట్టుకోవాల్సి వుంటుంది! కొందరు ఆశించిన దానికన్న ఎక్కువ సమాచారాన్ని అందిస్తే ,ఇంకొందరి చేత పెదవి విప్పించడమే గగనమవుతుంది. మరికొందరు, నీకు చెపితే మాకేమిటి లాభం? ” అంటూ తేల్చి పారేయడం మామూలే. ఒక కథ కోసం  నెల్లూరు నక్కలోళ్ళను అధ్యయనం… Read More మనసు పొరల లోలోకి

భాషాబిడియాలు

మనిషి మనిషికో మాట ఉంటుంది.  పలుకులో ఒక వింత సొగసు సోయగం ఉంటాయి.భిన్న మాండలికాలతో నాకున్న ప్రత్యక్షపరిచయం వలన , నా రచనలలో పాత్రోచితమైన భాషను అప్రయత్నంగా ప్రకటించుకోగలుగుతున్నాను. అయితే, ఏ మాత్రం పరిచయం లేని నక్కలోళ్ళ భాష యాస ఆకళింపు చేసుకోవడం కోసం అభ్యాసం చేయాల్సివచ్చింది. సంచారజీవులైన వారి భాషను అర్ధం చేసుకొనే ప్రయత్నంలో నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకొన్నాను. భాషాపరంగా నేను బిడియ పడింది ఒక్కమారే. అది రేగడి విత్తులలో ఎల్లమ్మ గుడిలో… Read More భాషాబిడియాలు