"బృందావనమది అందరిదీ"

“బృందావనమది అందరిదీ“ అన్న పాటంటే ఎందుకో గానీ, నాకు భలే నచ్చుతుంది. నిజమే కదా ,  అందములు అందరి ఆనందానికే కదా. అందుకేనా? ఆ నాయకుడు తన నాయికను అందంగా ఆటపాట్టించాడే అనుకుందాం. ఆ సున్నిత మనోహర సన్నివేశం మిగిల్చిన , అపురూప దృశ్యకావ్యం మాట కూడా అటుంచండి. మన ముందున్నవి, బృందావనమూ, అందములు, ఆనందములు ..మాత్రమే నన్న మాట! అదాటున ఓ వాన కురిస్తే..అల్లంతలో ఓ హరివిల్లు విరిస్తే , ఆ అందాన్ని చూసి పరవశించి పోని వాళ్ళం ఎవరం ఉంటాం చెప్పండి? తా చూసిందే అందమని… పెద్దలెప్పుడో వ్రాక్కుచ్చారు కదా? మరి వారి మాట కూడా ఓ చెవిన వెయ్యాల్సిందే! ఈ నేపథ్యంలో , బృందావనం అందరిది ఎలా అయిపోతుందబ్బా? అని  కంత్రి @ మంత్రి వ్యవహారాలు పతాకశీర్షికల్లో చూసి ముక్కున వేలేసుకోకుండా ఉండలేని కదా  మీబోటి నాబోటి వారం ! నిజమే నండి మరి.  ఆ కాలంలో కాబట్టి బృందావనం  అందరిదై పోయింది కానీ , ఈ కంత్రుల మంత్రుల తంత్రుల కాలంలో అయితేనా ..?!? చూశారా కాలమహిమ అంటే ఇదే!  ఒక అందమైన పాట గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ  కూడా…ఎలా భూగోల లోకి  బొక్క బోర్లా పడి పోతామో !  కదా? అదలా ఉంచుదాం. బృందావనం అందరిదే. కళ అందరిదే. శాస్త్రమూ అందరిదే. ఒకసారి ఆ పాటనే పలకరిద్దాం. దాదుపుగా యభై ఏళ్ళ పైగా మనం అంతో ఇంతో ఎంతోకొంత … ఆ పాటపై మన భావోద్వేగాల పెట్టుబడిని పెట్టేసాం.ఆ ఆలోచన అనుభూతి మనతో పాటు స్థిరపడుతూ ధృవపడుతూ ధృఢపడుతూ  వస్తూ ఉన్నది .ఏళ్ళ తరబడి.  రాగా రాగా  ఆ రాగము దానితో ముడిపడిన అనురాగమూ..మనలో భాగమై పోలేదు. మన సామూహిక భావనలతో స్పందనలతో  నిర్మించుకొంటూ వచ్చిన అందమైన పార్శ్వం అది. తుడిచిపెడితే పోయేదా?విడిచి పెడితే పోయేదా? అంతెందుకు , గురజాడ మన అందరివాడే.గిరీశమూ అందరివాడే. మిస్సమ్మ అందరిదే. మా వయ్యారి పాట అందరిదే.  ఆ కథానాయకుడు నాయిక ఆ పక్కనే ఉన్న అమాయిక.. వారందరినీ సృజించిన అనేకానేక మంది కళాప్రతిభ అందరిదే. నిజమే కదా, అందములు మన అందరి ఆనందానికే గా! ఆగండి మన కథానాయకుడు కనుబొమలెగరేస్తూ గడ్డం నొక్కు లోంచి ఓ చిన్ని సవాలు విసురుతున్నాడు నాయిక వైపు..ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడండి. “గొవిందుడు అందరివాడేలే . ఎందుకు రాధా ఈసునసూయలు …?” అంటూ. ఆ కాలం కాబట్టి ఆ నాయిక నొసలు చిట్లించి వూరుకుంది కానీ, ఈ కాలాన టపీమని అనేది కాదు..” “ ఆ లెక్కన రాధ  అందరిదేగా…!”  ఆ ఫళాన ఢామ్మని శబ్దం  మన పాలు ! కదండీ. నిజమే . ఆ కళాకారుడు ఆలోచనాపరుడు నాయకుడు  …కర్త కర్మ క్రియాశీలి …. పురుషుడు కాకుండా స్త్రీ అయినపుడు  మనం , ఆమె ఆలోచనా ,కళ ,ప్రతిభ, ప్రతిష్ట అన్నీ  అందరివీ ..మనం ఆమెను ఒక అపురూపసృజన గా  ప్రత్యేక వ్యక్తిగా స్వీకరించగలమా? ..ఈసునసూయలు లేకుండా ..  ఆదరించగలమా? ఆమె స్వయం ప్రతిపత్తిని గౌరవించగలమా? ఆమె ను ఆమెగా స్వీకరించగలమా? ఆగండాగండి. ‘ఆపండాపండి…ఆమె దేంటండీ పేద్ద గొప్ప! ఆమె అలా ఉన్నదంటే  , ఆమె భర్త ఎంత భరాయించి ఉంటాడు ?ఎంత నిభాయించి… Read More "బృందావనమది అందరిదీ"

నిశ్చయముగ నిర్భయముగ 1

మా ఇంటి పుస్తకాల అరలో శ్రీశ్రీ గారు, చలం గారు లేరని నేను గ్రహించేటప్పటికే, నేను  సాహిత్య విద్యార్ధిని. అందులోను ఆంగ్లసాహిత్యం. కొద్దిపాటి రచనలు కూడా అచ్చయ్యాయి  “ఏమిటీ ? మహాప్రస్థానం” చదవకుండా కథలు రాసేస్తున్నారా? అందులోని ప్రతి అక్షరం నాకు కంఠోపాఠం!” అంటూ అత్మీయ సాహితీ మిత్రులొకరు కళ్ళర్రజేసి, ఆశ్చర్యపోయి ,ఆ పై జాలి కురిపించారు. ఆ పై , మెత్తగా హెచ్చరిక చేశారు. దడ పుట్టి బిక్కచచ్చి , వారి ఎదుటినుచి మాయమయ్యా. సరిగ్గా,… Read More నిశ్చయముగ నిర్భయముగ 1

నిశ్చయముగ నిర్భయముగ

పాలమూరులో మేము … పనిగట్టుకొని ఎవరో నియమం ఏర్పరిచినట్లుగా, క్రమం తప్పకుండా, ప్రతి ఆదివారం … ఉదయం కుంకుళ్ళతలంటు , మధ్యాహ్నం మంచి మసాలాభోజనం, ఆపై మ్యాట్నీ షో కు ప్రస్థానం. అప్పుడు నాకు పదకొండేళ్ళు.మా చెల్లెలు ,కమల , నాకన్నా ఏడాదిన్నర చిన్నది. సినిమా టిక్కెట్లు…బారానా(ముప్పావలా), రూపాయి ,రూపాయిన్నర.  అమ్మ తలా రూపాయి ,మరో పదిపైసలు బటాణీలో పుట్నాలో కొనుక్కోమని ఇచ్చి పంపేది.  మేము పరమబుద్ధి మంతుల్లా బారానా టిక్కెట్టు కొనుక్కొని ,మిగిలిన డబ్బుల్తో గోళీ… Read More నిశ్చయముగ నిర్భయముగ