"బృందావనమది అందరిదీ"

బృందావనమది అందరిదీ అన్న పాటంటే ఎందుకో గానీ,
నాకు భలే నచ్చుతుంది.
నిజమే కదా 
అందములు అందరి ఆనందానికే కదా.
అందుకేనా?
 నాయకుడు తన నాయికను అందంగా ఆటపాట్టించాడే అనుకుందాం.  సున్నిత మనోహర సన్నివేశం మిగిల్చిన , అపురూప దృశ్యకావ్యం మాట కూడా అటుంచండి.
మన ముందున్నవి, బృందావనమూ, అందములు, ఆనందములు ..మాత్రమే నన్న మాట!
అదాటున  వాన కురిస్తే..అల్లంతలో  హరివిల్లు విరిస్తే ,  అందాన్ని చూసి పరవశించి పోని వాళ్ళం ఎవరం ఉంటాం చెప్పండి?
తా చూసిందే అందమని పెద్దలెప్పుడో వ్రాక్కుచ్చారు కదా? మరి వారి మాట కూడా  చెవిన వెయ్యాల్సిందే!
 నేపథ్యంలో , బృందావనం అందరిది ఎలా అయిపోతుందబ్బా? అని  కంత్రి @ మంత్రి వ్యవహారాలు పతాకశీర్షికల్లో చూసి ముక్కున వేలేసుకోకుండా ఉండలేని కదా  మీబోటి నాబోటి వారం !
నిజమే నండి మరి  కాలంలో కాబట్టి బృందావనం  అందరిదై పోయింది కానీ ,  కంత్రుల మంత్రుల తంత్రుల కాలంలో అయితేనా ..?!?
చూశారా కాలమహిమ అంటే ఇదే
ఒక అందమైన పాట గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ  కూడాఎలా భూగోల లోకి 
బొక్క బోర్లా పడి పోతామో 
కదా?
అదలా ఉంచుదాం.
బృందావనం అందరిదే.
కళ అందరిదే.
శాస్త్రమూ అందరిదే.
ఒకసారి  పాటనే పలకరిద్దాం.
దాదుపుగా యభై ఏళ్ళ పైగా మనం అంతో ఇంతో ఎంతోకొంత   పాటపై మన భావోద్వేగాల పెట్టుబడిని పెట్టేసాం. ఆలోచన అనుభూతి మనతో పాటు స్థిరపడుతూ ధృవపడుతూ ధృఢపడుతూ  వస్తూ ఉన్నది .ఏళ్ళ తరబడి
రాగా రాగా   రాగము దానితో ముడిపడిన అనురాగమూ..మనలో భాగమై పోలేదు.
మన సామూహిక భావనలతో స్పందనలతో  నిర్మించుకొంటూ వచ్చిన అందమైన పార్శ్వం అది.
తుడిచిపెడితే పోయేదా?విడిచి పెడితే పోయేదా?
అంతెందుకు ,
గురజాడ మన అందరివాడే.గిరీశమూ అందరివాడే.
మిస్సమ్మ అందరిదే. మా వయ్యారి పాట అందరిదే  కథానాయకుడు నాయిక  పక్కనే ఉన్న అమాయిక.. వారందరినీ సృజించిన అనేకానేక మంది కళాప్రతిభ అందరిదే.
నిజమే కదా, అందములు మన అందరి ఆనందానికే గా!
ఆగండి మన కథానాయకుడు కనుబొమలెగరేస్తూ గడ్డం నొక్కు లోంచి  చిన్ని సవాలు విసురుతున్నాడు నాయిక వైపు..ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడండి.
గొవిందుడు అందరివాడేలే . ఎందుకు రాధా ఈసునసూయలు …?”
అంటూ.  కాలం కాబట్టి  నాయిక నొసలు చిట్లించి వూరుకుంది కానీ,  కాలాన టపీమని అనేది కాదు..”
  లెక్కన రాధ  అందరిదేగా…!”
  ఫళాన ఢామ్మని శబ్దం  మన పాలు !
కదండీ.
నిజమే .
 కళాకారుడు ఆలోచనాపరుడు నాయకుడు  కర్త కర్మ క్రియాశీలి …. పురుషుడు కాకుండా స్త్రీ అయినపుడు  మనం , ఆమె ఆలోచనా ,కళ ,ప్రతిభ, ప్రతిష్ట అన్నీ  అందరివీ ..మనం ఆమెను ఒక అపురూపసృజన గా  ప్రత్యేక వ్యక్తిగా స్వీకరించగలమా? ..ఈసునసూయలు లేకుండా ..  ఆదరించగలమా?
ఆమె స్వయం ప్రతిపత్తిని గౌరవించగలమా?
ఆమె ను ఆమెగా స్వీకరించగలమా?
ఆగండాగండి.
‘ఆపండాపండిఆమె దేంటండీ పేద్ద గొప్ప! ఆమె అలా ఉన్నదంటే  , ఆమె భర్త ఎంత భరాయించి ఉంటాడు ?ఎంత నిభాయించి ఉంటాడు? ఎంత నిబ్బరించి ఉంటాడు?
అందుకే  ఆమె అతనిది మాత్రమే  అవుతుంది!అంతకు మించి ఆలోచించడం తప్పు కదండీఏ లెక్కన చూసినా ,ఆమె భర్తనే , గోప్ఫ!”
 లోలోనుంచి ఎక్కడో పొడుచుకొచ్చేస్తోన్నవి.. పోటానుపోటీగా .
బహుశా అవేనేమో ఈసునసూయలంటే !
ఈసునసూయలు కూడా సామూహిక భావనలే ,
అప్పుడప్పుడూ!
 లెక్కన !
 ***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “"బృందావనమది అందరిదీ"

  1. I agree that literature,music, films etc are part of the politics; in particular gender politics. But there are songs like
    “కొమ్ములు తిరిగిన మగవాళ్ళూ మా కొంగు తగిలితే పోలేరూ”
    and sayings like
    “పండగనాడు కూడా పాత మొగుడేనా”

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s