ఏమని చెప్పేది నేను!

“అక్కా , ఆవిడెవరో చెప్పండి.ఆమెకు  చాలా అన్యాయం జరిగింది .దారుణం. ఆవిడతో  వెంటనే మాట్లాడాలి.అందరితో మాట్లాడించాలి” జర్న్లలిస్ట్ తమ్ముడొకరు ఉద్వేగంతో ఫోన్ చేశారు. “ఉద్యోగమో రామచంద్రా ..!” చదివి. ఏమని చెప్పాలి నేను? “ఆవిడెవరో చెప్పదలుచుకొంటే నేనే చెప్పేదాన్నిగా ..”అన్నాను.“ఒక సారి మాట్లాడాలి. మా పత్రికలో వారి ఇంటర్వ్యూ వేయాలి. పలువురికి తెలియ జేయాలి..” తమ్ముడు అంటూ ఉన్నాడు.సున్నితంగా స్పందించగలిగిన వారు ఒక ప్రముఖ దినపత్రిక లో స్త్రీల పేజీలో పని చేస్తూ ఉండడం .. వారిని మరింత… Read More ఏమని చెప్పేది నేను!

ఉద్యోగమో రామచంద్రా…!

తుమ్మితే ఊడే ముక్కూ.. ఉత్తినే ఊడే ఉద్యోగమూ .. ఒకటేనూ…! ఉండినా ఊడినా … జీవితాంతం చేసిన పని ఒట్టిదై పోతుందా? ఒద్దన్న  కాదన్నా… జీవితకాలపు శ్రామిక బంధాలు ఇట్టే తేలిపోతాయా?  అయినా , ఉద్యోగం మీద …అందునా ఒట్టొట్టి ఉద్యోగం మీద .. గట్టి  భ్రమలు   పెంచుకొనే వాజమ్మలూ జేజెమ్మలూ..ఉన్నారంటారా ..ఈ రోజుల్లోనూ! సరే, మీకొకరిని పరిచయం చేస్తాను. ఒక ఊళ్ళో ఒక తపాలా ఉద్యోగి ఉన్నారట. ఎండైనా వానైనా  ఒక నిష్టతో ఒక ఇష్టంతో తపాలపనులు చేసేవాడట. ఉద్యోగమన్నాక  ఏదో ఒక రోజున విరమించాల్సిందే కదా. ఇక, ఉద్యోగవిరమణ జరిగిన రోజున ఊరు వాడా కదిలొచ్చి , కన్నీటి వీడ్కోలు చెప్పారట.వారి అభిమానంలో మునకలేస్తున్న ఆ పెద్దమనిషి , గుండె చెరువై పోయిందిట. బావుంది. ఆ మర్నాడు ఉదయానికి కానీ , అతనికి ఉద్యోగ విరమణ అంటే ఏంటో స్పృహలోకి రాలేదు. ఇన్నాళ్ళూ ఉద్యోగమే అతని జీవితం. ఊపిరి. ఉద్యోగంలో అతను పెట్టిన పెట్టుబడి అతని ఉద్వేగమే. అతని కలలు , ఆశలు , ఆశయాలు.. శక్తి సామర్ధ్యాలు …అన్నీ అన్నీ అక్కడే ధార పోశాడు. ఎంతో ఇష్టంగా. తనదిగా.  ఆ ఉద్యోగమే తనుగా. మీకు తెలిసిపోయింది కదా? ఆ తపాలా చిరుద్యోగి టాల్ స్టాయ్ గారి  కథానాయకుడు. కథల్లో ఇలాంటి కమానిషులు బోల్డుంటాయి ! అని తేల్చి పారేస్తారేమో మీరు. ఆగండాగండి. సరిగ్గా ,అలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. ఆమె పాతికేళ్ళ క్రితం, నగరం నుంచి పట్టణానికి వలస వచ్చింది. కొత్త కోడలిగా. చేయడానికి చిన్ని చిన్ని ఆలోచనలతో పాటు కొద్దిపాటి ఆవేశంతో ఉండేది. వంటావార్పు, ఇంటిపనులు,సరుకుల కొనుగోళ్ళు, బట్టలు ఉతుక్కోవడాలు,అంట్లు తోముకోవడాలు వగైరాలన్నీ ,పూర్తయినా బోలెడంత సమయం మిగిలేది. ఇక, వాకిట్లో పూలు పూయిస్తూ పూయిస్తూ,  ఆ గోడకవతల ,సోడాలమ్మే  పట్టుమని జానాబెత్తెడు లేని కిట్టు చులాగ్గా చేస్తోన్నబేరసారాలు , నోటిలెక్కలు  చూసి పలకరిచింది. సోడాలు కొడుతూ  కొడుతూ లెక్కలు ఎక్కాలతో పాటు అక్షరాలు వంటబట్టించేసింది అతనికి. ఒకడు ఇద్దరై ..ఇద్దరు ముగ్గురై… Read More ఉద్యోగమో రామచంద్రా…!

So work,work,work !

వర్క్ అంటే “బర్డన్ ” అనుకొనే వారికి అంకితం.. 🙂పని మానేస్తే హాయిగా ఉండొచ్చు ననుకొనే వారికీను … :-))  *** కేర్ ఆసుపత్రి కారిడార్లో  ఈ మధ్యన దిగాలుగా నడుస్తూ ఉంటే ,  ఈసురోమంటూ మనుషులుంటె ఎలాగంటూ వాక్యాల వెనక నుంచి  స్వయాన గురజాడగారు పలకరించారు.నాలుగడుగులు వేయగానే, ఇగ్బాల్ గారు… కాస్త ముందుకెళ్ళ గానే రవీంద్రుడు… ఆ పైన కనబడ్డాయి .ఇక్కడ వ్రాసిన కొన్ని వాక్యాలు.ఇలా, ప్రముఖ హృదయనిపుణులు డా.కుమార్ గారు స్వయం గా సేకరించి, … Read More So work,work,work !

వాళ్ళు …వీళ్ళు …పారిజాతాలు !

నమస్తే,  ఇలా మొదలైన పారిజాతాల కథ ఎలా సాగిందో మీరే స్వయంగా చదివి చూడండి. తీరిక దొరికినప్పుడు.  ఈ నెల చతుర నవల ,  నాదో చిన్న ప్రయత్నం,  విషయ సేకరణలో సహకరించిన పాలన గారికి పాణిని గారికి ధన్యవాదాలు. స్నేహంతో , చంద్ర లత       వాళ్ళు వీళ్ళు పారిజాతాలు  *  నవల  *         చంద్ర లత *** వాళ్ళు విరిసీ విరియని ఉదయం. తూరుపు తీరం.   ఎదిగీ ఎదగని పట్టణం. ఎనభై దశకం ముడుచుకొనే వేళ.  తొంభైలలోకి విచ్చుకొనే తరుణం.… Read More వాళ్ళు …వీళ్ళు …పారిజాతాలు !