So work,work,work !

వర్క్ అంటే “బర్డన్ ” అనుకొనే వారికి అంకితం.. 🙂
పని మానేస్తే హాయిగా ఉండొచ్చు ననుకొనే వారికీను … :-))

 ***

కేర్ ఆసుపత్రి కారిడార్లో  ఈ మధ్యన దిగాలుగా నడుస్తూ ఉంటే ,  ఈసురోమంటూ మనుషులుంటె ఎలాగంటూ వాక్యాల వెనక నుంచి  స్వయాన గురజాడగారు పలకరించారు.
నాలుగడుగులు వేయగానే, ఇగ్బాల్ గారు… కాస్త ముందుకెళ్ళ గానే రవీంద్రుడు… ఆ పైన కనబడ్డాయి .ఇక్కడ వ్రాసిన కొన్ని వాక్యాలు.
ఇలా, ప్రముఖ హృదయనిపుణులు డా.కుమార్ గారు స్వయం గా సేకరించి,  ,
గోడలపై అలకరించి, మంచి మాటలతో దిగులు గుండెల్లో ధైర్యం నింపారన్న మాట.అన్నట్లు , కుమార్ గారి  గది గుమ్మంలో స్వయాన శ్రీ శ్రీ గారి చేతి రాతలో మరో ప్రపంచం పలకరించింది..
డా.కుమార్ గారిని కి సవినయ నమస్కారాలతో .. ఆ గోడ మీది వాక్యాలు మీ కోసం .
***

Work

God created  man to work.
Work is man’s greatest duty.

Man is nothing ,
He can do nothing ,
Achieve nothing ,fulfill nothing without working .
Work is man’s most dependable function .

If you are poor- work.
If you are rich -work.

If failure discourages you- work.

If success encourages you – work.

You have been awarded with unfair responsibilities -work.
You have been entrusted with deserving responsibilities -work.

You have not been paid fairly- work.
You have been paid handsomely -work.

When dreams shattered -work.

When faith falters -work.

When future appears bleak -work.
When hope seems dead -work.

Work is the greatest stress -buster.
Work is the mightiest morale -booster.

Work is the best boredom beater.
Work is equally effective disease fighter.

If you neglect your work ,

you invite worry, fear, doubt and debt.
Work is the greatest solution for all problems.

So work,work,work ,
And work sincerely!

CARE Hospital ,Nampally ,Hyderabad.
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

3 thoughts on “So work,work,work !

 1. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా – కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
  ఇట్లు నిర్వాహకులు

  మెచ్చుకోండి

 2. అక్కా,

  work కి మనం మరీ అంత గౌరవం ఇవ్వాలా ?
  కవులే ఇలా మాట్లాడుతూ వెళితే, ఇక work పని పట్టేది ఎవరు ?

  నేను ప్రతి రోజు delhi metro లో ప్రయానిస్తాను. అందరు ఏదో ఒక కంపెనీలో worker లే . కానీ, ఒక్క పిల్లల్లో తప్ప, మిగిలిన వారి ముఖలంతా నిర్జీవంగా ఉంటాయి. ఢిల్లీలో అంతేలే అని కొట్టిపారెచ్చేమో ! హైదరాబాద్లోనూ అంతే ! చెన్నైలోను అంతే ! మా మదనపల్లెలోను అంతే ! worker లందరూ శవాల్లాగా ఒక చోటి నుండి మరోచోటికి వెళుతుంటారు. మనల్ని ఇలా తయారుచేస్తోంది work కాక మరేమేటి ? ఒక సారి ఆలోచించండి. అందరూ పని మానేసి కూర్చోవాలని నేను అనట్లేదు ! కానీ వర్కే మన జీవితమైపోతే, ఇక మిగిలిన వాటికి – కవిత్వానికి, సౌందర్యానికి, నవ్వడానికి, ఊరికే అలా చెట్టు కింద కూర్చోవడానికి – చోటేది ?

  pradeep

  మెచ్చుకోండి

 3. సోదరులు ప్రదీప్,
  బావున్నారా?
  పనిగట్టుకొని పని మానుకొని కూర్చునే ప్రబుద్ధులను దృష్టిలో ఉంచుకొని రాసినవనుకొంటాను ఆ వాక్యాలు.
  అందునా ,అది ఒక గుండెవ్యాధి నిపుణుల ఎంపిక.డా.సోమరాజు గారికి స్పూర్తినిచ్చిన వాక్యాలని డా.కుమార్ గారు చెప్పారు. వారిరువురి అపారమైన అనుభవాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి కదా?
  అనేక హృద్రోగాలకు ,మానసిక వత్తిళ్ళకు,మీరన్నట్లుగా మానవ శ్రామిక ప్రకృతికి ప్రవృత్తికి దూరమైన ఈనాటి జీవన శైలి ప్రధానకారణమని గ్రహించాం కదా?
  అనేకులం శారీరక శ్రమతో పనిలేని పనుల్లో మునిగిఉన్నాం కదా?

  ఆ సంధర్భాన్ని అర్ధం చేసుకొంటే ,ఆ వాక్యాల నేపధ్యం అర్ధం అవుతుంది.

  పగలురేయి భేదం లేకుండా పేకాటో మరో జూదం లోనో మునిగి తేలే వారినీ పనిమంతులే అని మనం భావించలేం కదా?
  అలాగని,Wrokholick లు గా అవ్వమని ఆ వాక్యాలు భోధిస్తున్నట్లుగా తోచడం లేదు కదా?
  మహాకవి ప్రస్తావించిన “శ్రమైక జీవన సౌందర్యాన్ని” ,శ్రామిక గౌరవాన్ని .. సజావుగా సమాజహితం గా సాగవలిసిన శారీరిక మానసిక శ్రమసంకల్పాన్ని ..ఉద్దేశించినవనుకొంటాను.

  మనం పని చేయక పోతే ఆ పని మరొకరు చేయవలసి వస్తుంది. పని పట్లనే ఏ గౌరవం లేనప్పుడు ఆ “పని మనుషుల” మీద ఎలాంటి అవగాహన ఉంటుందంటారు?
  శ్రామిక సమయాలు,పనివిభజన,శ్రామికదోపిడీ,కార్మిక హక్కులు,… ఇవన్నీ ఆలోచించవలసిన అత్యవసర సంధర్భాలవుతాయి.శ్రమకు తగ్గ ఫలితం దక్కనప్పుడు కలిగే నిరాశానిస్పృహలు, తనకు మించి శ్రమ చేవలసిన అవసరం ,అది మిగిల్చే నీరసం ..నచ్చని పని చేయవలసినపాటి దుఖఃo ,కలిగే కోపం.. వీటన్నిటికీ ,”పని” మానుకోవడమే ప్రత్యామ్నాయం కాదనే మీకు తెలుసు. ఎవరికి నచ్చిన పనే వారు చేయాలని ఆశిస్తాం.
  కాగా, 'నా నృషినా కురుంతే కావ్యం' అన్నారు కదా పెద్దలు.
  వ్యక్తి,కుటుంబం,సమాజం,విశ్వం.. వాటి నడుమన అంతర్లీనంగా గల శ్రామికసంబంధాన్ని గుర్తించి…గౌరవించి,
  అందులో మనం చేయదగ్గ పనేమిటో …చేయవల్సిన పనేమిటో గ్రహించుకుని ..
  మన పని మనం నిజాయితీగా చేసుకుపోవడమే,
  మన పని!
  శుభాకాంక్షాలతో .. అక్క

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s