షోరాపూర్ కీ రాణీ

బహుశా ఆమె  తన ఏడేళ్ళ బిడ్డను పరాధీనం కాకుండా చేసి ఉంటే ,మరో ఝాన్సి కీ రాణి అయి ఉండేదేమో.. బహుశా అతను పట్టుబడకుండా ఉంటే ,మరో తాంతియా తోపే అయి ఉండే వాడేమో.. అతనిలోకి దూసుకుపోయిన ఆ తూటా , యాదృచ్చికం కాదేమో…. జాతకాలు, మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలు…ఆనాటి  అరాచకప్రభుతలో ..పరప్రభుస్వామ్యాలకు రాచబాట వేసాయేమో….’ మీరే  స్వయం గా చదివి చూడ మనవి. http://pustakam.net/?p=7990***ఒక్కోసారి ఊహిస్తే వింతగా తోస్తుంది.ఏడాది పొడవునా ఎండ. చెమట.వేడిమి.ఉడక.ఉక్కబోత.చిరచిర.గరగర.అలాంటి ఈ ట్రంక్ రోడ్డు మీద ఆ దేశంకాని దేశం నుంచి వచ్చిన వాళ్ళు,ఎర్రటి అంగీలు… Read More షోరాపూర్ కీ రాణీ

కుట్టనా…కుట్టనా…?!?

మొన్న పంద్రాగష్టున అన్ని ఛానెళ్ళతో పాటు ఓ జాతీయ ఛానెల్  వారు, పిల్లలకు జాతీయ గీతాల పోటీలు పెట్టారు. ముద్దుముద్దుగా ముచ్చటగా వాళ్ళు పాడేసారు. మనమేమో వినేసాం.,సారీ, చూసేసాం. అక్కడికి నేను మాత్రం  తక్కువ తిన్నానేంటి? రిమోట్ సవరించి  టకటకా బటన్లపై సరిగమలు నొక్కుతూ పోయా.. ఇక్కడో పాట అక్కడో ఆట ..ఇక్కడో కవాతు అక్కడో కత్రినా..మధ్యలో ఎక్కడి నుంచి  వచ్చాడబ్బా … ఈ బోసి నవ్వుల తాతాజీ! అదేనండి మరి నేను చెప్ప బోయేది.. మన అన్నాజీ గురించి.అది… Read More కుట్టనా…కుట్టనా…?!?

తమరూ తామరలూ

ఒక్క సారి ఊహించండి.మన భాగ్యనగరం లో…అందునా బేగం పేటలో …ఒక చిన్న నీటి కొలను ..అది తేట నీరుదే అనుకుందాం.అందులో అపుడే పూసిన తామర పూవు.అవునండి. అదే …మన లచ్చిందేవమ్మ చక్కగా సింగారించుకొని  బాసింపట్ట వేసుక్కూచుంటుందే …అచ్చంగా అదే రంగు తామర పూవు పూసిందనుకోండి.పూసీ పూయగానే చూసి ఊరుకొనే వారెవరు చెప్మా! ‘అని తరువాత హాశ్చిర్య పోదురు గానీ, ముందు నా మాటినండీ తమరు ..ఆ కొలను లోని తామర పూవును కొనగోట కోసి..ఛ .. ఇది… Read More తమరూ తామరలూ

అదే “మో” , కానీ …

అదేమో ???అదే…“మో” !!!*** మహీధర “కొల్లాయిగట్టితేనేమి ?http://ukcatalogue.oup.com/product/9780198077374.do  ” మో ఆంగ్లీకరణతో మన ముందుకు వచ్చే  రోజు దగ్గరలో నే ఉందని భావిస్తూ , ఈ లోగా, వారి అనువాద శైలిని మీరు ఆస్వాదించండి . http://pustakam.net/?p=7872  మో గారికి గౌరవంతో .అభిమానం తో.వారీ అనువాదాన్ని  ఏనాటికీ అచ్చులో చూడలేరు కదా …అన్న దుఃఖం తో.*** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

పని… మర్యాద…అతను !

నాలుగునాళ్ళ నాటి మాట.పెద్దా చిన్నా చితక  సామాను తో సహా , అలా  రైలు  దిగాలని నిలబడ్డానో లేదో ,  పిలవకనే …ఇలా ప్రత్యక్షమయి సామాను ను చనువుగా అందుకొని ప్లాట్ ఫాం మీద పెట్టేసి , కులాసాగా నిలబడి.. ఆ పై, అమాంతంగా నెత్తికెక్కించు కోబోయాడొకతను . “అయ్యా బాబూ కాస్తాగు..” అని  అతను అడిగిన దానికి నేను ఇద్దామనుకొన్న దానికి సరితూగడంతో .. అలాగే లెమ్మనుకొన్నా. సరే, చిన్నా చితక సామాను నేనే పట్టుకొని, ఒక పెద్ద చక్రాల బ్యాగును మరొక సూట్ కేసు అతనికి చూపించాను. మా వూరి కొత్త ప్లాట్ ఫాం చక్రాల… Read More పని… మర్యాద…అతను !