గ్లోబలైపోయామోచ్…!

అననగనగా ఒక కథంట!కురవకోటలో పుట్టిందంట.బోడికొండెక్కిందంట.అమెజాన్ నదిని  తాకిందంట. తెట్టుకు చేరిందంట.సారీ..సారీ … జంప్ చేసిందంట..:-)ఆ వైనమేమిటో… కాస్త చూద్దురూ..! గ్లోబలైపోతన్నమో…అని అందరూ అంటంటే ఏంటో అనుకున్నా.. ఇదే కాబోలు సుమీ…:-) http://prabhavabooks.blogspot.com/ కొండెక్కాక ..!గ్లోబలైపోయామోచ్…! 

అక్షరాలా అరవైఅయిదవ కళ !

అన్నీ అమ్మఒడిలోనే మొదలవుతాయిట!కావాలంటే చూడండి.చిట్టిచిలకమ్మని కొట్టిందెవరు ?అమ్మే కదా?చిన్నారి పొన్నారి కిట్టయ్యను  కొట్టిందెవరు?ఇంకెవరూ..అమ్మే!పైనుంచి, “అమ్మా మన్ను తినంగ నేను పసిపిల్లాణ్ణా  వెర్రికుంకనా” ..అని తిరిగి సమాధానం ..చెపితే..ఆ యశోదమ్మ కాబట్టి . .. ఆ చిట్టినోట్లో పద్నాలుగు భువన భాండాలు చూసి మురిసి పోయింది .కానీ,మన బోటి అమ్మలం నాన్నలం, ఆ ఫళంగా నాలుగు అంటించి ,డెట్టాల్ తో నోరు  శుభ్రంగా కడిగి,బుజ్జాణ్ణి భుజాన వేసుకొని, పరుగుపరుగున డాక్టరయ్య దగ్గరకో డాక్టరమ్మ దగ్గరికో వెళ్ళి , పిల్లాడి పిర్రకి ..ఓ… Read More అక్షరాలా అరవైఅయిదవ కళ !

శ్రీశ్రీ మరమరాల మూట

ఒక మారు శ్రీశ్రీ గారితో పాటు ప్రయాణంలో ఉన్నారట. శ్రీశ్రీ గారికి వెంటనే రాయాలనిపించిందట. దగ్గరలో కాగితం ముక్క ఏదీ లేదు. జేబులోంచి అగ్గెపెట్టె తీసి …ఇలాంటి శ్రీశ్రీ మరమరాల మూట ను విప్పి చూడాలంటే ,మీరు ప్రభవలోకి తొంగి చూడాల్సిందే నండి! http://prabhavabooks.blogspot.com/  All rights @ writer. Title,labels, postings and related copyright reserved.