అక్షరాలా అరవైఅయిదవ కళ !

అన్నీ అమ్మఒడిలోనే మొదలవుతాయిట!
కావాలంటే చూడండి.
చిట్టిచిలకమ్మని కొట్టిందెవరు ?
అమ్మే కదా?
చిన్నారి పొన్నారి కిట్టయ్యను  కొట్టిందెవరు?
ఇంకెవరూ..అమ్మే!
పైనుంచి, “అమ్మా మన్ను తినంగ నేను పసిపిల్లాణ్ణా  వెర్రికుంకనా” ..అని తిరిగి సమాధానం ..చెపితే..
ఆ యశోదమ్మ కాబట్టి . .. ఆ చిట్టినోట్లో పద్నాలుగు భువన భాండాలు చూసి మురిసి పోయింది .
కానీ,
మన బోటి అమ్మలం నాన్నలం, ఆ ఫళంగా నాలుగు అంటించి ,డెట్టాల్ తో నోరు  శుభ్రంగా కడిగి,బుజ్జాణ్ణి భుజాన వేసుకొని, పరుగుపరుగున డాక్టరయ్య దగ్గరకో డాక్టరమ్మ దగ్గరికో వెళ్ళి , పిల్లాడి పిర్రకి ..ఓ TT సూది సురుక్కున పొడిపించేద్దేము.
హన్నా !!!

‘నిజమండీ.. పిల్లలా అల్లరి పిడుగులా.. అప్పుడప్పుడు ..ఒకటో రెండో ఇచ్చుకోక పోతే ఎలా’ , అంటారా?

ఆగండి, మనూళ్ళో అన్నీ చెల్లుతాయి.
అదే , మనాళ్ళే మన పొలిమెరలు దాటారను కోండి, అదే పిల్లలు కళ్ళేర్ర జేసి.. “ఛైల్డ్ అబ్యూజ్ !” అని కెవ్వున ఓ కేకేస్తే చాలుట.. ఆ సూది మందేదో అమ్మానాన్నలకు పొడిచి పంపుతారాట..ఆయా దేశాలవాళ్ళు.
మరి, అలాంటి దేశాల్లో  పిల్లలు పిడుగుల్లా తయారవమంటే అవరూ మరి.
మామూలు పిడుగులు కారు చిచ్చర పిడుగులు!
ఆయా పిల్లల అమ్మానాన్నల సంగతి అటుంచి, పంతుళ్ళపంతులమ్మ ల సంగతి ఏంటో … పాపం…ఎవరైనా బడిపంతుళ్ళుంటే కాస్త చెప్పండమ్మా..అయ్యా.. విని పెడతాం.

అదలా ఉంచండి. మనూళ్ళో ,మన ఇళ్లల్లో, మన బళ్ళల్లో, మనమెంత సృజనాత్మకంగా పిల్లలకు మంచీసెబ్బర నేర్పుతున్నామో .. మీకు తెలుసుకదా.
 ఆ మాటకొస్తే మనం మాత్రం తక్కువ తిన్నామేంటి,నలుగురికీ తెలిసేట్టు కొడతామా?
పిల్లల్ని కొట్టడం అన్నది అక్షరాలా అరవైఅయిదవ కళ!

అదెలాగంటారా …?

చదవండి.. ఈ చిన్న రచనను ..పావని మాటల్లో..!

Little Boy “Teddified” !
http://prabhavabooks.blogspot.com/
అన్నట్లు ..
ఇది పావని ప్రయత్నించిన మొదటి రచన.. మీ సలహాలకోసం.

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

3 thoughts on “అక్షరాలా అరవైఅయిదవ కళ !

 1. పిల్లవాడు పట్టుమని మూడన్నరేళ్ళయినా లేని పసివాడు.
  అప్పుడే బడికి పంపడమే..
  ఆలోచించ వలసిన విషయం.

  పంపితిమిపో..
  బలవంతంగా బడి దుస్తులు తొడగడం ..
  మరికొంత ఆలోచించ వలసిన విషయం.

  తొడిగితిమిపో…
  పిల్లవాడికి బడి పద్దతులను అలవాటు చేయడం ..
  మరీ మరీ ఆలోచించాల్సిన విషయం.

  అసలు సంగతి ఏమంటే,
  పిల్లల మారాం ..తల్లుల గారాం రెండూ సహజమైనా..
  పిల్లలకు పద్దతులు గట్రా నేర్ప వలసిన బడివాళ్ళు.. ఆ వయసు పిల్లల మనసు తెలుసుకొని మెసలవద్దూ?
  ఎందుకంటే, బాలల మనస్తత్వం గట్రా లన్నీ ,నేర్చుకొన్న వాళ్ళు.నిత్యం అనేక మంది ,అదే వయసు పిల్లలతో మెసల వలసిన వాళ్ళు, ఆయా వయసుల పిల్లల బట్టి , బుద్ధీశుద్ధీ నేర్పవలసిన వాళ్ళు…అప్పుడప్పుడే బడి గడప తొక్కిన
  ఒక మూడేళ్ళ పిల్లాడిని, బట్టలిప్పి 30 -40 మంది తోటి వారి ముందు ..బడి అయిపోయే దాకా ..నిలబెట్టడం కన్నా.. నాగరికమైన పద్దతి ఏదీ లేదంటారా?
  ఆ వ్యవహారమేదో .. బడివాళ్ళు అమ్మానాన్నలు తేల్చుకోవాలి.మధ్యలో పిల్లవాడిని ఇలా చేయడం ..అంత సమంజసం కాదుకదండీ?మానవీయమూ కాదు.
  ముందు, అమ్మనాన్నలకు వివరించి చెప్పాలి. అలాగే, “బడికి అలవాటు పడే క్రమం” సహజంగా సంతోషంగా..ఉండేట్టు అటు అమ్మానాన్నలు ఇటు బడి వారు..చూడాలి.కదండీ?
  లేకుంటే, అన్నప్రాసన రోజే ఆవకాయ నోట్లో కుక్కినట్టు..అవదూ?
  మీరే ఆలోచించండి.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s