" చేనేత వారం ! "

                        

అగ్గి పెట్టెలో  అమరిన ఆరు గజాల చీరలు నేసినమగ్గం మనది.  ఆ   మగ్గం పై విరిసిన పూలతరంగాలు, అందంగా కదలాడినహంసల బారులు, ఆనందంగా పురివిప్పి ఆడిన నెమళ్ళు  , విరగకాసిన మామిడిపిందెలు …    
ఒకటా రెండా ..వేలాదిఏళ్ళుగాఅన్నీ మనవే.
ఆ నూలు బట్టల మెత్తదనం, పట్టు వస్త్రాలమేళవం, జలతారుచీరల సోయగం, డాబుసరి పంచల ఆర్భాటం
ఎంతని చెప్పినా తనివితీరేనా? సొంపు  సొబగు   సోయగం    సౌందర్యం  … అన్నిటినీకలనేసిన హస్తకళా కౌశలం !
అదీ మన వారసత్వం.
పొత్తిళ్ళలో కళ్ళు తెరిచిన నాటినుంచి , అమ్మకుచ్చిళ్లలో దోబూచులాడం ,ఆమె కొంగు పట్టుకువేళ్ళడం, నాన్న పైపంచను వల్లెవాటు వేసుకొనివంటలు చేయడం, తలపాగా చుట్టిఉత్తిత్తి మీసాలు మెలేయడం
ఇలాంటివెన్నెన్నో మన  చిన్నతనపు జ్ఞాపకాలపేటికలో భద్రంగాఒదిగిన మధురక్షణాలు
స్వయంగా రాట్నం పై  వడికిననూలుతో నేసినకొల్లాయి గట్టిన బాపు చూపిన స్వతంత్రభావన , స్వాలంబన  ..ఉత్తేజమై..ఉవ్వెత్త్త్తున ముంచెత్తిన ఉద్యమతరంగమై
మనలను మన ఉనికిని గుర్తించేలాచేసింది. మన మూలాల్ని తడిమిచూపింది.మనకర్తవ్యాన్ని తట్టి లేపింది.
సామ్రాజ్య వాదానికి తెరదింపింది.. మన ఇంటింట తిరిగిన  రాట్నమే కదా ! లెక్కకు మిక్కిలితుపాకీ తూటాలను నిబ్బరంగా  నిశ్శబ్దంగా  నిలువరించిందీ ఆ నూలు కండెలే కదా ?

మరి , వారసత్వ  సిరిసంపదనుమన పిల్లలకుమనం అప్పజెప్పవద్దూ?
శ్రమైక జీవనసౌదర్యానికి జేజేలు పలకొద్దూ?
దిశగా ఒకచిన్న అడుగుమన ప్రభవ లో  ” చేనేత వారం ! “

మీరిప్పుడైనా మీ పిల్లలబట్టల అరలోకిచూడాలి  . 
మరి ,వాటిలో చేనేత వస్త్రాలు ఉన్నట్టేనా?
గ్లాస్కో జుబ్బా,పట్టుపావడా ,ఖాదీలాల్చీ,నూలుగౌను .. ఏదైనాకావచ్చు.
వారం పాటుమన పిల్లలతోపాటు మనమూ,   అమ్మానాన్నలం…ఉపాధ్యాయులం
చేనేతను ధరిద్దాం!    

బాపూజిని స్మరిద్దాం!       
***
Also,     “Handloom Week  !”                                                                                              

http://prabhavabooks.blogspot.in/

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

2 thoughts on “" చేనేత వారం ! "

  1. చేనేత బట్టలు ఉన్నంత హాయిగా ఇంకేవీ ఉండవు అనటంలో అతిశయోక్తి లేదు. మా రాజమహేంద్రవరంలో చేనేత బజార్ ఉంది. ఈ వారం ఇంకా ఎన్నో రకాలతో అందంగా ముస్తాబవుతుంది.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s