ఇంతింతై మేమింతై..

నిన్న కాక మొన్న
ఈ ఆలోచన తలపోసినట్టుంది.

ఇందాకెప్పుడో  ఈ మాట
మా గడప దాటినట్టుంది.

మొదటి వాక్యం రాసింది ..
తొలి  చిత్రం గీసిందీ..
ఇప్పుడిప్పుడే కదా అనిపిస్తోంది..

అప్పుడే మా బుజ్జి బడి ఏడాది బిడ్డయింది!

ఒక బిడ్డను పెంచి పెద్ద చేయను
ఊరంతా నడుం బిగించాలట!

ఇందరు బిడ్డల పెంపు ను సొంపును ..
అందరి ఆదరాభినాలతోనేగా ప్రభవింపజేసేది!

మా బుజ్జి బడి కి
మీ అందరికీ సాదర ఆహ్వానం.

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “ఇంతింతై మేమింతై..

  1. చంద్ర గారు,
    మీ “బడి” ని చూసి చాలా సంతోషం వేసింది. మరచిపోయిన మా బాల్యాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చారు. మట్టి బొమ్మలు చేయడం, మీరు చూపించిన పండగలు గతాన్ని తీసుకోని వచ్చి లోగిలిలో నిలబెట్టాయి. మీరు మాతో పంచుకొన్న ఫోటోలలో చూస్తే, మా బాల్యం మీరు ఈ పిల్లల కోసం మలచినంత అద్భుతం గా లేదని అనిపించింది. ఈ పిల్లలు ఎంతో అదృష్టవంతులు . వాళ్ల కోసం మీరున్నారు. వాళ్ళ తల్లి దండ్రులు ఎంతో పుణ్యం చేసుకొన్నారు. ఎంత ధనం ఉన్నా , మీరు అందించే అనుభూతులు అందుకోవటానికి అదృష్టం కావాలి.

    బుడి బుడి నడకలతో అలరిస్తున్న మీ బడి కి, బడి పిల్లలకూ ఇవే మా శుభా శీస్సులు.
    ఇంత చక్కటి బడి కి రూపకల్పన చేసి, ఎన్నో ఆశలను, అనుభవాలను సాకారం చేసు కొన్న మీకు, మీ పిల్లలకూ జే జే లు పలుకుతూ
    భవదీయుడు
    సునీల్ పూబోణి

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s