యథా ….తథా….

ఇష్టం లేనప్పుడు…నష్టం జరిగినప్పుడు …కష్టం కలిగినప్పుడు …మనం…మాములు మనుషులం…ఏమవుతున్నాం?కిట్టప్ప పంతులు ఏమంటున్నారంటే… “వెనుకటి కవులు పద్యపాదం పూర్తి కాకపోతే ఎలమిన్,ధరిణిన్,చూడన్ అనీ,యతి స్థానంలో అయితే దీవ్యత్ ,శుంభత్, స్ఫాయత్ వగైరాలు వాడుతూ ఉండేవారు.నేడు రాజకీయ నాయకులు సాంఘిక సమస్యలను పరిష్కరించలేక పోయినప్పుడు  ఆర్డినెన్సులు,అరెస్టులు,లాటీ చార్జీలు  ,నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు.రెండూ అసమర్దతనే వ్యక్తం చేస్తాయి.  కళాధర్మాన్ని బట్టి మొదటిదీ,జీవితధర్మాన్ని బట్టి రెండవది దూష్యం. విజ్ఞులకు రెండూ సహించరానివే.  అయితే రెండోది మరీ దుర్భరం.ఎందుకంటే ,మొదటిదాన్నుంచి తప్పించుకోవచ్చు. ఇష్టంలేనప్పుడు పుస్తకాన్ని విసిరిపుచ్చుకొని అవతల పారేస్తాము.… Read More యథా ….తథా….

మరి, దానినలా వంటరిగా వెలగనీ!

నిజానికి, ఈ పద్యం ముందో ఆ పాట ముందో సరిగ్గా గుర్తు లేదు కానీ,ఈ  పల్లె పిల్ల-పదాలు  మాత్రం తెలియకుండానే ..అవి నాలో ఒక భాగమై పోయాయి.ఎన్ని మార్లు నాలో నేను వల్లెవేసుకొన్నానో! మననం చేసుకున్నానో !ఒకానొక రోజున ,ఎప్పటిలాగానే పల్లెపిల్లలతో కలిసి , కథాకాలక్షేపం చేస్తున్నామా…పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో రూపం దాల్చేసారు.రామచిలుక,మందారం, మేఘం,కొండ ,సీతాకోక చిలుక ,లడ్డు..అంతే కాదు ఎలుక,పిల్లి, కాకి ,ఏనుగు .. ఆపైన ,మురుగు కాలువ, డప్పు, ముంత, చీపురు… ఇలా ఎవరికి తోచినట్లు వారు.ఒకబ్బాయి… Read More మరి, దానినలా వంటరిగా వెలగనీ!

అక్షర సాక్షిగా

ఇప్పుడే తెలిసింది.మాలతి గారు ఇక లేరని.నిన్న కాక మొన్ననే కదా వారు నాతో మాట్లాడిందీ.వారింటికి రమ్మని ఆహ్వనించిందీ.ఇంతలోనే ఇలాంటి వార్తా..? వెన్నెల చాటున ఆకుల మాటున ఒదొగొదిగిన మలతీ పరిమళాల లను మాటల గుప్పిట బిగించబోలేం కదా!“జగతి”నెరిగిన మాలతిచందుర్ గారి గురించి మాట్లాడబోతే , అది సాహసం కాదూ? కాలానికి కలానికీ  ఉన్న అవినాభవ అనుబంధాన్ని వారి పాఠక దృష్టి అవగతం చేసుకొన్నంతగా, వారి సృజనాత్మక సృష్టీ అంతర్లీనం చేసుకొన్నది. ఇది నిజంగా అద్బుతమైన సమన్వయం గా తోస్తుంది.ఒక పాఠకురాలు కావడం, అందునా,… Read More అక్షర సాక్షిగా

ప్రజా….రాజ్యం!

అనకూడదు కానీ…  అనగా అనగా… అన్నో ఇన్నో భావాలు .భావనలూ … మన ఆలోచనల్లోకి అట్టే ఇంకి పోతాయి. ఎంత సహజంగా ..ఎంత లోతుగా అంటే .. మనం వాటిని వేలెత్తి చూపడం  సంగతి అటుంచి , కళ్ళెత్తి చూడడం మానేస్తాం సుమా! ఇదుగోండి ,ఒక యువ రచయిత భావాలూ ఎలా ఉన్నాయో.. http://www.quora.com/Aakash-Pydi/Posts/Telangana-A-boon-granted-by-%E2%80%9CThe-Mother%E2%80%9D మనమూ బహుశా ఆ దారినే నడిచివెళ్ళుంటాం.ఆ అక్షరాల్ని చదివివుంటాం.మనకూ అనిపించే ఉండివుండొచ్చు.. అవునుస్మీ.. మనం మన ప్రజా స్వామ్య గణతంత్ర దేశ  గౌరవపౌరులమండోయ్ ..అనీ! అనిపించలేదూ?అయితే,… Read More ప్రజా….రాజ్యం!

ఒక్కరున్న నేమి?

మొన్నా మధ్యన, ఈ దారినే కదా వంటరిగా నడిచెళ్ళింది.మండుటెండ. ఒట్టి మేఘమైనా ఇటు సాగిందా?వడగాడ్పు ఈడ్చికొట్టింది కదా?గరిక పూచైనా కంటపడిందా?నెర్రెలుబారిన నేల . అర్రులు చాస్తున్న భూమి. అలా రోహిణి కార్తె ముగిసిందో లేదో ..మొదటి మెరుపు  మెరిసిందో లేదో…తొలి ఉరుము ఉరిమిందో లేదో .. ఏరువాక కారుమబ్బు సాగిందో లేదో.. పిడికిడు వడగళ్ళతో బాటు చిటి చిటి చినుకులు నాలుగు అలా నేలను పలకరించడం ఆలస్యం.భూమి బుర బురా పొంగినట్లు ..పుడమి  పులకరించినట్లు..కమ్మటి వాసలతో పాటు …… Read More ఒక్కరున్న నేమి?