సోలెడు సోలెడు ముచ్చాలిస్తా !

 ష్! మీకో రహస్యం చెప్పాలి! మా అమ్మాయిమణి తో ఎప్పుడైనాఅనబోయేరు! తినబోయే చోట మరీను! నిజమండీ! ఈ మధ్య మాఅమ్మాయిమణి ఆజమాయిషీ ఎక్కువైపోయింది ఎప్పుడెప్పుడు ఏమేమి తినాలి..ఎంతెంత తినాలి..  ఎప్పుడు తినాలి..అన్నీ వారిఆజ్ఞానుసారంగా జరగాలని ! కుంచమంత కూతురుంటే కంచంలోకూడు అంటారుకదా , మాకూతురుగారు  కొంచెంఅటూ ఇటూగాఅంతే ననుకోండి. కాకపోతే,  కంచం మీద ఆమెసార్వభౌమాధికారం పెరిగిపోతోందన్నమాట! పొద్దున్నే లేచీ లేవగానే, వేడి వేడికాఫీ తాగాలావద్దా?  మీరేచెప్పండి! మా అమ్మాయి ససేమిరావద్దంటుంది.  ఖాళీ కడుపుతో కాఫీమంచిది కాడు. ముందు ఏదైనాతినాలి… Read More సోలెడు సోలెడు ముచ్చాలిస్తా !

ఒకానొక శబ్దం… తరంగమై !

ఇవ్వాళ ఉదయం నిశ్శబ్దంగా పలకరించింది ఒక శబ్ద తరంగం. దూరాల తీరాలనుంచి. దృశ్యాదృశ్యమై. *** నేనెంతో ఇష్టంగా రాసుకొన్న పుస్తకం “దృశ్యాదృశ్యం.”  నాకు చిన్నప్పటి నుంచీ గణితమంటే తగని అభిమానం.  ఎంత వేగంగా ఎంత సులువుగా ఎంత తక్కువ నిడివితో లెక్కను చేయాలా అని ప్రయత్నిస్తూ ఉండేదానిని. ఒకే లెక్కని లెక్కకు మిక్కిలి పద్దతులతో సాధించాలని ప్రయత్నించేదానిని. ఒక్కోమారు వీలు పడేది.ఒక్కో మారు వీలు పడేది కాదు. చిక్కులెక్కయి ముడి పడేది  ముఖ్యంగా , త్రికోణమితి ! నమ్మండి.… Read More ఒకానొక శబ్దం… తరంగమై !

మరి మీరిది విన్నారా?

రిషివ్యాలీ ఎప్పుడు వెళ్ళినా,పక్షుల కిలకిలారావాలు తెలతెలవారక మునుపే తట్టి లేపేవి. ఆ పై ముసిచీకట్లు విచ్చుకోక మునుపే , వెచ్చటి కాఫీ ని గుమ్మం దగ్గర పెడుతూ , అతిథిగృహం నిర్వాహకుడు ,గోపాల్ , తలుపు మీద మునివేళ్ళతో తట్టే చప్పుడు. “గుడ్ మార్నింగ్ అక్కా “అన్న పలకరింపుతో పాటు మర్యాదగా.  దూరంగా లయబద్దంగా మోగే ఉదయపు PT గంట కొండాకోనల్ని చుడుతూ వచ్చి, ఇక పడక వీడమని మృదువుగా చేప్పేది.ఈ సారి మటుకు, అదాటున లేచి కూర్చున్నా. అప్పటికింకా చీకట్లు వదలనే లేదు.… Read More మరి మీరిది విన్నారా?

తన నాలుగు కాళ్ళపై !

రిషీ వ్యాలీ కొండల్లో కోనల్లో పిన్నా పెద్దల అభిమానం సంపాందించుకుంది లింపెట్.  కాలు వంకర పోయిందేమో కానీ .అందరి గుండెల్లో చోటు చేసుకుంది. చూస్తుండగానే కాలంలో కలిసిపోయింది. ఆ అభిమానాన్నే మిగిల్చి . శ్రీ నందకుమార్ గారు, పృధ్వి,అసుతోష్  తదితరుల (ISC 2012)   చేతులలో ఇలా మలచబడి ,  రిషీ వ్యాలీ ఆర్ట్స్ గది ముందు,   ఠీవీగా నిలబడింది ! తన నాలుగు కాళ్ళపై !  ఇదుగోండి ఇలా ! పిల్లలని పలకరిస్తూ. పెద్దలని పరామర్శిస్తూ. ప్రతిపూటా. 

ఇల్లు ఖాళీ చేసి

“పాఠాలలో కెల్ల ఏ పాఠం సులువు” అని పంతుళ్ళను ఎవరూ అడగరు కానీ,మనసా వాచా చెప్పాలంటే, ఏ పూట పాఠం ఆ పూటకు కఠినమే !అదే,కర్మణా చెప్పాలనుకోండి, కొట్టిన పిండిని అలా పిల్లల మీదకు జల్లించేసి రావొచ్చుస్మీ!అందుకే కాబోలు.నా మట్టుకు నాకు , పట్టుమని పదిపాఠాలు… చెప్పానో లేదో, చప్పున నచ్చాయి. కాలాల పాఠాలు. అంటే, Teaching Tenses  అన్న మాట.ఆంగ్లంబున మన తెలుగుకు మల్లే ,ముచ్చటగా మూడు కాలాల్లో ముగించ జాలం కనుక , పన్నెండు కాలాలను పండిన… Read More ఇల్లు ఖాళీ చేసి

ఆకలి ..అక్షరం… పిల్లల గోస

ఇవ్వాళ ఒక ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని కలిశారు. ఈ రోజు మా ఊరంతా  కన్నీరు మున్నీరయ్యి ఉంది.ఒక ఉపాధ్యాయుడికి అంతిమవీడ్కోలు ఇస్తూ . వారన్న మాటలు ఆ వరదలోనే కొట్టుకు పోగూడదు కదా అన్నారామె.వారు   ఏమన్నారంటే ,“నిన్న మొన్నటి వరకు ,ఎక్కడెక్కడి పిల్లలను బడిలో చేర్పించడానికి తిప్పలు పడ్డాం.పిల్లల భవిష్యత్తు ఏమిటి ?” అన్నారాయన. “అయినా, నాట్లనీ  కలుపులనీ బడిలో ఓ అడుగు మడిలో ఓ అడుగు  వేయడం మా బడి పిల్లలకు రివాజు.ఇక, ఫిబ్రవరి… Read More ఆకలి ..అక్షరం… పిల్లల గోస

అప్పగించితిమమ్మా…

అప్పగించితిమమ్మా…ఒప్పులకుప్పా…నీకిపుడు.. ఓ బుజ్జి గణపయ్యనూ.. అప్పగించితిమమ్మా…ఓ చిట్టి తల్లీ..నీకిపుడు.. ఆ పుడమి  తల్లినీ.. అప్పగించితిమమ్మా…ఓ  బుజ్జి తల్లీ..నీకిపుడు.. ఆ చెట్టూచేమలనూ….ఆ గుట్టామిట్టలను…ఆ నదీనదాలను..ఆ కొండాకోనలనూ ఆ సకలచరాచర జీవరాశులనూ.. అప్పగించితిమమ్మా…ఒప్పులకుప్పా…నీకిపుడు.. ***నిజమే! కానీ..ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి మనం నిజంగానే …ఈ రోజున్న జీవసంపదను భద్రపరిచి అప్పగించగలమా?ఒక సమగ్ర ప్రణాళికా ఒక సంపూర్ణ అవగాహనా లేనిదే? ఎలాంటి వారసత్వ సంపదనుమన బిడ్డలకు మనం ఇస్తామన్నదాంట్లోనేగా మన విజ్ఞత అగుపడేది !ఈ ప్రకృతి మన చిట్టితల్లులకూ బుజ్జి తండ్రులకూ మనమివ్వబోయే  సహజ వారసత్వసంపద.… Read More అప్పగించితిమమ్మా…

పచ్చటి బడిలో పాఠాలు

అమ్మకు జేజే . నాన్నకు జేజే .చదువులు చెప్పే గురువుకు జేజే.అందరికీ సహజగురువు ..ఆ  ప్రకృతిమాతకు  జేజే !http://www.youtube.com/watch?v=K9b63nSt9jYఅలా పచ్చటి బడిలో పాఠాలు చెప్పే గురువులూ.. చెప్పించుకొనే అవకాశము.. అందరికీ దక్కితే ఎంత బావుణ్ణు!   

బడి గంట గణ గణ మంటే ..!

బతకలేక బడిపంతులనేవారు ఒకానొకప్పుడు. వారు అప్పుడూ ఇప్పుడూఅంతే.  పంతుళ్ళలోపుణ్యపంతుళ్ళు వారు ! ఇకపోతే, బతకనేర్చిన బడిపంతుళ్ళుమనం చూస్తుండగానే, ఇంతై ఇంతింతైతామింతై …పోతూ ఉన్నారు. వారి సంగతీ అటుంచండి. బతకడానికి బడి పంతుళ్ళయినవారు …ఉద్యోగధర్మమోయాజమాన్యనిర్బంధమో విధివిధానమో నిర్వర్తించకతప్పదు కదా” అనవచ్చు!   అయిప్పటికీ, ఒకానొక పాఠం …ఒక్కపంతులు /పంతులమ్మ..మనల్ని పల్టీలు కొట్టనీయకుండా..తిన్నని బాటలోకిమళ్ళిస్తుంది. నయానో భయానో.   చెవి నులిమో .మొట్టికాయవేసో.  మెత్తగా మాట్లాడో.గట్టిగా పోట్లాడో. సరిగ్గా .. అలాంటి ఆర్ద్రతతరగతి గదిలోఆవిరయిపోయినట్లుగా  తోస్తోందికదా ! పాఠ్యప్రాణాళికల్లో పరీక్షలనిర్వహణల్లో… Read More బడి గంట గణ గణ మంటే ..!