బడి గంట గణ గణ మంటే ..!

బతకలేక బడిపంతులనేవారు ఒకానొకప్పుడు.
వారు అప్పుడూ ఇప్పుడూఅంతే.  పంతుళ్ళలోపుణ్యపంతుళ్ళు వారు !
ఇకపోతే, బతకనేర్చిన బడిపంతుళ్ళుమనం చూస్తుండగానే, ఇంతై ఇంతింతైతామింతైపోతూ ఉన్నారు.
వారి సంగతీ అటుంచండి.
బతకడానికి బడి పంతుళ్ళయినవారుఉద్యోగధర్మమోయాజమాన్యనిర్బంధమో విధివిధానమో నిర్వర్తించకతప్పదు కదాఅనవచ్చు!  
అయిప్పటికీ,
ఒకానొక పాఠంఒక్కపంతులు /పంతులమ్మ..మనల్ని పల్టీలు కొట్టనీయకుండా..తిన్నని బాటలోకిమళ్ళిస్తుంది.
నయానో భయానో.  
చెవి నులిమో .మొట్టికాయవేసో.
 మెత్తగా మాట్లాడో.గట్టిగా పోట్లాడో.
సరిగ్గా .. అలాంటి ఆర్ద్రతతరగతి గదిలోఆవిరయిపోయినట్లుగా  తోస్తోందికదా !
పాఠ్యప్రాణాళికల్లో పరీక్షలనిర్వహణల్లో ఫలితాలకొలతల్లో మునిగితేలుతూ.
ఒకానొక పాఠంఒక్కపంతులు /పంతులమ్మనిరాశలో ముంచి నిస్పృహలో దించి  మనల్ని పక్కదోవ పట్టించవచ్చు !
పిల్లల కడుపు నిండిందోలేదో చూసేతీరిక గానీ, బిడ్డకంట నీరుందో కనుల్లోకలలు దాగున్నాయో మునివేళ్ళలో కళలున్నాయో గ్రహించ గలిగే లోగానే, బడిగంట గణగణ మంటొందికదా !
బడిలో నేర్చే పాఠాలు బతుకుతెరువు కొరకు పరిమితమవుతూ పోతుంటే ..అసలుసిసలు పాఠాలు గుణపాఠాలు నేర్పేందుకు మన బతుకు బడి సదా సిద్ధమై ఉంటుంది !
ఒకమారు తడబడి నపుడు , తోలిసారి తప్పు కంటబడినపుడు , ముసిచీకటిలో ముసురుకొట్టున్నప్పుడు, వడగాడ్పులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు,
నొప్పించక …
తెలివిడిగా మనకు ఒక వెలుగు బాట చూపిన వారందరూ మన పంతుళ్ళేగా!
వారందరికీ సవినయ నమస్కారాలు.
పాఠాలన్నీ మనజీవితాంతం అందుతూనే ఉంటాయి
బతుకు బడి నేర్పేపాఠాలను అర్ధంచేసుకోవడానికి , మన జీవిత కాలంసరిపోతుందా?
బడిలోనో కళాశాలల్లోనో విశ్వవిద్యాలయాల్లోనూ… 
పాఠం చెప్పనుపూనుకొన్న వారందరికీ జేజేలు.
మీరు విన్నపాలు వినవలే ఒక మారు.

 http://www.youtube.com/watch?v=kaWGFABZNjE
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s