ఆకలి ..అక్షరం… పిల్లల గోస

ఇవ్వాళ ఒక ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని కలిశారు.

ఈ రోజు మా ఊరంతా  కన్నీరు మున్నీరయ్యి ఉంది.
ఒక ఉపాధ్యాయుడికి అంతిమవీడ్కోలు ఇస్తూ .

వారన్న మాటలు ఆ వరదలోనే కొట్టుకు పోగూడదు కదా అన్నారామె.
వారు   ఏమన్నారంటే ,
“నిన్న మొన్నటి వరకు ,ఎక్కడెక్కడి పిల్లలను బడిలో చేర్పించడానికి తిప్పలు పడ్డాం.పిల్లల భవిష్యత్తు ఏమిటి ?” అన్నారాయన.
“అయినా, నాట్లనీ  కలుపులనీ బడిలో ఓ అడుగు మడిలో ఓ అడుగు  వేయడం మా బడి పిల్లలకు రివాజు.
ఇక, ఫిబ్రవరి నెలంటే మాకసలే అదురు.మినుముల కోతల  కాలం కదా?  మాకేమో పరీక్షల రోజులు.
మధ్యాహ్నం  దాకా కూలికి వెళ్ళి ,బోజనం వేళకు  బడికి వచ్చే పిల్లల కోసం కాపు కాయాలి.
వాళ్ళని నయానో భయానో నచ్చచెప్పుకొని , తరగతి గదిలోకి  తీసుకు రావాలి. కాళ్ళా వేళ్ళా పడి నాలుగు అక్షరం ముక్కలు నేర్పి పరీక్షల గదిలో కూర్చో బెట్టాలి ! లేకుంటే పై అధికారుల నుంచి బాజాలు ! ఫలితాలు వెలువడిన రోజున కాజాలు !
అనకూడదు కానీ, పిల్లలు బడికి రావడం లేదంటే ,ఒక్క పూటన్నా తీరే వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారు ? ” ఆమె ఆవేదన చెందారు.
“మరి వాళ్ళు కూలో నాలో చేసుకోక తప్పదు కదా! “అన్నరామె దిగాలుగా.
” ఇన్నిన్ని సెలవలు వస్తోంటే. ఇక వాళ్ళకు బడి అలవాటు తప్పుతుంది కూడా. ఇప్పటికే ఇంటింటికీ వెళ్ళి బడి రారండని  బతిమిలాడుతున్నా ఫలితం  అంతంత మాత్రం.
కొడవలి పట్టే చేతుల్లో పలకలు పెడితిమి. చెలకల దారి బట్టిన వారిని బడికి మళ్ళిస్తిమి. మరలా వాళ్ళంతా గొర్రెలు మేపుకోవాల్సిందేనా ? గుట్టమిట్టా బట్టి?
అందులోనూ ఆడపిల్లల విషయం.మరీ దారుణం.ఎవరెవరు ఏ ఏ దారిన మళ్ళించబడతారో !
ఇప్పటికే ,పట్టుమని పదో తరగతి గట్టెక్కుండానే పెళ్ళిపీటలెక్కి,  ఏడాది   తిరిగే లోగానే ,బిడ్డను  చంకలో వేసుకొని వస్తూఉంటారు. బోర్డు పరీక్షలకు వెళ్ళే స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పడానికి.

***
ఆకలి తీర్చాడానికేగా అక్షరం.
ఆకలితో అక్షరం ఎలా అబ్బుతుంది?
ప్రభుత్వ బడి హాజరు పట్టీ నానాటికి ఖాళీలు ఏర్పడు తున్నాయంటే ఎందుకో తెలుస్తూనే ఉంది కదా?

ప్రభుత్వ బడి ఉపాధ్యాయుడికి నివాళి
వారి పిల్లలపట్ల ఆ బడి పంతుళ్ళ ఆవేదనను అర్హ్దం చేసుకోవడంలోనే ఉంది కదా?
అక్షరం ఆకలి నుండి రక్షణను ఇవ్వాలనే  కదా అందరం ఆశించేది ?

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s