ఫోటో పండగన్న మాట!

4th class 1977-78  Bharatheeya Vidya Nikethan, Mahaboob Nagar
L to R : Vinita, Maruthi,Nirmala,SudhaAruna, Me, Geetha, Rathi
Standing Exactly behind me : Raghu , Right to him, Ravikanth 
then, Ramesh,Srinivas and the Vijayabhaskar (The Last Boy on the LEFT)
Our Social Teacher and Class Teacher  Sri RamaKrishna Reddy garu

మా బళ్ళో ఫోటోఅంటే మాఅందరికీ పండగన్నమాట!

ఎవరి టీచర్లు వారికిచకచకాచక్కటి ఫోటో ఎలా తీయించుకొనవలెను ?” అని పాఠాలు చెప్పేవారన్న మాట.
ఎక్కువ గాఎలా నవ్వకూడదు .. తక్కువగా ఎలా నవ్వ కూడదు.. ఎలా నిటారుగానిలబడాలి ..ఎలా వంగి పోకూడదుగడ్డంవంచాలా పైకెత్తాలాకళ్ళార్పాలా ఆర్పకూడదా … ఫోటో తీసినంతసేపూ నోటికి తాళం ఎలా వేయాలి …ఇలాఎన్నెన్నో  బోధనలన్నమాట!
యూనీఫాం పెళ పెళలాడుతూ  ఉండాలనీ .. కాలి జోళ్ళుతళ తళామెరవాలని మా పిల్లలందరికీ ఉత్తర్వులు.
పంతులు గారు ఇచ్చిన ఆ ఫోటోనియమావళిని తీసుకెళ్లి అమ్మ కివ్వడం ఆలస్యం..
ఇక ఇంట్లో ఆరంభం.
నాకున్న బడిబట్టల్లో మంచిజతను తీసి, తళతళలాడేలా ఉతికేసి..దానికి సబ్బుఅరిగేదాకా  నురగలుతెప్పించింది మేమే ననుకోండి.. ఆ పై రాణీపాల్లోఅప్పుడే వార్చిన  వేడి వేడిగంజిలో ముంచెత్తిఆపై మధ్యాహ్నంఎండలో ఆరేసి.. కాకోపిచ్చుకో పాడ చేయ కుండా .. కాపలాకూర్చుని.. ఆరీ ఆర గానే .. మడతేసుకొని.. వీధి చివర  ఇస్త్రీ పెట్టె దగ్గరికి పరుగోపరుగు.
అక్కడేమో అప్పటికే బారులుతీరిన మిత్రమండలి.
” ఇచ్చేసి పోమ్మా  చేసేసి పెడతాం” అంటేఊరుకొనే రకాలమా.. మేమూ.. పనేదో కానిచ్చే దాకా.. బొగ్గులకుంపటి పక్కనేమిడి గుడ్లతోఎదురుచూపులు. చెవిలో జొరీగల్లా మేం పెట్టేపోరు భరించలేక ..తటాలుననీళ్ళు చిలకరించేసిగబ గబాపెట్టిని రుద్దేసి .. మా బట్టల జతమా చేతిలోపెట్టేసి ..  డబ్బులడిగితే.. “నాన్న గారి ఖాతాలోరాసుకోండి..” అని ధీమా గా   చెప్పేసి తుర్రుమనడమే  !
” సరే పిల్లలెమ్మని ఊరుకొంటున్నానంటే”
“మా బడిలోఫోటో తీస్తున్నారుతెలుసా! మరినా డ్రెస్స్బాగా  లేక పోతే  మీ వెంకటి  ఏమిస్త్రీచేశాడని అందరూనవ్వరూ..? “
అవ్ మల్ల ! అంతే , మనపని అయిపోవడంఏమిటి.. చక్కగాచాచిన రెండుచేతుల మీద.. వేడి వేడిదోస వడ్డించినట్లుఇస్త్రీ చేసిన యూనిఫాం ను వడ్డించడమేమీ .. అన్నీ క్షణాల్లోజరిగి ఫొవాల్సిందేవీధిలో అలాతోమిన బట్టల్నితీసుకెళుతుంటే మహా రాజసంగా ఉండేదిలే. దారిపొడువునాఅడిగిన వాళ్ళకీఅడగని వాళ్ళకీ..
 “జెండాపండగ కాదు.. మా బళ్ళో ఫోటోతీస్తారు రేపు!” చెపుతూ
అడుగులో అడుగేస్తూ సాధ్యమైనంతనిదానంగావాకిట్లో  అడుగు పెట్టామా .. అమ్మ  గొంతు  ఆమడదూరానికే .
నీకేం చెప్పాను , దండెం మీదబట్టలు తీసిమడతేసి పరుపుకింద పెట్టమంటినా .. ఎటెళ్ళావ్ ..? “
అని అమ్మ కేకేస్తూఉంటే.. ముసిముసి నవ్వులతో.. చక్కగా తోమిన బట్టల్ని చేతిలో పెట్టేయడమే!
ఇక, బూట్లనేమో వాక్ష్పాలీషుతో తళతళ లాడించి .. మేజోళ్ళనీ బాగాఉతుక్కునిబొటనవేలు దగ్గర చిరుగు లుగట్రా ఉంటేకుట్టించుకొని .. రిబ్బన్లని చక్కగాఉతికి మడతేసుకిపరుపుకింద పెట్తుకొని..
 అన్నింటినీ రాత్రేతలగడ దగ్గరపెట్టుకొని .. ఒక చేయి వాటి మీదవేసి మరీపడుకొనే వారం.
ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా. ప్పుడెప్పుడు బడికెళ్ళి ఫోటో తీయించుకోవడమా అని!
 “తొందరగా నిద్రపోండి. లేకుంటేరేపు ఫోటోలో సరిగ్గాపడరు.! “

అమ్మహెచ్చరిక .

మాభారతీయ విద్యానికేతన్ఎదురుగా షాబుద్ధీన్బంగ్లా. పావురాలనెలవు. ఆ ఇంటిముంగిట కాంపౌండ్చుట్టూ అశోకచెట్ల వరుస. పచ్చిక తివాచీమధ్యలో  ఫౌంటైన్లు . అవి ఎప్పుడూనీళ్ళు చిమ్మడంజ్ఞాపకం లేదనుకోండి.
ఇక, ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనాలు తినేది అశోక చెట్లకిందేఅన్నాలు తినడం ఆలస్యం పావురాళ్ళ వద్దకువెళ్లే వాళ్లం. చెట్లవరుసల నడుమచోరాట , కుంటాటఆడుకొనేవారం. చెట్ల కింద కూర్చునికథలు చెప్పుకొనేవారం.
  ఇంట్లోని మనుషులెవరూమాకు కనబడేవారు కారు. మమ్మల్ని పలకరించే వారు కారు . అక్కడెవరూలేనట్టూ అదంతామారాజ్యం అన్నట్లూ పిల్లలం తిరుగాడే వారం. మమ్మల్ని దారిలో పెట్టడానికా అన్నట్లు బడిగంట గణగణ మోగేది.
సరే, షాబుద్ధీన్గారి ముంగిటఅశోక చెట్లముందుమా తరగతి అబ్బాయిలు బుద్ధిమంతులుకదా..
చెప్పగానేచెట్ల కిందవరసగా కుర్చీలువేసేసారుఇక ఒక్కో తరగతిలో హాజరయినపిల్లల  ప్రకారం ఆ అమరికను మార్చుతూపోయారు.
 మా తరగతిలో రోజు అపర్ణరాలేదు. శశికిరణ్ఇంకా మాబడిలో చేరలేదు.
విజిల్వేయడం ఆలస్యంఅందరం వరసగాకూర్చున్నాం. అబ్బాయిలు గబ గబా  బెంచీలు ఎక్కేసారు. వాళ్ళ కాళ్ళజోళ్ళతొసహా
ఇటుచూడండి అటుచూడండి. గడ్డంపైకెత్తండి. కళ్ళు దించండి.” ఇక ,ఫోటోగ్రాఫరుగారి ఉత్తర్వులు.మాటి మాటికీకెమెరా మీదవేసిన నల్లబట్టలోనుంచి ముఖంబయటకు పెడుతూ.
 చేతులుఎలా పెట్టలోనుంచి ఎంతమోతాదులో నవ్వాలో వరకు ..ఆయన గారుఆయన అసిస్టెంట్లుచెపుతూ ఉండగా.. కదలకమెదలక .. నవ్వులుచిందిస్తూ .. ఎండలో నానుతూ .. ఇదుగోండి ఇలాఅందరం.
ఎండ వెలుగు సరిచూసుకొనిమమ్మల్ని చక్కగా ఫోటో తీసేసరికి  మధ్యాహ్నం వేళయ్యింది.
మరోరెండు వారాలకుపసుపుపచ్చ అట్ట మీద అంటించి,   
ఇదుగోండి.. ఫోటోచేతిలో పెట్టారాఇక ఏడుపొక్కటేతక్కువ.
అపర్ణలేదని కాదు.  
ఫోటోతీసే రోజునమా అమ్మ  చిలక్కిచెప్పినట్లు ఏం చెప్పింది? నూనె రాసిబిగించి రెండుజళ్ళేస్తు న్నంత  సేపు చెప్పిందాలేదా .. రిబ్బన్లుముడేసినప్పుడూ చెప్పింది.మరిచి పోతాననుకొని మొట్టికాయ వేసి మరీ గట్టిగా చెప్పింది. ఒక జడముందుకు మరోటివెనక్కు వేసుకోమని.  నేనెలామర్చిపోయాను..?
గుర్తొచ్చింది.
పూట బళ్ళోఅడుగు పెట్టగానేమా పంతులమ్మచివాట్లు.. “ తెల్ల జాకెట్టు వేసుకు రమ్మంటే, దాని మీద ఆ  గులాబిపువ్వేంటి ?”అని
పాపం..మా అమ్మ!
 అప్పుడేమ్యాటీ బట్టముక్కనుపాలియస్టర్ మీద టాకాలు వేసి పువ్వు కుట్టాక,  దారాలులాగేయడం అనేకళను నేర్చు కొంటోంది. ఖాళీగా కనబడింది నా  బడి జాకెట్టేగా !  చక్కగా గులాబి పువ్వు కుట్టేసింది!
ఆకులతోసహా. ఎరుపూపచ్చ దారాలతో.
మరిమీకు పువ్వు కనబడుతోందా?
ఏదిఏమైనా రోజు మాఅమ్మ ఫోటో చూసిఎన్ని మొట్టికాయలేసిందంటే, తరువాతఫోటోలన్నిటిలో నా రెండు జళ్ళూ బుద్ధిగాముందుకు వాలిఉంటాయన్న మాట !
ఎన్నడూరెండు కాళ్ళూకుదురుగా ఒక చోట పెట్టిన పాపానపోని మాతరగతి అల్లరి అబ్బాయిలు ముఖ్యంగా, రఘూ.. రవికాంత్ .. ఇంతబుద్ధిగా నిల్చున్నారంటే ,అందునా  ఫోటో తీసినంతసేపూతిన్నగా నిలబడ్డారంటేనాకయితే ఇప్పటికీ నమ్మశక్యం కావట్లేదు!
నమ్మకతప్పదండోయ్!
ఇప్పటికిపాతికేళ్ళకు పైగా బెంచీ మీదఅలా నిల్చునేఉన్నారు !
ఏంఅల్లరి చేసిఉంటారు చెప్మా?
***
 చిన్ననాటి మంచి మిత్రులు రఘు రవికాంత్ అపర్ణ శ్రీలత లను  తిరిగి కలుసుకొన్న సంతోష సమయాన ..    ఒక పచ్చటి జ్ఞాపకం. 
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

4 thoughts on “ఫోటో పండగన్న మాట!

 1. Chandra Latha Garu
  Nice memories!
  These are the most valuable treasures.
  I had similar experience in summer when I went to my home. My kids and my brother kids were asking each and every kid name in the group picture
  It was quite an experience looking at these treasures and sharing with kids.
  I do read your blog but never commented as I am not so good in typing telugu.
  I like all your works and specially I envy you on you being hanging with kids all day night. Even I love being with kids and be one among them with such plain hearts.

  Surabhi

  మెచ్చుకోండి

 2. అప్పుడు కాదండీ… ఇది రాస్తున్నప్పుడు నా ముఖం చూడాల్సింది మీరు!
  దాదాపు 30 ఏళ్ళ తరువాత మా చిన్ననాటి Best Friends మి కలుసుకొన్నాం. Thanks to FB
  వారి జ్ఞాపకంగా రాసాను ఇది.
  ఆ బడి శ్రీమతి దుర్గాభక్తవత్సలం గారు స్థాపించినది.వారు తరువాత శ్త్రీ సంక్షేమ శాఖ కు మంథ్రి గా వ్యవహరించారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల్లో.
  పాలమూరులో అన్ని బడుల్లో దాదాపుగా సంస్కృతి ఒకటే. చిన్న వూరు కాబట్టి. మా రఘు రవి మధ్యలో వేరే బడికి వెల్లి పోయినా , అందరం ట్యూషన్లలో కలుసుకొనే వారం. కలిసే ఆడుకొనే వాళ్ళం.
  కపటం లేని పసితనపు రోజులవి.
  మా లాగే మా వూరు.
  నేను రాసిన కొన్ని కథలకు, నా మొదటి నవల “వర్ధని”కి ఈ బడే స్పూర్తి.నా బాల్యస్నేహితులు అందించిన స్నేహమే , నాలో జీవితం పట్ల గొప్ప ప్రేమను ,మానవ సంబంధాల పట్ల సద్భావనను నింపాయనుకొంటాను.జీవన వైవిధ్యాన్ని పరిచయం చేసింది వారే.అక్కడే. ఆ ముచ్చట్లన్నీ ముందు ముందు:-)
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s