సజల నయనాలతో.

Sri Kotapati Murahari Rao garu, నాన్న గారు తరుచూ అంటూ ఉండే వారు. కొందరిని చూసి ఎలా జీవించాలో నేర్చుకోవాలి.  మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో! మంచికీ చెడుకి నడుమ ఉండే ఆ పారదర్శక  పరిధిని , పరిమితులను అర్ధం చేసుకోవడంలోనే జీవితం ఆవిష్కరించబడుతుంది కదా…? ఆ పరిమితులను అధిగమించే ప్రయత్నమే , ఆ ప్రమేయాలను ఎదురొడ్డి నిలబడే పోరాటమే కదా… జీవితం. మంచి ని పెంచుకోమన్నారు , చిన్న చిన్న సంతోషాలతో జీవన  వైవిధ్యాన్ని  ఆనందించడం … Read More సజల నయనాలతో.

సన్ను … మూను…కుసింత పెట్రోల్ !!!

 ఇవ్వాళ  మా  బుజ్జి పిల్లలకు సూర్యుడి పాఠం చెప్పబూనాను. మా కోసమేనా అన్నట్లు  , పొద్దుటే Young World ముఖ చిత్రం. భూమి నుంచి మంగళ గ్రహానికి పంపిన ఉపగ్రహ చిత్రం .   దాని తోక వైపు నుంచి!మామూలుగా మాట్లాడుకొంటూ , పాఠాలాడుకొంటాం కదా… అలాగే  అడిగాను ” మొన్న మన వూరి నుంచి పంపిన రాకెట్టు   అకాశంలో పై పైకి పోతూ పోతూ ఉంది కదా , Mangalyaan ! BY Md.Tasneem (3yrsOld)… Read More సన్ను … మూను…కుసింత పెట్రోల్ !!!

చినుకులా రాలి

మా పిల్లలకు నచ్చినవీ…మా పిల్లలు మెచ్చినవీ…కొన్ని వాన చినుకులు!అన్నట్లు ,కొన్ని రచనలు స్వయంగా వారు చేసినవే ! బుడుగో బుడుగో http://prabhavabooks.blogspot.in/2013/11/blog-post_17.html అప్పుడు వచ్చే వర్షం http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_25.html వర్షమై రావమ్మ http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_22.html వర్షాలమ్మా వర్షాలు http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_19.html వర్షపు చినుకా! http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_17.html All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

కొత్తగూడెం ఫర్మానా !

ఉండబ్బా! కాస్త ఈ బొమ్మేసి వస్తా !   నవంబరు నెల రాగానే ,..  ఎక్కడెక్కడి పిల్లలు … ఆ పిల్లలను వెన్నంటి ఉండే అమ్మానాన్నలు, పంతుళ్ళు పంతులమ్మలూ, బడులూ సంస్థలు … బోలెడంత హడావుడిగా “కళ కళలాడుతూ” ఉంటారు. బ్రష్షులు కడిగేస్తూ.  పెన్సిళ్ళు చెక్కేస్తూ.రంగులు కలిపేస్తూ. కాగితాలు పులిమేస్తూ అంతేనా, పాటలు పాడేస్తూ. ఆటలు ఆడేస్తూ. నాట్యాలు చేసేస్తూ.నాటకాలు ఆడేస్తూ. సినిమాలు చూసేస్తూ. బహుమతులు సాధిస్తూ. కానుకలు పోగేస్తూ. చేయ గలిగిన వారికి చేయగలిగినంత ! అవునండి.… Read More కొత్తగూడెం ఫర్మానా !

“ చీకటివెలుగుల రంగేళీ… ”

10.9.1990 “అదేంటి దీపావళి వెళ్ళాక.. తీరిగ్గా పాడుతుందీవిడ “అని అనుకుంటున్నారా మీరు ?పరవా లేదు లేండి. నేనేమీ అనుకోను. అయినా ,అనుకున్న వారికి అనుకున్నంత ! ఒక్కోసారి ,  ఏదైనా అనుకున్నామనుకోండి.. అంతో ఇంతో జరిగేదాకా ఊరకుండలేం కదా..! ఆ తలపు  వండ్రగిపిట్టలా మనను తొలిచేస్తూ వుంటుంది .  ఒకానొక రోజు నాకెందుకో మా బుజ్జితల్లితో ఫోటో తీసుకోవాలని బుద్ధి పుట్టింది! అలా ఇలా కాదండి. అసలు సిసలు నలుపుతెలుపు ఫోటో ! మనుషులన్నాక ఇలాంటి చిన్న చిన్న… Read More “ చీకటివెలుగుల రంగేళీ… ”

"దీపాలోయ్ దీపాలు !"

“దీపాలోయ్ దీపాలు !” తను తయారు చేసి, రంగులేసిన ప్రమిదను తల మీద  కుదురుగా పెట్టుకొని,  బిగ్గరగా కేకలేయడం మొదలెట్టాడు  సాయి లోకేశ్. ఎవరో కూర్చోబెట్టి మరీ నేర్పినట్టు! “దీపాలోయ్ దీపాలు !” దొరికిందే సందని వాళ్ళ ప్రమిదలూ తెచ్చి , సాయి తల మీద పెట్టారు  ప్రభవ ప్రబుద్ధవరాణ్యులు! ఇక అంతే ,కుదురూ లేదూ అదురూ లేదు! బెదరంటే అసలే ఎరుగరు కదా వీరు !ఇక ,బడంతా తిరుగుతూ అందరూ ఒకరిని మించి ఒకరు కేకలు…దద్దరిల్లేలా. “దీపాలోయ్ దీపాలు!” ఎక్కడ వాళ్ళ హడావుడిలో … Read More "దీపాలోయ్ దీపాలు !"