సజల నయనాలతో.

Sri Kotapati Murahari Rao garu,

నాన్న గారు తరుచూ అంటూ ఉండే వారు.
కొందరిని చూసి ఎలా జీవించాలో నేర్చుకోవాలి. 
మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో!

మంచికీ చెడుకి నడుమ ఉండే ఆ పారదర్శక  పరిధిని ,
పరిమితులను అర్ధం చేసుకోవడంలోనే జీవితం ఆవిష్కరించబడుతుంది కదా…?
ఆ పరిమితులను అధిగమించే ప్రయత్నమే ,
ఆ ప్రమేయాలను ఎదురొడ్డి నిలబడే పోరాటమే కదా…
జీవితం.

మంచి ని పెంచుకోమన్నారు ,
చిన్న చిన్న సంతోషాలతో జీవన  వైవిధ్యాన్ని  ఆనందించడం  ఎలానో జీవించి చూపారు.
అందరిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది.  దానిని పచ్చ బరిచేందుకు ప్రయత్నించ మన్నారు.
ఆ ప్రయత్నాలలోనే , ఆ ప్రయాసలలోనే ,

Rishi Valley School, Dr.KumaraSwamy, Dr.Radhika Hegberger ,
Raghuveeraa Reddy garu, Kotapati  Murahari Rao garu and me.

కొద్దో గొప్పో చెడును కూదా
భరాయించేస్తూ,
చీకటిని అంగీకరించేస్తూ,
కాపట్యాన్ని క్షమించేస్తూ  …
మిరుమిట్లు గొలిపే వెలుగు సత్యాలకు గుడ్డి వాళ్ళయినట్లయ్యింది.

స్థితిగతులేమిటో తెలుసుకొని మెసలమన్నారు.
ఇవాళ్టి  స్థితేమిటి ? ఎటు వైపు గమనగతి సాగుతోంది? తెలివిడి తో మెలగమన్నారు.

చిన్న గీత ముందు పెద్దగీత  … చిన్నకష్టాల ముందు పెద్ద కష్టాలు.!

అయ్యో తండ్రీ,!
కష్టాలకు సుఖాలకు చిన్నాపెద్దలుంటాయా?

అయ్యో నాన్నా !
తప్పొప్పులకు తగ్గొగ్గులు ఉంటాయా ?

జీవితం పట్ల
బోలెడంత నమ్మకంతో…
నిలదొక్కుకొని  నిలబడేందుకు…
తిన్ననైన తోవలో సాగేందుకు..
ప్రయత్నం చేస్తూనే ఉంటాము.
మీ స్పూర్తి   …. మీ మూర్తిమత్వమూ
మా తోడురాగా.

సజల నయనాలతో…
సజీవ జ్ఞాపకాలతో !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

2 thoughts on “సజల నయనాలతో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s